తెలుగు న్యూస్ / ఫోటో /
Japanese Lifestyle | ఎక్కువకాలం బ్రతకాలంటే జపనీయుల లైఫ్‌స్టైల్ అలవాటు చేసుకోవాలట
- కొన్ని రకాల జపనీస్ సాంప్రదాయాలు, అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా ఆరోగ్యం పెరుగుతుందట, తద్వారా ఎక్కువ కాలం జీవించే అవకాశం కలుగుతుందని చెబుతున్నారో. అవేంటో ఒక లుక్ వేయండి.
- కొన్ని రకాల జపనీస్ సాంప్రదాయాలు, అలవాట్లను అలవర్చుకోవడం ద్వారా ఆరోగ్యం పెరుగుతుందట, తద్వారా ఎక్కువ కాలం జీవించే అవకాశం కలుగుతుందని చెబుతున్నారో. అవేంటో ఒక లుక్ వేయండి.
(1 / 8)
ప్రపంచంలోని ఇతర దేశాల కంటే జపాన్ ప్రజల సగటు ఆయుర్దాయం ఎక్కువ, మరణాల రేటు తక్కువ అని గణాంకాలు చెబుతున్నాయి. వారి పురాతన సంప్రదాయ పద్ధతులు వారిని ఆరోగ్యంగా, ఎక్కువ కాలం జీవించేలా చేస్తాయి. జపనీస్ సాంప్రదాయాల నుంచి మీరు అవలంబించగల కొన్ని అలవాట్లు ఇక్కడ పేర్కొన్నాం. వీటిని అనుసరిస్తే దీర్ఘకాలిక అనారోగ్యాలు కలిగి ఉండే వారు సైతం ఎక్కువ జీవితకాలాన్ని పొందుతారట.(Unsplash)
(2 / 8)
గోధుమల కంటే బియ్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. జపనీయులు ప్రతిరోజూ మితంగా అన్నం తీసుకుంటారు. బియ్యం పిండి హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి.(Unsplash)
(3 / 8)
జపనీయులు క్రమం తప్పకుండా సీవీడ్ తింటారు. సీవీడ్ (ఒక రకమైన పాకురు లేదా శైవలము) లో ఉన్నటువంటి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా శతాబ్దాలుగా జపనీస్ ఆహారంలో ఇది భాగంగా ఉంది. ఇందులో విటమిన్లు (A, C, మరియు E), యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వ్యాధులను నియంత్రిస్తుంది.(Unsplash)
(4 / 8)
జపనీయులు ఫిట్ బాడీని మెయింటెయిన్ చేయడానికి జిమ్‌కి వెళ్లడం వంటివి ఎక్కువగా చేయరు. కానీ రోజూ వాకింగ్ లేదా జాగింగ్ చేయడానికి ఇష్టపడతారు. ఉదయం Asa taisou వ్యాయామాన్ని ప్రాక్టీస్ చేస్తారు.(Unsplash)
(5 / 8)
జపనీయులు మిసో, నాట్టో, సోయా, టేంపే, సోయా సాస్ వంటి పులియబెట్టిన ఆహారాలను ఎక్కువగా తీసుకుంటారు. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో, జీర్ణక్రియను సులభతరం చేయడంలో సహాయపడతాయి.(Unsplash)
(6 / 8)
జపనీయులకు గ్రీన్ టీ అంటే చాలా ఇష్టం. గ్రీన్ టీని వినియోగించే ప్రపంచంలోని మొదటి పది దేశాలలో జపాన్ కచ్చితంగా ఉంటుంది. ఇది క్యాన్సర్‌తో పోరాడటానికి, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి, శక్తి స్థాయిలను పెంచడానికి సహాయపడే యాంటీఆక్సిడెంట్‌లతో నిండిన టీ.(Unsplash)
(7 / 8)
జపనీయులు సేంద్రీయంగా పెరిగిన స్థానిక ఆహారాలను తినడానికి ఇష్టపడతారు. ప్రాసెస్ చేసే ఆహారాలకు దూరంగా ఉంటారు.(Unsplash)
ఇతర గ్యాలరీలు