తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  మే 4, నేటి రాశి ఫలాలు.. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించి, శివాలయాన్ని దర్శించాలి

మే 4, నేటి రాశి ఫలాలు.. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించి, శివాలయాన్ని దర్శించాలి

HT Telugu Desk HT Telugu

04 May 2024, 0:01 IST

  • Today rasi phalalu: నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) తేదీ 04.05.2024 శనివారం కోసం పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

మే 4వ తేదీ నేటి రాశి ఫలాలు
మే 4వ తేదీ నేటి రాశి ఫలాలు (pixabay)

మే 4వ తేదీ నేటి రాశి ఫలాలు

నేటి రాశి ఫలాలు (దిన ఫలాలు) 04.05. 2024

లేటెస్ట్ ఫోటోలు

మే 18, రేపటి రాశి ఫలాలు.. రేపు విలువైన వస్తువులు పోయే అవకాశం ఉంది, జాగ్రత్త

May 17, 2024, 08:25 PM

Sukraditya yogam: శుక్రాదిత్య యోగం.. ఈ మూడు రాశుల వారికి ఆదాయం పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది

May 17, 2024, 02:37 PM

ఈ రాశుల వారికి భారీ ధన లాభం- ఇంకొన్ని రోజుల్లో ప్రమోషన్​!

May 17, 2024, 12:21 PM

saturn Retrograde 2024 : శని తిరోగమనంతో రాజయోగం.. మంచి మంచి ఆఫర్లు వీరి సొంతం

May 17, 2024, 08:14 AM

3 రోజుల్లో వృషభ రాశిలోకి శుక్రుడు.. వీరి కష్టాలు తీరిపోతాయి

May 16, 2024, 04:45 PM

Mercury transit: వీరి మీద కనక వర్షం కురిపించబోతున్న బుధుడు.. అందులో మీరు ఉన్నారా?

May 16, 2024, 01:34 PM

వారం: శనివారం, తిథి : ఏకాదశి,

నక్షత్రం : పూర్వాభాద్ర, మాసం : చైత్రం,

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, అయనం: ఉత్తరాయణం

మేష రాశి

మేష రాశి వారికి ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలున్నాయి. అనుకున్న ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. ప్రణాళికాబద్ధంగా పట్టుదలతో కృషిచేయండి. పనులయందు ఒత్తిళ్ళు ఇబ్బందిపెట్టును. ఉద్యోగస్తులకు పదోన్నతులుంటాయి. వ్యాపారస్తులకు అనుకూల సమయం. మిత్రులకు సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు కలుగును. మేష రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాలను దర్శించి నవగ్రహ ప్రదక్షిణ చేయటం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా ఉన్నది. గతంలో ఆగిన పనులు పూర్తవుతాయి. అవకాశాల్ని సద్వినిగయోగం చేసుకోవాలి. గృహ, వాహన యోగాలుంటాయి. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో ప్రమోషన్లు వంటివి అనుకూలించును. విద్యార్థులకు అనుకూలమైనటువంటి రోజు. వ్యాపారస్థులకు ఖర్చులతో కూడినటువంటి సమయం. వృషభ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. శివాలయం దర్శించడం మంచిది.

మిథున రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈ రోజు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఇతరులపై ఆధారపడవద్దు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయాలి. స్వల్ప ఇబ్బందులున్నా అధైర్యపడకూడదు. పరిస్థితులకు తగ్గట్టుగా నిర్ణయాలు తీసుకుని అమలుచేయండి. మనోబలంతో పనిచేయండి. అన్నింటా విజయాలు సిద్ధిస్తాయి. మిథున రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శివపార్వతులను పూజించండి. శివాలయాన్ని నవగ్రహ ఆలయాన్ని దర్శించడం మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ రోజు మీకు అంత అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు అధికంగా ఉండును. వ్యాపారస్తులకు కొంత కష్టకాలం. విద్యార్థులకు ఈరోజు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. అనారోగ్య సమస్యలు, వృత్తి సమస్యలు, కుటుంబ సమస్యలు ఇబ్బందిపెట్టును. కుటుంబ విషయాలు, ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. కర్కాటక రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారపరంగా ఇబ్బందులుంటాయి. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆర్థిక సమస్యలు రాకుండా చూసుకోవాలి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు తప్పనిసరి. సింహ రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విఘ్నేశ్వరుని పూజించండి. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉన్నది. మీ ఆశయాలు నెరవేరతాయి. అవకాశాల్ని సద్వినియోగం చేసుకోవడం మంచిది. వ్యాపారస్తులకు లాభదాయకం. కొత్త ఆలోచనలతో వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవడానికి తగిన సమయం. క్రమంగా అభివృద్ధిని సాధిస్తారు. ఉద్యోగంలో కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించడం మంచిది. కన్యా రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం రుణవిమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగంలో మంచి ఫలితాలను సాధిస్తారు. భూ, గృహ, వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. మీ కృషి నలుగురికీ తెలుస్తుంది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చులు తగ్గించుకోవాలని సూచిస్తున్నాను. తులారాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాలను దర్శించి నవగ్రహ ప్రదక్షిణ చేయటం మంచిది.

వృశ్చిక రాశి

నేటి రాశి ఫలాల ప్రకారం వృశ్చిక రాశి వారికి ఈరోజు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారపరంగా లాభదాయకం. మీరు చేసే పనులు పదిమందికి ఆదర్శవంతమవుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. స్వయంకృషితో అభివృద్ధిని సాధిస్తారు. విద్యార్థులకు మధ్యస్థ ఫలితాలు ఏర్పడును . వృశ్చిక రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. శివాలయం దర్శించడం మంచిది.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈరోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. ప్రతి అవకాశాన్ని అనుకూలంగా మార్చుకోవాలి. ఏ పని ప్రారంభించినా విజయమే గోచరిస్తుంది. తగిన ప్రణాళికలను సిద్ధం చేయండి. గొప్పవారితో సంభాషిస్తారు. గృహ నిర్మాణాది కార్యాలు సత్ఫలితాలిస్తాయి. విద్యార్థులకు ఈరోజు కలసివచ్చును. ధనూరాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం శివపార్వతులను పూజించండి. శివాలయాన్ని నవగ్రహ ఆలయాన్ని దర్శించడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈరోజు మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. బంధువుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. ప్రయాణాల్లో కొత్త వ్యక్తుల పరిచయాలేర్పడతాయి. మీరు చేపట్టిన పనులు పూర్తవుతాయి. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ జీవితం ఆనందకరంగా ఉంటుంది. మకర రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయాలను దర్శించడం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ రోజు మీకు అనుకూల ఫలితాలున్నాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది. సన్నిహితులతో విందు, వినోదాల్లో పాల్గొంటారు. మీ జీవిత భాగస్వామితో కలసి విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం అనుకూలించును. ఉద్యోగస్తులకు అధికారులనుండి సహాయ సహకారాలుంటాయి. వృత్తి వ్యాపారపరంగా ఆర్థిక సమస్యలను అధిగమిస్తారు. కుంభ రాశివారు మరింత శుభఫలితాలు పొందటం కోసం విఘ్నేశ్వరుని పూజించండి. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ రోజు మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు పెట్టుబడులు విజయాన్నిస్తాయి. ఉద్యోగంలో తోటివారి నుండి తగిన సహాయం అందుతుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కొన్ని విషయాలలో స్పష్టత వస్తుంది. భూలాభం సూచన. మనశ్శాంతి లభిస్తుంది. ప్రతిభతో పనిచేసి ప్రశంసలు అందుకుంటారు. మీన రాశి వారు మరింత శుభఫలితాలు పొందటం కోసం రుణవిమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
తదుపరి వ్యాసం