Vastu tips: వాటర్ బాటిల్ బెడ్ పక్కన పెట్టుకుని నిద్రపోతే ఏమవుతుందో తెలుసా?
Vastu tips: పడుకునేటప్పుడు బెడ్ పక్కన పర్స్, వాటర్ బాటిల్ పెట్టుకుని చాలా మంది నిద్రపోతారు. కానీ వాస్తు ప్రకారం అవి సరైన పద్ధతులు కాదని అంటున్నారు.
Vastu tips: మనలో ప్రతీ ఒక్కరికీ ఉండే సాధారణ అలవాటు పడుకునేటప్పుడు బెడ్ పక్కన వాటర్ బాటిల్ పెట్టుకోవడం. రాత్రి వేళ దాహంగా అనిపించినప్పుడు నీళ్ళు తాగడం కోసం మంచం కింద చెంబులో పెట్టుకుంటారు. కానీ పద్ధతి కాదని చెబుతున్నారు వాస్తు నిపుణులు. పడక గదిలో ఇలాంటి కొన్ని చిన్న చిన్న పనులు సాధారణంగా చేసేవే అయినా అవి జీవితం మీద ప్రతికూల ప్రభావాలని చూపుతాయి. వాస్తు ప్రకారం బెడ్ రూమ్ లో ఇటువంటి పనులు చేయకూడదు.
తల కింద నీళ్ళు పెట్టుకోకూడదు
రాత్రి పడుకునే ముందు నీళ్ళని తలపై పెట్టుకోకూడదు. తల కింద నీరు ఉంటే చంద్రుడు బాధపడతాడు. దీని వల్ల ప్రతికూలత, మానసిక సమస్యలు రావచ్చు. అందుకే పడుకునే ముందు మంచం కింద లేదంటే పక్కన వాటర్ బాటిల్ లేదా ఏ పాత్రలోనూ నీటిని ఉంచవద్దు. రాత్రి పూట గొంతెండిపోయే సమస్య ఉన్నవారు, అతిగా దాహం వేసే సమస్య ఉన్న వారు కాస్త దూరంగా కాళ్లవైపు పెట్టుకోవడంలో తప్పేం లేదు.
ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్
చాలా మందికి ఫోన్ తల దిండు కింద పెట్టుకుని పడుకునే అలవాటు ఉంటుంది. ఇంకొంత మంది చేతికి స్మార్ట్ వాచ్ అలాగే పెట్టుకుని నిద్రపోతారు. కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ నిద్రపోకూడదు. ఇది డబ్బు నష్టానికి దారి తీయడమే కాకుండా జీవితంలోని ప్రతి రంగంపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది.
మురికి బట్టలు ఉంచకూడదు
ఒకసారి వేసుకున్న దుస్తులు మరొక సారి వేసుకోవచ్చులే అని వాటిని బెడ్ రూమ్ లో హ్యంగర్ కి తగిలించి పెడతారు. లేదంటే వాటిని బెడ్ రూమ్ లో ఉన్న కుర్చీలు లేదా సోఫాలో పడేస్తారు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదని వాస్తు శాస్త్రం చెబుతోంది. మంచం లేదా గదిలో మురికి బట్టలు ఉండటం వల్ల నిద్రలో పీడకలలు వస్తాయి. ప్రతికూల శక్తిని ఆకర్షిస్తాయి.
బంగారు వస్తువులు పెట్టకూడదు
చాలా మంది పడుకునే ముందు బంగారు ఆభరణాలు తీసి దిండు కింద పెట్టుకుని పడుకుంటారు. నిద్రపోయేటప్పుడు తల కింద అలాంటి వస్తువులు పెట్టుకోకూడదు. ఇవి ప్రతికూలతని పెంచుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. జీవిత భాగస్వామితో సంబంధం చెడిపోవచ్చు. జీవితంలోనూ అనేక అడ్డంకులు ఎదురవుతాయి.
అద్దం ఉండకూడదు
బెడ్ రూమ్ లో అద్దం పెట్టుకోకూడదు. ఇది వైవాహిక జీవితంలో ఇబ్బందులు కలిగిస్తుంది. నిద్రపోయేటప్పుడు మన ప్రతిబింబం అద్దంలో చూసుకోకూడదు. ఇవి రాత్రిపూట భయానక కలలు వచ్చేలా చేస్తుంది. అది మాత్రమే కాదు నిద్రలేవగానే అద్దంలో మొహం చూసుకోవడం కూడా మంచిది కాదు.
పుస్తకాలు తల కింద పెట్టకూడదు
నిద్రపోయే ముందు ఒక మంచి పుస్తకం చదవడం చక్కని అలవాటు. కానీ ఆ పుస్తకాలు మాత్రం తల దిండు కింద పెట్టుకుని పడుకోకూడదు. ఇలాంటి వాటిని తల కింద పెట్టుకోవడం వల్ల నెగటివ్ ఎనర్జీ ప్రభావం పెరుగుతుంది. అలాంటి వ్యక్తులు జీవితంలో ముందుకు సాగలేరు.
పర్స్ పెట్టుకోకూడదు
చాలా మంది మగవాళ్ళకి ఉండే అలవాటు ఇది. పడుకునేటప్పుడు వాహనాల తాళాలు, పర్స్ పక్కనే పెట్టుకుని పడుకుంటారు. పర్స్ లేకపోతే డబ్బులు దిండు కింద పెట్టేసుకుంటారు. వాస్తు ప్రకారం ఇలా చేయడం వల్ల డబ్బు గురించి ఆలోచిస్తూ నిద్రపోతారు. అలా చేస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు లభించవు.