తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Ageing | ఏజ్ బార్ అయినట్లు కనిపిస్తున్నారా? కారణాలు ఇవే!

Ageing | ఏజ్ బార్ అయినట్లు కనిపిస్తున్నారా? కారణాలు ఇవే!

24 July 2022, 10:18 IST

కొంతమంది ఎంత వయసు పెరిగినా వారిపై ఆ ప్రభావం కనిపించదు. నిత్య యవ్వనంగా ఉంటారు. మరికొంత మంది తక్కువ వయసే ఉన్నప్పటి ఏజ్ బార్ అయినట్లుగా కనిపిస్తారు. అందుకు న్యూట్రిషనిస్టులి చెప్పిన కారణాలు ఇవే.

  • కొంతమంది ఎంత వయసు పెరిగినా వారిపై ఆ ప్రభావం కనిపించదు. నిత్య యవ్వనంగా ఉంటారు. మరికొంత మంది తక్కువ వయసే ఉన్నప్పటి ఏజ్ బార్ అయినట్లుగా కనిపిస్తారు. అందుకు న్యూట్రిషనిస్టులి చెప్పిన కారణాలు ఇవే.
వయసు పెరిగే కొద్దీ వృద్ధాప్య ఛాయలు రావడం సహజం. అయితే మనం తీసుకునే ఆహారం, సరైన జీవనశైలి లేకపోవటం వలన కూడా వృద్ధాప్యం వేగవంతం అవుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కొన్ని కారణాలను న్యూట్రిషనిస్ట్ అంజలి ముఖర్జీ ఎత్తిచూపారు. వాటిని మార్చుకోవాలని ఆమె సూచిస్తున్నారు.
(1 / 10)
వయసు పెరిగే కొద్దీ వృద్ధాప్య ఛాయలు రావడం సహజం. అయితే మనం తీసుకునే ఆహారం, సరైన జీవనశైలి లేకపోవటం వలన కూడా వృద్ధాప్యం వేగవంతం అవుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. కొన్ని కారణాలను న్యూట్రిషనిస్ట్ అంజలి ముఖర్జీ ఎత్తిచూపారు. వాటిని మార్చుకోవాలని ఆమె సూచిస్తున్నారు.(Unsplash)
ఎండలో తిరగటం వలన చర్మం దెబ్బతింటుంది. సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాలు చర్మం లోతైన పొరలను తాకి చర్మ కణాలకు హాని కలిగిస్తాయి. అందుకే సన్ స్క్రీన్ లోషన్ వాడాలి.
(2 / 10)
ఎండలో తిరగటం వలన చర్మం దెబ్బతింటుంది. సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాలు చర్మం లోతైన పొరలను తాకి చర్మ కణాలకు హాని కలిగిస్తాయి. అందుకే సన్ స్క్రీన్ లోషన్ వాడాలి.(Unsplash)
కొల్లాజెన్, ఎలాస్టిన్ అనేవి చర్మంలోని ఫైబరస్ భాగాలు. ఇవి ధూమపానం నుంచి వచ్చే టాక్సిన్స్ ద్వారా నాశనం అవుతాయి. ఇది అకాల వృద్ధాప్యానికి దారితీస్తుంది.
(3 / 10)
కొల్లాజెన్, ఎలాస్టిన్ అనేవి చర్మంలోని ఫైబరస్ భాగాలు. ఇవి ధూమపానం నుంచి వచ్చే టాక్సిన్స్ ద్వారా నాశనం అవుతాయి. ఇది అకాల వృద్ధాప్యానికి దారితీస్తుంది.(Unsplash)
ఒమేగా ఫ్యాటీ ఆసిడ్ చర్మానికి చాలా అవసరమయ్యే పోషకం. ఇలాంటి పోషకాలు లేని ఆహారం తినడం ద్వారా శరీరంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లోపానికి దారితీస్తుంది. ఇది వృద్ధాప్య ఛాయలకు దారితీస్తుంది.
(4 / 10)
ఒమేగా ఫ్యాటీ ఆసిడ్ చర్మానికి చాలా అవసరమయ్యే పోషకం. ఇలాంటి పోషకాలు లేని ఆహారం తినడం ద్వారా శరీరంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లోపానికి దారితీస్తుంది. ఇది వృద్ధాప్య ఛాయలకు దారితీస్తుంది.(Unsplash)
వాతావరణ కాలుష్యం కూడా చర్మం, జుట్టు దెబ్బతినటానికి ఒక కారణం
(5 / 10)
వాతావరణ కాలుష్యం కూడా చర్మం, జుట్టు దెబ్బతినటానికి ఒక కారణం(Unsplash)
చాలా కాలంగా మద్యం సేవించడం వల్ల చర్మంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఇది పొడి చర్మం, నల్లటి వలయాలు, చర్మంపై ముడతలు రావటానికి దారితీస్తుంది.
(6 / 10)
చాలా కాలంగా మద్యం సేవించడం వల్ల చర్మంపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. ఇది పొడి చర్మం, నల్లటి వలయాలు, చర్మంపై ముడతలు రావటానికి దారితీస్తుంది.(Unsplash)
దీర్ఘకాలంగా ఒత్తిడితో కూడిన జీవితం చర్మంపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అలాగే ఇది సోరియాసిస్, రోసేసియా, తామర వంటి చర్మ సమస్యలను కలగజేస్తుంది.
(7 / 10)
దీర్ఘకాలంగా ఒత్తిడితో కూడిన జీవితం చర్మంపై ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. అలాగే ఇది సోరియాసిస్, రోసేసియా, తామర వంటి చర్మ సమస్యలను కలగజేస్తుంది.(Unsplash)
సరైన నిద్ర లేకపోవడం వల్ల కార్టిసోల్ పెరుగుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన ప్రోటీన్లను విచ్ఛిన్నం చేస్తుంది.
(8 / 10)
సరైన నిద్ర లేకపోవడం వల్ల కార్టిసోల్ పెరుగుతుంది. ఇది చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి అవసరమైన ప్రోటీన్లను విచ్ఛిన్నం చేస్తుంది.(Unsplash)
వ్యాయామం రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది, తద్వారా చర్మ కణాలకు పోషణ లభిస్తుంది. వ్యాయామం లేకపోవడం చర్మానికి హానికరం.
(9 / 10)
వ్యాయామం రక్త ప్రసరణను పెంచడంలో సహాయపడుతుంది, తద్వారా చర్మ కణాలకు పోషణ లభిస్తుంది. వ్యాయామం లేకపోవడం చర్మానికి హానికరం.(Unsplash)

    ఆర్టికల్ షేర్ చేయండి