Devi navaratrulu 2024: నవరాత్రుల్లో ఈ వస్తువు తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకోండి- అన్నింటా విజయం మీదే
07 October 2024, 16:00 IST
- Devi navaratrulu 2024: శరన్నవరాత్రుల సమయంలో కొన్ని వస్తువులు ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. ఈ చిన్న వస్తువును మీరు పూజ గదిలో ఉంచుకుంటే అన్నింటా విజయం సొంతం అవుతుంది. ప్రతి పనిలో ఏర్పడే అడ్డంకులు తొలగిపోతాయి.
నవరాత్రుల్లో కొనుగోలు చేయాల్సిన వస్తువులు ఇవే
శారదీయ నవరాత్రి సమయంలో దుర్గాదేవి ఆరాధనకు అధిక ప్రాముఖ్యత ఉంటుంది. తొమ్మిది రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. అక్టోబర్ 12 దసరా పండుగతో శరన్నవరాత్రులు ముగుస్తాయి.
ఈ నవరాత్రుల సమయంలో కొన్ని వస్తువులు కొనుగోలు చేస్తే మీ కోరికలు నెరవేరుతాయి. మీరు శ్రేయస్సు కోరికతో మాతృ దేవతను ఆరాధిస్తున్నట్లయితే ఖచ్చితంగా వెండితో చేసిన వస్తువు లేదా నాణెం కొనండి. సొంత ఇల్లు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మీకు మీ సొంత ఇల్లు కావాలంటే మట్టితో చేసిన చిన్న ఇల్లు కొనడం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. అదేవిధంగా మోలి, వివాహ వస్తువులు, జెండాను కొనుగోలు చేయడం కూడా ప్రయోజనకరంగా పరిగణిస్తారు.
జ్యోతిష్యశాస్త్ర పండితులు చెప్పిన దాని ప్రకారం హిందూ గ్రంధాలలో వెండిని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు. శారదీయ నవరాత్రులలో వెండి వస్తువులను కొనుగోలు చేయడం వల్ల ఇంట్లో ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. వెండిని శ్రేయస్సుకు చిహ్నంగా భావిస్తారు. నవరాత్రులలో వెండి కొనుగోలు చేయడం వల్ల మనిషికి ఆర్థిక బలం చేకూరుతుంది.
నవరాత్రులలో ఇంట్లో చిన్న మట్టి ఇల్లు కొనడం శుభప్రదంగా భావిస్తారు. మీరు ఈ ఇళ్లను మార్కెట్ నుండి కొనుగోలు చేయవచ్చు. లేదంటే మీరు మట్టితో ఇంట్లో కూడా నిర్మించుకోవచ్చు. ఈ మట్టి ఇంటిని దుర్గాదేవి దగ్గర ఉంచాలి. నిత్యం పూజించడం వల్ల ఆస్తులు కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నమ్ముతారు.
దుర్గాదేవి ప్రత్యేక ఆశీర్వాదం, అఖండ అదృష్టాన్ని పొందేందుకు వివాహిత స్త్రీలు నవరాత్రులలో అమ్మవారిని ఎరుపు రంగు చునారీతో పాటు వివాహ ఉపకరణాలను కొనుగోలు చేయాలి. ఇది ఆడవారికి అదృష్టాన్ని పెంచుతుంది. మేకప్ లేదా వివాహానికి ఉపయోగించే వస్తువులు అమ్మవారికి సమర్పిస్తే భర్త వయసు పెరుగుతుంది. స్త్రీ ఐదోతనం కలకాలం ఉంటుంది. నవరాత్రులలో మౌళిని కొనుగోలు చేయాలి. ఇలా చేయడం జ్యోతిష్యంలో ముఖ్యమైనదిగా పరిగణిస్తారు.
జెండా కొనడం కూడా ప్రయోజనకరం
జ్యోతిష్య శాస్త్రంలో జెండా కూడా ప్రత్యేకంగా భావిస్తారు. నవరాత్రులలో ఎర్రటి త్రిభుజాకార జెండా కొని ఇంటికి తెచ్చుకోండి. దానిని పూజ గదిలో అమర్చండి. జెండా అంటే విజయానికి సంకేతం. దీన్ని పూజ గదిలో ఉంచి నిత్యం పూజించడం వల్ల విశేష ప్రయోజనాలు కలుగుతాయి. మీరు ఏ పని తలపెట్టిన అందులో విజయం చేకూరుతుంది. పనులు ఎటువంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతాయి.
ఇవి మాత్రమే కాకుండా తులసి మొక్క, లక్ష్మీ దేవి చిత్రపటం, అలంకరణ వస్తువులు కొనుగోలు చేయవచ్చు. వీటిని దుర్గాదేవికి సమర్పించడం వల్ల దేవి ఆశీర్వాదాలు మీకు పుష్కలంగా లభిస్తాయి. ఆర్థిక శ్రేయస్సు పొందుతారు.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.