తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Jupiter Transit: 12 ఏళ్ల తర్వాత రాశి మారుతున్న బృహస్పతి.. ఈ రాశుల వారికి కుబేరుడి ఆశీర్వాదాలు

Jupiter transit: 12 ఏళ్ల తర్వాత రాశి మారుతున్న బృహస్పతి.. ఈ రాశుల వారికి కుబేరుడి ఆశీర్వాదాలు

Gunti Soundarya HT Telugu

13 April 2024, 8:38 IST

google News
    • Jupiter transit: దాదాపు పన్నెండు సంవత్సరాల తర్వాత బృహస్పతి రాశి చక్రం మారుతుంది. ఫలితంగా కొన్ని రాశుల వారికి కుబేరుడి ఆశీర్వాదల వల్ల డబ్బు చేతికి అందుతుంది. అప్పులు తీరిపోతాయి. 
12 ఏళ్ల తర్వాత బృహస్పతి సంచారం
12 ఏళ్ల తర్వాత బృహస్పతి సంచారం

12 ఏళ్ల తర్వాత బృహస్పతి సంచారం

Jupiter transit: దేవ గురువ బృహస్పతి ఒక రాశి నుంచి మరొక రాశి ప్రయాణించేందుకు ఏడాది సమయం పడుతుంది. మే నెలలో బృహస్పతి 12 సంవత్సరాల తర్వాత వృషభ రాశిలోకి సంచరిస్తారు. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గురు గ్రహ సంచారం నాలుగు రాశుల వారి అదృష్టాన్ని మెరుగుపరుస్తుంది.

నవగ్రహాలలో అత్యంత ముఖ్యమైన గ్రహ సంచారలలో బృహస్పతి రాశి మార్పు ఒకటి. మే 1వ తేదీ బుధవారం గురు గ్రహం శుక్రుడికి చెందిన వృషభ రాశిలోకి వెళ్ళబోతున్నాడు. బృహస్పతి సంచారం అనేక మందికి అవకాశాలు, అదృష్టాన్ని, అనుకూలమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు. ఈ నాలుగు రాశుల వారికి కుబేరుడి ఆశీర్వాదాలు కూడా లభించనున్నాయి. జీవితంలో ఏది కోరుకుంటే అది సాధ్యమవుతుంది.

హిందూ క్యాలెండర్ ప్రకారం దేవగురువుగా పరిగణించే బృహస్పతి మే 1న వృషభరాశిలోకి ప్రవేశించగా జూన్ 12న రోహిణి నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత అక్టోబర్ 9న తిరోగమన దశలో సంచరిస్తాడు. మళ్లీ ఫిబ్రవరి 4, 2025న ప్రత్యక్ష మార్గంలో ప్రయాణిస్తాడు. చివరిగా మే 14న వృషభ రాశి నుంచి నిష్క్రమించి మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే మళ్ళీ బృహస్పతి వచ్చే ఏడాది వరకు ఇదే రాశిలో కదలికలు మార్చుకుంటూ సంచరిస్తాడు. బృహస్పతి సంచారం వల్ల ఈ నాలుగు రాశుల వాళ్లు లాభాలు పొందబోతున్నారు.

మేష రాశి

బృహస్పతి మేష రాశిని వీడి వృషభ రాశిలోకి ప్రయాణించడంతో ఈ రాశి వారికి ఆర్థిక శ్రేయస్సు కలిగిస్తుంది. డబ్బు సంపాదించే అవకాశాలు పెరుగుతాయి. ఆర్థిక లాభాన్ని పొందుతారు. డబ్బు ఆదా చేయగలుగుతారు. భౌతిక సుఖాలు, విలాసాలు అనుభవిస్తారు. గతంలో తీసుకున్న రుణాలను తీర్చగలిగే అవకాశం మీకు లభిస్తుంది. అప్పుల బాధ నుంచి విముక్తి పొందవచ్చు. ఆర్థిక సమృద్ధితో సంతోషంగా గడుపుతారు. డబ్బు సమస్యలు ఎదుర్కొనే పరిస్థితే ఉండదు.

సింహ రాశి

గురు గ్రహ సంచారం సింహ రాశి వారికి ఆర్థిక లాభాన్ని ఇవ్వబోతుంది. పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందుతారు. ఊహించని ధన లాభాలు ఉంటాయి. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. ఆస్తి లేదా భూమిని కొనుగోలు చేసే సదావకాశం లభిస్తుంది. వీటివల్ల మీకు దీర్ఘకాలంలో ప్రయోజనాలు చేకూరుతాయి. ఖర్చులు తగ్గించుకోవాలి. కొత్త రుణం తీసుకోకుండా ఉండేందుకు ప్రయత్నించండి.

వృశ్చిక రాశి

బృహస్పతి సంచారం వల్ల వృశ్చిక రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తిపరమైన వ్యూహాలన్నీ విజయవంతం అవుతాయి. నెలవారి ఆదాయం పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. ఆర్థిక స్థితి బలంగా ఉండటం వల్ల అన్ని రకాల సౌకర్యాలు, విలాసాలు పొందగలుగుతారు. ఉద్యోగులకు జీతంలో ఇంక్రిమెంట్ లభిస్తుంది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ సమయంలో పూర్వీకుల ఆస్తి లభిస్తుంది. సంతోషంగా, సంతృప్తికరమైన ఆర్థిక లాభాలు పొందుతారు. మతపరమైన కార్యక్రమాలలో మీకు గౌరవం లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల కోసం డబ్బు ఖర్చు చేస్తారు. విదేశాలకు వెళ్తారు. అన్ని రకాల రుణాలు తీర్చుకోగలుగుతారు. కుబేరుడి దయతో సంపద నిల్వలు పెరుగుతాయి.

 

 

తదుపరి వ్యాసం