Bedroom vastu tips: పడకగదిలో మంచం చుట్టూ ఈ వస్తువులు అసలు పెట్టుకోవద్దు, దంపతుల మధ్య మనస్పర్థలు వస్తాయ్
Bedroom vastu tips: మంచం పక్కన పెట్టుకునే కొన్ని వస్తువులు వాస్తు ప్రకారం అశుభకరంగా పరిగణిస్తారు. ఈ వస్తువులు మీ మంచం పక్కన పెడుతుంటే వెంటనే వాటిని తొలగించేయండి.
Bedroom vastu tips: పడకగది విషయంలో వాస్తు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఎక్కువసేపు ఈ గదిలోనే సమయం గడుపుతారు. విశ్రాంతి తీసుకుంటారు. వివాహం చేసుకున్న తర్వాత భాగస్వామితో ఆనందకరమైన క్షణాలు గడిపేది ఈ గదిలోనే. అందుకే పడకగది వాస్తు మన జీవితం, సంబంధం పై ప్రభావాన్ని చూపుతుంది. పడకగది వాస్తు మాత్రమే కాకుండా అందులో ఉండే మంచం విషయంలో కూడా సరైన నియమాలు పాటించాలి.
మంచం చుట్టూ కొన్ని వస్తువులు పెట్టడం వల్ల ఇంట్లో వాస్తు లోపం పెరుగుతుంది. ఫలితంగా జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే నిద్రపోయేటప్పుడు ఈ వస్తువులను మంచం దగ్గర పొరపాటున కూడా ఉంచకూడదు. దీని వల్ల ప్రతికూలత పెరుగుతుంది. జీవితంలో అనేక అశుభ ఫలితాలు ఎదురవుతాయి. పడుకునేటప్పుడు మంచం దగ్గర ఏ వస్తువులు ఉంచుకోకూడదు తెలుసుకుందాం.
ఇవి మంచం చుట్టూ పెట్టుకోవద్దు
కొంతమందికి ఇంట్లో చెప్పులు వేసుకుని నడిచే అలవాటు ఉంటుంది. అలాగే వాటిని బెడ్ రూమ్ లోకి కూడా తీసుకెళ్లి పోతారు. కానీ వాస్తు ప్రకారం బూట్లు, చెప్పులు మంచి కింద ఉండకూడదు. దీనివల్ల ఇంట్లో నెగెటివిటీ పెరుగుతుంది.
మంచం కింద ఇనుము, ప్లాస్టిక్ లేదా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఉంచడం మానుకోండి. దీని వల్ల ఇంట్లో వాస్తు లోపాలు వస్తాయి అని నమ్ముతారు. అలాగే మంచం కింద చీపురు కూడా పెట్టకూడదు. అలా చేయడం శుభప్రదంగా పరిగణించరు. ఇది వ్యక్తి ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. జీవితంలో ఆర్థిక సమస్యలను కలిగిస్తుందని నమ్ముతారు.
చాలామందికి ఉండే అలవాటు ఇది. పడుకునేటప్పుడు మెడలోని గొలుసులు, గాజులు వంటి బంగారు వస్తువులు, వెండి ఆభరణాలు తీసి తల దిండు కింద పెట్టుకుంటారు. కానీ వాటిని అలా ఉంచుకోవడం శుభం కాదు. ఇది వాస్తు లోపాలకు దారితీస్తుంది.
మంచం దగ్గర వాటర్ బాటిల్ పెట్టుకోకూడదు. ఇది జాతకంలో చంద్రుని స్థానాన్ని బలహీన పరుస్తుంది. దీని ప్రభావం మానసిక ఆరోగ్యం మీద చూపిస్తుంది.
పడకగది ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. మురికి బట్టలు ఎప్పుడూ మంచం దగ్గర పెట్టకూడదు. వాస్తు ప్రకారం ఇది సరికాదు. ఇది జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది.
చాలా మంది బెడ్ కాఫీ, టీ లేదా పాలు తాగిన తర్వాత వాటి కప్పులు లేదా గ్లాసులను మంచం దగ్గర టేబుల్ మీద పెట్టేస్తారు. వాస్తు ప్రకారం పడుకునే మంచం దగ్గర ఎంగిలి పాత్రలు ఉంచకూడదు. ఇలా ఉంచితే నిద్రపోతున్నప్పుడు పీడకలలకు కారణం అవుతుంది.
వాస్తు ప్రకారం తల దగ్గర పుస్తకం పెట్టుకొని పడుకోకూడదు. చాలామంది పడుకునే ముందు ఏదో ఒక పుస్తకం చదువుతూ అలాగే నిద్రలోకి జారుకుంటారు. ఆ పుస్తకాన్ని పక్కనే పెట్టేసుకుంటారు. కానీ అది సరైన పద్ధతి కాదు. ఇలా చేయడం వల్ల ప్రతికూల శక్తి ప్రసారం అవుతుంది. జీవితంలో పురోగతి మార్గంలో అడ్డంకులు సృష్టిస్తుంది.
పడక గదిలో పాజిటివ్ ఎనర్జీ పెంచేందుకు చిట్కాలు
పడకగది ఇంటికి నైరుతి దిశలో ఉండాలి. అలాగే మంచం తలుపుకు ఎదురుగా ఉండకూడదు. పడకగదిలో అర్థం ఉంచుకోకూడదు. నిద్రలేచిన వెంటనే మన ప్రతిబింబం చూసుకోవడం అశుభకరంగా భావిస్తారు. పడకగదిలో అద్దం ఎంత పెద్దగా ఉంటే వైవాహిక బంధంలో అన్ని ఎక్కువ గొడవలు జరిగే అవకాశం ఉంది.
పడకగది నైరుతి మూలలో తెల్లని పూలు ఉన్న మొక్క పెట్టుకోవచ్చు. ఇది మీ వైవాహిక జీవితంలో ఆనందాన్ని పెంచుతుంది.
పడకగదిలో ఏవైనా చిత్రపటాలు పెట్టుకుంటే వాటిలో ఒకటిగా ఉన్న వాటిని పెట్టకూడదు. రెండు జతల బాతులు, రెండు చేపలు, రెండు పక్షులు ఇలా ఏవైనా జతగా ఉన్నా చిత్రాలు మాత్రమే అలంకరణ వస్తువులుగా ఉంచుకోవాలి.
టాపిక్