Crime news : దీపావళి బోనస్ ఇవ్వలేదని.. ఓనర్ని కిరాతకంగా చంపిన స్టాఫ్!
Maharashtra crime news : మహారాష్ట్రలో దారుణం జరిగింది. దీపావళి బోనస్ ఇవ్వలేదన్న కోపంతో.. ఓనర్ని చంపేశారు ఇద్దరు!
Maharashtra crime news : దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఓ ఫుడ్ స్టాల్ ఓనర్ని, సిబ్బంది చంపిన ఘటన శనివారం తెల్లవారుజామున.. మహారాష్ట్ర నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది.
"రాజు భావురావ్ అనే 48ఏళ్ల వ్యక్తికి నాగ్‌పూర్- ఉమ్రెడ్ రోడ్డులో ఓ ఇటరీ దుకాణం ఉంది. అక్కడ ఇద్దరు పనిచేస్తున్నారు. కాగా.. ఈ ఇద్దరు దీపావళికి సొంత ఊళ్లకు వెళ్లాలని భావించారు. ఇంటికి వెళతాము, శాలరీతో పాటు బోనస్ కూడా ఇవ్వాలని అడిగారు. అందుకు ఓనర్ ఒప్పుకోలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో.. ఓనర్ పడుకున్న వేళ, కర్రలతో అతడిని కొట్టి చంపేశారు ఆ ఇద్దరు. అనంతరం భావురావ్ కారులోనే పారిపోయారు. ఆ కారు.. ఓ బ్రిడ్జ్ దగ్గర క్రాష్ అయ్యింది. దానిని అక్కడే వదిలేసి పారిపోయారు," అని పోలీసులు వెల్లడించారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ప్రస్తుతం నిందితులను పట్టుకునే పనిలో ఉన్నారు.
యూపీలో మరో దారుణం..
ఉత్తర్ ప్రదేశ్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మద్యం కొనుక్కునేందుకు డబ్బులు ఇవ్వడం లేదన్న కోపంతో.. ఓ వ్యక్తి, తన భార్యను అతి కిరాతకంగా చంపేశాడు! ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.
UP crime news : ఉత్తర్ ప్రదేశ్‌లోని కుండ్రావి గ్రామంలో శుక్రవారం జరిగింది ఈ ఘటన. అక్కడ నివాసముంటే పటాలి అనే వ్యక్తికి.. మద్యం అలవాటు ఉంది. అతను మద్యానికి బానిసగా మారి చాలా సంవత్సరాలు అయ్యింది. మందు విషయంలో భార్య మీనా దేవీతో ఎప్పుడూ గొడవపడుతూ ఉండేవాడు. ఈ క్రమంలోనే శుక్రవారం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది.
మందు బాటిల్ కొనుక్కోవాలని, డబ్బులు ఇవ్వాలని పటాలి.. తన భార్యను డిమాండ్ చేశాడు. ఆమె అందుకు ఒప్పుకోలేదు. కోపంతో అరవడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత కొన్నిసార్లు కొట్టాడు. అప్పటికీ అతని కోపం తగ్గలేదు. వంటింట్లోకి వెళ్లి.. ప్రెజర్ కుక్కర్ తీసుకొచ్చాడు. భార్య తలపై ఆ ప్రెజర్ కుక్కర్‌తో అనేకమార్లు కొట్టాడు. ఫలితంగా ఆ మహిళ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు.
Man kills wife : శనివారం ఉదయం.. మీనా దేవీ ఇంటికి వెళ్లాడు ఆమె సోదరుడు. రక్తపుమడుగులో పడి ఉన్న ఆమెను చూసి షాక్‌కు గురయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు.. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
సంబంధిత కథనం