తెలుగు న్యూస్ / ఫోటో /
Anti-ageing nutrients : వయసు తగ్గించుకోవాలంటే.. ఇవి తినండి..
- వయసు పెరిగే కొద్దీ దాని ఛాయలు ముఖంపై కనిపిస్తాయి. చర్మంపై ముడతలు, జుట్టు పల్చగా మారుతుంది. కొన్ని సందర్భాలలో అవి ముందుగానే జరుగుతాయి. దాని వెనుక చాలా కారణాలు ఉంటాయి. జీవనశైలి సమస్యలు, పోషకాహార లోపం వల్ల కూడా ఈ సమస్యలు వస్తాయి. అయితే వాటిని కొన్ని ఆహారాలతో నియంత్రించవచ్చు అంటున్నారు నిపుణులు.

(1 / 6)
వయసు వల్ల ముఖంలో వృద్ధాప్య లక్షణాలు రావడం కామనే. అయితే వృద్ధాప్య ప్రక్రియను మందగించే కొన్ని ఆహారాలు లేదా పోషకాలు ఉన్నాయి. అంతే కాదు ఏజ్ మార్కులు ఉంటే.. చెరిపేయొచ్చు అంటున్నారు నిపుణులు.
(2 / 6)
ఈ ఆహారాలు లేదా పోషకాలన్నీ క్రమం తప్పకుండా తీసుకుంటే.. వెళితే జుట్టుకు పాత సాంద్రతను తీసుకురావచ్చు. చర్మంపై ముడతలు కూడా తగ్గుతాయి అంటున్నారు నిపుణులు. అయితే ఏం తినాలో చూద్దాం.
(3 / 6)
1. గ్రీన్ టీ: ఈ టీలో ఎపిగాల్లోకాటెచిన్ గాలెట్ (EGCG) అనే పాలీఫెనాల్ ఉంటుంది. ఇది వయస్సు సంబంధిత సమస్యలను ఎదుర్కోవడంలో ఇది చాలా సహాయపడుతుంది. అందుకే మీరు ప్రతిరోజూ ఒక కప్పు గ్రీన్ టీ తాగవచ్చు. ఇది వయస్సు సంబంధిత వ్యాధులను తగ్గిస్తుంది.
(4 / 6)
2. రెస్వెరాట్రాల్: ఇది కూడా ఒక రకమైన పాలీఫెనాల్ యాంటీఆక్సిడెంట్. ఇది శరీరంలో కొన్ని హార్మోన్ల స్రావాన్ని పెంచుతుంది. వీటిలో సిర్టుయిన్స్ అని పిలిచే ప్రమోటర్లు ఉన్నాయి. ఇది జీవిత కాలాన్ని పెంచడానికి, ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. ఈ రెస్వెరాట్రాల్ పల్లీలు, బాదం, పిస్తా, ద్రాక్ష, డార్క్ చాక్లెట్, రెడ్ వైన్ వంటి వాటిలో ఉంటుంది.
(5 / 6)
3. టమాట: చర్మం ముడతలను తగ్గించుకోవాలనుకుంటున్నారా? మెరిసే, బిగువు చర్మం కావాలా? అయితే మీకు టమాట సహాయం చేస్తుంది. పుచ్చకాయ, ఎర్ర ద్రాక్షలో కూడా ఈ లక్షణాలు సమృద్ధిగా ఉంటాయి,
ఇతర గ్యాలరీలు