Broom vastu tips: లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటి మీద ఉండాలా? అయితే చీపురు ఈ దిశలో ఉంచకండి
Broom vastu tips: ఇంటిని శుభ్రం చేసే చీపురు విషయంలో పొరపాటున కూడా అజాగ్రత్తగా ఉండకూడదు. చీపురు ఉంచే దిశ దగ్గర నుంచి ఎన్ని కొనాలి అనే విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి. అప్పుడే లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభిస్తుంది. చీపురును కొన్ని దిశలలో ఉంచితే అది ఇంటికి అశుభ ఫలితాలు తీసుకొస్తుంది.
చీపురు ఇంటిని శుభ్రం చేయడానికి ప్రతిరోజూ ఉపయోగిస్తారు. పరిశుభ్రతతో పాటు ఇంటి నుండి ప్రతికూల శక్తిని కూడా దూరం చేస్తుంది. మత విశ్వాసాల ప్రకారం ప్రతి ఒక్కరూ ఇంటి పరిశుభ్రత మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఎందుకంటే ఏ ఇల్లు అయితే మురికి లేకుండా నిత్యం దీపం వెలిగించి ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుందని నమ్ముతారు.
చీపురు విషయంలో తీసుకునే కొన్ని విషయాలు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని కురిపిస్తాయి. అందుకే ఇంట్లో చీపురుకు సంబంధించిన కొన్ని ప్రత్యేక విషయాలను గుర్తుంచుకోవాలి. దీనివల్ల ఇంటికి సుఖం, శాంతి, శ్రేయస్సు లభిస్తాయని నమ్ముతారు. లక్ష్మీదేవి ఆశీస్సులు కుటుంబ సభ్యులపై నిలిచి ఉంటాయి. చీపురుకు సంబంధించిన కొన్ని వాస్తు చిట్కాలను తెలుసుకుందాం.
చీపురుకు సంబంధించిన వాస్తు చిట్కాలు
వాస్తు ప్రకారం చీపురు విరిగిపోయినా లేదా పూర్తిగా పాడైపోయినా, అరిగిపోయిన వెంటనే ఇంటి నుంచి బయటకు విసిరేయాలి.
వాస్తులో ఈశాన్య దిశను దేవతల దిశగా పరిగణిస్తారు. అందుకే చీపురు ఈ దిశలో ఉంచరాదు. ఇది డబ్బు వచ్చే మార్గంలో అడ్డంకులు సృష్టిస్తుందని నమ్ముతారు.
వాస్తు ప్రకారం ఆగ్నేయ దిశలో చీపురు పెట్టకూడదు. ఈ దిశ అగ్నికి సంబంధించినది. ఈ దిశలో చీపురు ఉంచడం వల్ల ప్రతికూల ఆలోచనలు ఎక్కువగా వస్తాయని నమ్ముతారు.
వాస్తులో చీపురు ఉంచడానికి ఉత్తమ దిశను వాయువ్యంగా పరిగణిస్తారు. ఈ దిశలో చీపురు ఉంచడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు.
ఇంట్లోని వంటగదిలో, పూజ గదిలో పొరపాటున కూడా చీపురు పెట్టకూడదని అంటారు. దీని వల్ల వాస్తు దోషాలు వస్తాయి.
చీపురు డ్రెయిన్ దగ్గర పెట్టకూడదని, చీపురును పొరపాటున కూడా కాలితో తన్నడం, తొక్కడం వంటివి చేయకూడదని అంటారు.
చాలా మందికి ఉండే అలవాటు ఇది. పని పూర్తి కాగానే చీపురును నిలబెడతారు. అది వాస్తు ప్రకారం మంచిది కాదు. చీపురు నిలబెట్టుకోవడం కూడా సరైనది కాదు. వాస్తు శాస్త్రం ప్రకారం చీపురు ఎప్పుడూ నేలపైనే పడుకోబెట్టి ఉంచాలి.
పడకగదిలో మంచం కింద చీపురు ఉంచకూడదు. ఇది వైవాహిక జీవితంలో అడ్డంకులు సృష్టిస్తుంది. వాస్తు ప్రకారం చీపురు ఎవరికీ కనిపించకుండా పెట్టాలి. ఇంట్లోకి వచ్చిన అతిథులకు, బయట వాళ్ళకు చీపురు కనిపించకూడదు.
మీరు ఒకవేళ చీపురు కొనాలని అనుకుంటున్నట్టయితే మంగళ, శుక్ర వారాలు అందుకు మంచిది కాదు. ఈరోజు ఇంటికి చీపురు తీసుకురావడం దురదృష్టాన్ని తీసుకొచ్చినట్టే అవుతుంది. వారంలో మిగతా ఏ రోజుల్లో చీపురు కొన్నా మంచిది. ఇది ఇంటికి ఆనందం, శ్రేయస్సు వస్తాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది.
మీరు ఇంటికి కొత్త చీపురు తెచ్చుకుంటున్నట్టయితే బేసి సంఖ్యలో మాత్రమే తెచ్చుకోవాలి. రెండు చీపుర్లు ఇంటికి తీసుకురాకూడదు.
నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.
టాపిక్