Team India Diwali Celebrations: టీమిండియా దీపావళి సెలబ్రేషన్స్ చూశారా.. సూపర్ ఫొటో షేర్ చేసిన రాహుల్-team india diwali celebrations kl rahul shared the photo and wishes happy diwali ,క్రికెట్ న్యూస్
తెలుగు న్యూస్  /  క్రికెట్  /  Team India Diwali Celebrations: టీమిండియా దీపావళి సెలబ్రేషన్స్ చూశారా.. సూపర్ ఫొటో షేర్ చేసిన రాహుల్

Team India Diwali Celebrations: టీమిండియా దీపావళి సెలబ్రేషన్స్ చూశారా.. సూపర్ ఫొటో షేర్ చేసిన రాహుల్

Hari Prasad S HT Telugu
Nov 12, 2023 10:17 AM IST

Team India Diwali Celebrations: టీమిండియా దీపావళి సెలబ్రేషన్స్ లో మునిగి తేలింది. దీనికి సంబంధించిన ఓ సూపర్ ఫొటోను వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

టీమిండియా దీపావళి సెలబ్రేషన్స్
టీమిండియా దీపావళి సెలబ్రేషన్స్

Team India Diwali Celebrations: టీమిండియా ఒక రోజు ముందే దీపావళి జరుపుకుంది. అసలు పండుగ అయిన ఆదివారం (నవంబర్ 12) నెదర్లాండ్స్ తో చివరి లీగ్ మ్యాచ్ ఆడాల్సి ఉండటంతో శనివారమే ఇండియన్ టీమ్ ఈ దీపాల పండుగను ఘనంగా జరుపుకోవడం విశేషం. దీనికి సంబంధించిన ఫొటోను వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

మా అందరి తరఫున మీ అందరికీ హ్యాపీ దివాలీ అంటూ కేఎల్ రాహుల్ ఈ ఫొటో పోస్ట్ చేశాడు. తన సొంతూరు బెంగళూరులోనే టీమిండియా వరల్డ్ కప్ 2023లో తన చివరి లీగ్ మ్యాచ్ ఆడబోతోంది. పరుగుల వరద పారించే చిన్నస్వామి పిచ్ పై ఈ మ్యాచ్ ను కూడా ఘనంగా ముగించి న్యూజిలాండ్ తో జరగబోయే సెమీఫైనల్ కు కాన్ఫిడెంట్ గా బరిలోకి దిగాలని టీమిండియా భావిస్తోంది.

ఈ నేపథ్యంలో ఇండియన్ టీమ్ దీపావళి సంబరాల ఫొటో వైరల్ అవుతోంది. ఇందులో హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లితోపాటు ఇతర ప్లేయర్స్ అందరూ సాంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. ఎప్పుడూ టీమిండియా జెర్సీల్లోనే ఓ టీమ్ గా కనిపించే వీళ్లంతా ఇప్పుడిలా సాంప్రదాయ దుస్తుల్లో ఒకచోట చేరి ఫొటోలకు పోజులివ్వడం అభిమానులకు కొత్త అనుభూతిని అందిస్తోంది.

మరోవైపు దేశం మొత్తం ఆదివారం (నవంబర్ 12) దీపావళి పండగను జరుపుకుంటోంది. ఈ పండగనాడు నెదర్లాండ్స్ పై ఇండియన్ టీమ్ మరో ఘన విజయం సాధిస్తే ఈ పండగను బాణసంచాతో మరింత ఘనంగా జరుపుకోవడానికి సిద్ధమైంది. ఈ వరల్డ్ కప్ 2023లో ఇండియన్ టీమ్ వరుసగా 8 మ్యాచ్ లు గెలిచి ఓటెమెరగని టీమ్ గా దూసుకెళ్తున్న విషయం తెలిసిందే.

మరో రెండు అడుగులు (సెమీఫైనల్, ఫైనల్) వేస్తే 12 ఏళ్ల తర్వాత మరోసారి ట్రోఫీ మన సొంతమవుతుంది. అదే జరగాలని కోట్లాది మంది అభిమానులు ఆశిస్తున్నారు. బుధవారం (నవంబర్ 15) ముంబైలోని వాంఖడే స్టేడియంలో న్యూజిలాండ్ తో ఇండియా తొలి సెమీఫైనల్లో తలపడనుంది 2019 వరల్డ్ కప్ లో ఇదే టీమ్ తో సెమీఫైనల్లో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకోవాలని ఇండియన్ టీమ్ చూస్తోంది.

Whats_app_banner