తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Vastu Tips: సిరి సంపదలు నిలవాలంటే కొత్త సంవత్సరం వీటిని ఇంటికి తెచ్చుకోండి

Vastu tips: సిరి సంపదలు నిలవాలంటే కొత్త సంవత్సరం వీటిని ఇంటికి తెచ్చుకోండి

Gunti Soundarya HT Telugu

27 December 2023, 14:00 IST

google News
    • Vastu tips: నూతన సంవత్సరంలో కొన్ని వస్తువులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవడం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. సుఖ సంతోషాలతో ఉంటారు. 
ఇవి ఇంట్లో పెట్టుకుంటే సంపద పెరుగుతుంది
ఇవి ఇంట్లో పెట్టుకుంటే సంపద పెరుగుతుంది (pixabay)

ఇవి ఇంట్లో పెట్టుకుంటే సంపద పెరుగుతుంది

Vastu tips: రాబోయే కొత్త సంవత్సరంలో తమ జీవితం మారిపోవాలని, కష్టాలు తొలగిపోవాలని ఎంతో మంది అనుకుంటారు. ఇల్లు సిరి సంపదలు, శ్రేయస్సుతో ఉండాలని కోరుకుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం అందుకు కావాలని అంటారు. ఇంట్లో సంపద పెరగాలన్నా, శ్రేయస్సు కోసం కొన్ని అవసరమైన మార్పులు చేయాలని వాస్తు శాస్త్రం చెబుతుంది.

కొత్త సంవత్సరం కొన్ని వస్తువులు తీసుకురావడం వల్ల శుభప్రదంగా ఉంటుందని పండితులు చెబుతున్నారు. ఈ వస్తువులు కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకుంటే ప్రయోజనాలు చేకూరుతుంది.

వెదురు మొక్క

ఫెంగ్ షూయి, వాస్తు శాస్త్రం ప్రకారం వెదురు మొక్కకి చాలా ప్రాముఖ్యత ఇస్తారు. వాస్తు శాస్త్రంలో వెదురు మొక్కని శ్రేయస్సు, దీర్ఘాయువుకి గుర్తుగా చెబుతారు. అందుకే దీన్ని లక్కీ వెదురు మొక్క అని అంటారు. సానుకూల శక్తి ఇంట్లోకి ఆకర్షిస్తుంది. అదృష్టం, సంపద కోసం వెదురు మొక్కఅని ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర ఉంచాలి. ఈ మొక్క గాలిని శుద్ధి చేస్తుంది. నెగటివ్ ఎనర్జీని ఇంట్లోకి రానివ్వకుండా చేస్తుంది. ఈ మొక్క ఇంట్లో ఉండటం వల్ల కుటుంబంలో ఆరోగ్యం, సంతోషంగ ఉంటాయి. వాస్తు ప్రకారం ఈ మొక్కని డ్రాయింగ్ గదిలో ఉంచాలి.

అక్వేరియం

వాస్తు ప్రకారం అక్వేరియంలోని చేపలని అదృష్టంగా భావిస్తారు. అక్వేరియం ఉన్న వారి ఇంట్లో సిరి సంపదలు సమృద్ధిగా ఉంటాయని చెబుతారు. ఇంట్లోకి ప్రతికూల శక్తిని రానివ్వకుండా నిరోధిస్తుంది. అక్వేరియం పెట్టుకోవడానికి వీలు లేని వాళ్ళు చేపల జత చిహ్నం అయినా ఇంట్లో పెట్టుకోవచ్చు. వాస్తు ప్రకారం అక్వేరియం ఉత్తర దిశలోనే ఉంచాలి. ఆ దిశ సంపడం కుబేరుని దిశగా పేర్కొంటారు. ఉత్తర దిశలో అక్వేరియం ఉండటం వల్ల కుటుంబంలో సుఖసంతోషాలు కలుగుతాయి. కొత్త సంవత్సరం ఇంట్లోకి అక్వేరియం తీసుకొస్తే అదృష్టం కలిసి వస్తుందని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

విండ్ చైమ్

విండ్ చైమ్ కి వాస్తు శాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఫెంగ్ షూయి కూడా విండ్ చైమ్ ఇంట్లో పెట్టుకుంటే మంచిదని చెబుతుంది. ఇది ఇంట్లో ఉండే శుభప్రదంగా భావిస్తారు. గాలికి ఇది ఊగినప్పుడు వచ్చే శబ్దము ప్రతికూల శక్తిని ఇంట్లోకి రానివ్వకుండా అడ్డుకుంటుంది. ఇది ఇంటికి మరింత అందాన్ని కూడా ఇస్తుంది. సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. విండ్ చైమ్ పెట్టుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు తగ్గి, సంపద రాకని ప్రోత్సహిస్తుంది. రానున్న కొత్త ఏడాది ఈ విండ్ చైమ్ మీ ఇంట్లో పెట్టుకుంటే చాలా మంచిది.

లాఫింగ్ బుద్ధ

లాఫింగ్ బుద్ధ ఇంట్లో ఉండే సిరి సంపదలకు కొరత ఉండదని చాలా మంది నమ్ముతారు. వాస్తు ప్రకారం ఆనందం, శ్రేయస్సుని లాఫింగ్ బుద్ధ ఇస్తుంది. ఈ విగ్రహం ఇంట్లో పెట్టుకుంటే అన్ని సమస్యలు తొలగిపోయి ఆనందంగా ఉంటారు. కుటుంబంలో ప్రేమ, అనురాగాలు పెరుగుతాయి. లాఫింగ్ బుద్ధ ఇంట్లో ఉండే సంపద, ఐశ్వర్యం పెరుగుతాయి. అందుకే కొత్త ఏడాది మీ ఇంట్లోకి లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో ఏర్పాటు చేసుకోండి. ప్రధాన ద్వారం ఎదురుగా దీన్ని పెట్టుకోవాలి.

తదుపరి వ్యాసం