కళ్ల కింద క్యారీ బ్యాగులు తయారవుతున్నాయా?-follow these home remedies to get rid of droopy eyelids ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Follow These Home Remedies To Get Rid Of Droopy Eyelids

కళ్ల కింద క్యారీ బ్యాగులు తయారవుతున్నాయా?

Manda Vikas HT Telugu
Mar 03, 2022 02:22 PM IST

వృద్ధాప్యంలో కనురెప్పలు వదులుగా, సంచిలాగా మారిపోవడం సహజమే. అయితే వయసులో ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడితే మాత్రం అది మీ రూపాన్ని ప్రభావితం చేస్తుంది. దీనిని ఎదుర్కోవడానికి, కనురెప్పల కండరాలను పటిష్ఠపరిచే కొన్ని ఇంటి నివారణ పద్ధతులు ఉన్నాయి.

Eyelids Care
Eyelids Care (Shutterstock)

వృద్ధాప్యంలో కనురెప్పలు వదులుగా, సంచిలాగా మారిపోవడం సహజమే. అయితే వయసులో ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి ఏర్పడితే మాత్రం అది మీ రూపాన్ని ప్రభావితం చేస్తుంది.  వయసులో చాలా పెద్ద వారిగా కనిపిస్తారు. కనురెప్పల్లో ఉండే లేవేటర్ అనే కండరం ఇందుకు కారణం. వృద్ధాప్యం వస్తున్నపుడు ఈ కండరం సాగటం వలన కనురెప్పలు కుంగుబాటుకు గురవుతాయి. అయితే ఈ పరిస్థితి ఏ వయసు వారికైనా రావొచ్చని వైద్యులు అంటున్నారు. దీనికి కచ్చితమైన కారణమైన కారణం ఏంటనేది తెలియకపోయినా కొన్నిసార్లు గాయం వలన లేదా నాడీవ్యవస్థలో లోపం వలన ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని చెబుతున్నారు.

ఈ పరిస్థితిని ఎదుర్కోవడానికి, కనురెప్పల కండరాలను పటిష్ఠపరిచే కొన్ని ఇంటి నివారణ పద్ధతులు ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.

కనురెప్పల ఆరోగ్యం కోసం హోం రెమెడీస్

దోసకాయ

దోసకాయల్లో ఆస్కార్బిక్ యాసిడ్, కెఫిక్ యాసిడ్ ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించి, మీ చర్మాన్ని బిగుతుగా మారుస్తాయి. కీరదోసకాయలో ఉండే పాంటోథెనిక్ యాసిడ్ చర్మాన్ని పునరుజ్జీవింపజేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దోసకాయలో విటమిన్ సి, పొటాషియం పుష్కలంగా ఉండటం వల్ల ఇవి వృద్ధాప్యపు ఛాయలను దూరం చేస్తాయి. రెండు చల్లటి , తాజా దోసకాయ ముక్కలను మీ కళ్లపై ఉంచి, కాసేపు విశ్రాంతి తీసుకోండి. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల కంటికి ప్రశాంతంగా అనిపించి, కంటి సమస్యలు మాయమవుతాయి.

చమోమిలే టీ బ్యాగులు

చమోమిలేలో యాంటీ ఇన్ల్ఫమేటరీ ఏజెంట్లు ఉన్నాయి. ఇవి కనురెప్పలు వాలిపోయే పరిస్థితిని నివారించడంలో సహాయపడతాయి. చమోమిలే టీ బ్యాగ్‌లను కొద్దిసేపు రిఫ్రిజిరేటర్‌లో ఉంచి, ఆపై వాటిని కళ్లపై ఉంచండి. చల్లటి టీ బ్యాగ్‌లను 15 నుండి 20 నిమిషాలు కళ్లపై ఉంచితే ఎంతో ఆహ్లాదకరమైన అనుభూతి కలుగుతుంది. ప్రతిరోజూ ఇలా చేస్తే మార్పులు మీరే గమనిస్తారు.

కలబంద

మీ కళ్ళను ప్రకాశవంతంగా మార్చడానికి సహజసిద్ధంగా ఇలా ఒక మిశ్రమాన్ని ఇంట్లోనే తయారు చేసుకోండి. 4 టేబుల్ స్పూన్ల కలబంద జెల్, 4 టేబుల్ స్పూన్ల పెరుగు, 2 టేబుల్ స్పూన్ల ఓట్ మీల్, ఒక ఐదు దోసకాయ ముక్కలను కలిపి, మిక్సీలో బాగా మిక్స్ చేసి ఒక లోషన్‌ లాగా సిద్ధం చేసుకోండి. మరీ పలచగా కాకుండా కొద్దిగా చిక్కగా, మృదువైన పేస్ట్ వచ్చేలాగా తయారు చేసుకోండి. ఈ పేస్ట్‌ను మీ కనురెప్పలకు అప్లై చేసి 20 నిమిషాల పాటు ఉంచి, చల్లటి నీటితో శుభ్రం చేసుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి.

ఐస్ క్యూబ్స్

అప్పుడప్పుడు మీ కళ్లను శుభ్రమైన ఐస్ క్యూబ్స్ తో సున్నితంగా మర్ధన చేయండి. ఇది వదులుగా మారే చర్మ స్థితిస్థాపకతను మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా రక్త నాళాలను మెత్తబడే ప్రభావాన్ని ఇది నిరోధిస్తుంది. దీంతో కనురెప్పలు వదులుగా మారకుండా నివారించవచ్చు.

ఆలివ్ నూనె

ఆలివ్ ఆయిల్ కనురెప్పల ఆరోగ్యంపై ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఈ నూనెలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి చర్మ స్థితిస్థాపకతను కాపాడుతాయి. కొద్దిగా ఆయిల్ ఆయిల్‌ను వేడిచేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు కనురెప్పలపై మృదువుగా మర్ధన చేయాలి. రాత్రి పడుకునే ముందు ఇలా మర్ధన చేసుకొని వదిలివేయవచ్చు. ఇలా క్రమంగా చేస్తూ పోతే మెరుగైన ఫలితాలు లభిస్తాయి.

గుడ్డు తెల్లసొన

గుడ్డులోని తెల్లసొనలో సహజసిద్ధమైన ఎంజైములు ఉంటాయి, ఇవి చర్మాన్ని బిగుతుగా మార్చడంలో సహాయపడతాయి. ఇది కనురెప్పల స్థితిస్థాపకతను కూడా పెంచుతుంది. గుడ్డు నుండి గుడ్డులోని తెల్లసొనను సేకరించి, దానిని మీ కనురెప్పలకు అప్లై చేయండి. ఆరిపోయిన తర్వాత చల్లటి నీటితో శుభ్రంచేసుకోండి. ఇది కనురెప్పలు వదులుగా మారే ప్రమాదాన్ని చాలా వరకు నివారిస్తుంది.

WhatsApp channel

టాపిక్