Dhanteras: ధన త్రయోదశికి కావాల్సిన పూర్తి పూజా సామాగ్రి జాబితా ఇదే
26 October 2024, 14:28 IST
- Dhanteras: మరో మూడు రోజుల్లో ధన త్రయోదశి రాబోతుంది. ఈరోజు పూజకు కావాల్సిన సామాగ్రి జాబితా తెలుసుకున్నారంటే అప్పటికప్పుడు టెన్షన్ పడి అన్ని తెచ్చుకోవాల్సిన అవసరం ఉండదు. అందుకే మీ కోసం పూజకు కావలసిన జాబితా ఇస్తున్నాం.
ధన త్రయోదశి పూజా సామాగ్రి
హిందూ మతంలో ధన్‌తేరస్ తో దీపాల పండుగ ప్రారంభమవుతుంది. క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం అక్టోబర్ 29న ధన త్రయోదశి జరుపుకుంటారు. ఈ రోజున, లక్ష్మీ దేవి, గణేశుడు, ధన్వంతరీ, కుబేర దేవతలను ఆనందం, శ్రేయస్సు, సంపద కోసం పూజిస్తారు.
ధంతేరస్ రోజున బంగారు, వెండి ఆభరణాలతో సహా కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. ధన త్రయోదశి రోజున పూజలో కొన్ని విషయాలను చేర్చడం ద్వారా దేవతలు సంతోషిస్తారని నమ్ముతారు. ఇది లేకుండా ధన త్రయోదశి ఆరాధన సంపూర్ణంగా పరిగణించబడదు. ధన త్రయోదశి ఖచ్చితమైన తేదీ, సమయం, పూజ సామగ్రి జాబితాను తెలుసుకోండి.
ధన త్రయోదశి ఎప్పుడు?
దృక్ పంచాంగ్ ప్రకారం త్రయోదశి తిథి 29 అక్టోబర్ 2024 ఉదయం 10:31 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు 30 అక్టోబర్ 2024 మధ్యాహ్నం 01:15 గంటలకు ముగుస్తుంది. ప్రదోష కాల ముహూర్తాన్ని దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 29న ధన త్రయోదశి జరుపుకుంటారు. ఈ రోజున ప్రదోష ఉపవాసం కూడా ఉంటుంది.
ధన త్రయోదశి రోజు అద్భుతమైన త్రిగ్రాహి యోగం కూడా ఉంటుంది. ఈ సమయంలో పూజ చేయడం వల్ల మూడింతల ఫలితం లభిస్తుంది. ఈరోజు ఇంద్రయోగం, వైద్రి యోగం సహా అనేక శుభ యోగాలు ఉన్నాయి.
ప్రదోష కాల ముహూర్తం: 05:27 PM నుండి 08:02 PM వరకు
వృషభ కాల ముహూర్తం: 06:20 PM నుండి 08:15 PM
ధన త్రయోదశి పూజ సమయాలు: 6:30 PM నుండి 08:13 PM వరకు
ధన త్రయోదశి పూజ సామగ్రి జాబితా
లక్ష్మీదేవి, వినాయకుడు, కుబేరుడి చిత్రపటాలు లేదా విగ్రహాలు, చిన్న చెక్క పీట, గంగాజలం, ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రం, 13 మట్టి దీపాలు, వత్తిని తయారు చేయడానికి పత్తి, పూజా సామగ్రి, కుబేర యంత్రం, తమలపాకులు, నీటితో నిండిన కలశం, ఎరుపు, పసుపు పువ్వులు, వెండి నాణెం, మౌళి, రోలి, అక్షతం, కర్పూరం, పసుపు, గులాల్, పరిమళం, కౌరీ, మిఠాయిలు, ధూపం, కొత్త పాత్రలు, మీరు కొనుగోలు చేసుకున్న కొత్త వస్తువులు పెట్టుకోండి. చీపురు, కొత్తిమీర ఆకులు, స్వస్తిక, చందనం, పంచదార లేదా బెల్లం, పూల మాల, 2 పెద్ద దీపాలతో సహా పూజా సామగ్రి సేకరించుకోవాలి.
ఈ పనులు చేయవద్దు
మద్యపానం సేవించడం, మాంసాహారం తీసుకోవడం వంటివి చేయకూడదు. ఎవరిని దుర్భాషలాడకూడదు. ఇతరులతో గొడవలకు వెళ్లకూడదు. అలాగే డబ్బులు ఎవరికీ అప్పుగా ఇవ్వడం లేదా తీసుకోవడం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే ఇబ్బందులు ఎదురవుతాయి. పగటి పూట నిద్రపోవడం మంచిది కాదు. లక్ష్మీదేవి ఆశీస్సులు కావాలంటే ఈరోజు పగటి పూట నిద్రపోకూడదు.సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. పండుగ సందర్భంగా నలుపు వంటి ముదురు రంగులు ధరించడం చేయకూడదు.
నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.
టాపిక్