Dhanteras: ధన త్రయోదశి రోజు చీపురు కొనడం వల్ల అదృష్టం పడుతుందా? అలా ఎందుకు చెబుతారు?-buying a broom on dhanteras has special importance know what not to do on this day ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Dhanteras: ధన త్రయోదశి రోజు చీపురు కొనడం వల్ల అదృష్టం పడుతుందా? అలా ఎందుకు చెబుతారు?

Dhanteras: ధన త్రయోదశి రోజు చీపురు కొనడం వల్ల అదృష్టం పడుతుందా? అలా ఎందుకు చెబుతారు?

Gunti Soundarya HT Telugu
Oct 25, 2024 09:02 AM IST

Dhanteras: ధన త్రయోదశి రోజు తప్పనిసరిగా ఇంటికి తీసుకురావాల్సిన వస్తువుల జాబితాలో చీపురు ఒకటిగా చెప్తారు. ఈరోజు దీన్ని ఇంటికి తీసుకొస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కురిపిస్తుందని అంటారు. చీపురు కొనడం వల్ల మంచి జరుగుతుందా? అలా ఎందుకు చెప్తారు అనేది తెలుసుకుందాం.

ధన త్రయోదశి రోజు చీపురు ఎందుకు కొనాలి?
ధన త్రయోదశి రోజు చీపురు ఎందుకు కొనాలి? (Unsplash)

ధన త్రయోదశి సంపద, శ్రేయస్సు వేడుకకు ప్రతీక. లక్ష్మీ దేవి సంపద, శ్రేయస్సు, అదృష్టానికి దేవత అయితే, ధన్వంతరి ఆయుర్వేద దేవుడు, ఆరోగ్యం, వైద్యంతో సంబంధం కలిగి ఉంటాడు. 

ఈ రోజున బంగారం, వెండి, పాత్రలు మొదలైన విలువైన వస్తువులను కొనుగోలు చేసే సంప్రదాయం ఉంది. ఇది మాత్రమే కాదు ఈరోజు తప్పనిసరిగా చీపురు కొనడం వల్ల అదృష్టం పడుతుందని అంటారు. ధన త్రయోదశి రోజున సరి సంఖ్యలో చీపుర్లు (2, 4, 6, 8) కొనడం శుభప్రదంగా భావిస్తారు. హిందూ విశ్వాసంలో చీపురు కేవలం గృహోపకరణం కంటే ఎక్కువ. ఇది ప్రతికూలత, ఆర్థిక ఇబ్బందుల తొలగింపుకు ప్రతీకగా భావిస్తారు. ఈ రోజున చీపురు కొనడం వల్ల లక్ష్మీదేవి ఇంటి నుండి బయటకు రాకుండా ఉంటుందని నమ్ముతారు. సంపద, అదృష్టం కోసం అమ్మవారి ఆశీర్వాదాలను నిర్ధారిస్తుంది.

చీపురు శుభ్రత కోసం సాధనంగా ఉపయోగిస్తారు. శుభ్రమైన ఇల్లు లక్ష్మీ దేవిని ఆకర్షిస్తుంది అనే ఆలోచనతో ముడిపడి ఉంది. ధంతేరస్ రోజున మీ ఇంటికి చీపురు తీసుకురావడం వల్ల పేదరికం, సమస్యలను దూరం చేస్తుంది. ఆనందం, విజయానికి మార్గం సుగమం చేస్తుంది. 

చీపురు ఇంటికి తెచ్చిన తర్వాత ఇలా చేయండి 

చీపురు చుట్టూ తెల్లటి దారాన్ని కట్టాలి. ఇలా చేయడం వల్ల ఇల్లు, కుటుంబంపై లక్ష్మీ దేవి ఆశీర్వాదాలు, రక్షణను ఆహ్వానిస్తుందని నమ్ముతారు. చీపురును ఎల్లప్పుడూ శుభ్రమైన చేతులతోనే పట్టుకోవాలి. అలాగే ఎవరికీ కనిపించకుండా దాన్ని భద్రపరచాలి. ఎందుకంటే దానిని కనిపించేలా ఉంచడం దురదృష్టాన్ని తెస్తుంది.

ఆరోగ్యం కోసం 

కుటుంబ సభ్యులు ఎవరైనా అనారోగ్యంతో బాధపడుతున్నా, ఎన్ని చికిత్సలు చేసినా నయం కాకపోతే  ధన త్రయోదశి రోజు ఉదయం ఇంటిని తుడుచుకోండి.  పవిత్రమైన గంగాజలాన్ని ఇంటి చుట్టూ చల్లుకోండి. స్థలాన్ని శుద్ధి చేయడానికి కర్పూరం కాల్చండి. ఇది ఇంట్లోకి వైద్యం చేసే శక్తిని తెస్తుందని నమ్ముతారు.

సంపద కోసం 

కొంతమంది బంగారం, వెండి లేదా రాగితో చేసిన చిన్న చీపురును ధన్‌తేరస్‌లో లక్ష్మీదేవి పాదాల వద్ద ఉంచుతారు. పూజ చేసిన తర్వాత సాయంత్రం వేళ దాన్ని ఎర్రటి వస్త్రంలో చుట్టి డబ్బులు నిల్వ చేసే లాకర్ లో ఉంచుకోవచ్చు. దీనివల్ల సంపద పెరుగుతుందని చెబుతారు.

చీపురు విరాళంగా ఇవ్వండి

ధన్‌తేరస్‌లో రెండు చీపుర్లు కొనండి. ఒకటి ఆలయానికి లేదా స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇవ్వండి. మరొకటి ఇంట్లో ఉంచండి. ఇలా చేస్తే మీ ఇంటికి ఆనందం, శ్రేయస్సును తెస్తుందని నమ్ముతారు. ధన్‌తేరస్ సమయంలో ఈ కాలానుగుణ సంప్రదాయాలను అనుసరించడం వల్ల మీ కుటుంబానికి ఆరోగ్యం, సంతోషం, సంపదను అందించవచ్చు. 

ఈరోజు కుబేరుడు, లక్ష్మీదేవి, వినాయకుడిని పూజిస్తారు. ప్రేమ, శ్రేయస్సు చిహ్నంగా ధన్‌తేరస్‌లో బహుమతులు మార్పిడి చేసుకోవడం ఆచారం. ఆభరణాలు, బంగారు లేదా వెండి నాణేలు, రాగి, ఇత్తడి పాత్రలు, కొత్త కారు, ఎలక్ట్రానిక్ పరికరాలు, గృహోపకరణాలు కొనుగోలు చేయడానికి ఈ రోజు మంచిరోజుగా భావిస్తారు. లక్ష్మీ దేవి, ధన్వంతరికి పూజలో గోధుమ పిండి హల్వా, ధనియాలు, బెల్లం పొడి, బూందీ లడ్డులను నైవేద్యంగా సమర్పించడం వలన అమరత్వం, ఆరోగ్యం చేకూరుతుంది.

ధన్‌తేరాస్‌లో వీటిని కొనకండి

ధన్‌తేరస్‌లో ఇనుప వస్తువులను కొనకూడదు. ఇనుము శని కారకంగా పరిగణించబడుతుంది. ధన్‌తేరస్‌లో ఇనుప వస్తువులను కొనుగోలు చేయడం దురదృష్టాన్ని తెస్తుందని నమ్ముతారు. అంతే కాకుండా ధన్‌తేరస్ రోజున పింగాణీతో చేసిన వస్తువులను కూడా కొనకూడదు. ఇలా చేయడం వల్ల ఇంట్లో శుభాలు తగ్గుతాయని చెబుతారు.

గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

Whats_app_banner