తెలుగు న్యూస్  /  ఫోటో  /  Parenting Tips । టీనేజ్ పిల్లలతో పేరేంట్స్ ఎలా మెలగాలి? నిపుణుల చిట్కాలు ఇవిగో!

Parenting Tips । టీనేజ్ పిల్లలతో పేరేంట్స్ ఎలా మెలగాలి? నిపుణుల చిట్కాలు ఇవిగో!

04 December 2022, 12:02 IST

Parenting Tips: చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు శారీరకంగా దృఢంగా ఉండాలని కోరుకుంటారు. అయితే వారి మానసిక ఎదుగుదలపై ఎక్కువ దృష్టిపెట్టరు. పిల్లల్లో విచక్షణ పెరగాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.

  • Parenting Tips: చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు శారీరకంగా దృఢంగా ఉండాలని కోరుకుంటారు. అయితే వారి మానసిక ఎదుగుదలపై ఎక్కువ దృష్టిపెట్టరు. పిల్లల్లో విచక్షణ పెరగాలంటే ఏం చేయాలో తెలుసుకోండి.
టీనేజర్ల ఆలోచనల్లో అంతగా పరిణితి అనేది ఉండదు, తాము పెద్దవాళ్లు అయిపోయారని భావిస్తారు. వారిలో విషయాల పట్ల అవగాహన, పనికొచ్చే అలవాట్లను ఎలా పెంపొందించాలో యోగా ఆఫ్ ఇమ్మోర్టల్స్ వ్యవస్థాపకులు ఇషాన్ శివానంద్ కొన్ని సూచనలు చేశారు.
(1 / 7)
టీనేజర్ల ఆలోచనల్లో అంతగా పరిణితి అనేది ఉండదు, తాము పెద్దవాళ్లు అయిపోయారని భావిస్తారు. వారిలో విషయాల పట్ల అవగాహన, పనికొచ్చే అలవాట్లను ఎలా పెంపొందించాలో యోగా ఆఫ్ ఇమ్మోర్టల్స్ వ్యవస్థాపకులు ఇషాన్ శివానంద్ కొన్ని సూచనలు చేశారు.(Pexels)
తల్లిదండ్రులు, పెద్దలకు ఉన్నట్లుగానే పిల్లలు కూడా తమ జీవితంలో ఒత్తిడిని ఎదుర్కొంటారు. పరీక్షలు- విద్యాపరమైన ఒత్తిడి, తోటివారితో బెదిరింపులు, సోషల్ మీడియా ఒత్తిడి మొదలన మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటారు. ఇవి టీనేజర్లలలో పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD), జనరలైజ్డ్ యాంగ్జయిటీ డిజార్డర్ (GAD), ఆందోళన, నిరాశ , నిద్రలేమి వంటి సమస్యలను కలిగిస్తాయి. మాదక ద్రవ్యాల వినియోగం జరిగితే మరింత ఒత్తిడి ఉంటుంది. ఈ కింది సూచనలు పాటించండి.
(2 / 7)
తల్లిదండ్రులు, పెద్దలకు ఉన్నట్లుగానే పిల్లలు కూడా తమ జీవితంలో ఒత్తిడిని ఎదుర్కొంటారు. పరీక్షలు- విద్యాపరమైన ఒత్తిడి, తోటివారితో బెదిరింపులు, సోషల్ మీడియా ఒత్తిడి మొదలన మానసిక ఒత్తిళ్లను ఎదుర్కొంటారు. ఇవి టీనేజర్లలలో పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD), జనరలైజ్డ్ యాంగ్జయిటీ డిజార్డర్ (GAD), ఆందోళన, నిరాశ , నిద్రలేమి వంటి సమస్యలను కలిగిస్తాయి. మాదక ద్రవ్యాల వినియోగం జరిగితే మరింత ఒత్తిడి ఉంటుంది. ఈ కింది సూచనలు పాటించండి.(Pexels)
మీ పిల్లల ఉనికిని గుర్తించండి, వారితో కలిసి చిన్నచిన్న అంశాలను వేడుక జరుపుకోండి. లాజికల్, హెలికాప్టర్ పేరెంటింగ్ మైండ్ ఫ్రేమ్‌లను దాటి వెళుతున్నప్పుడు, మీ పిల్లల్లో మార్పు కలుగుతుంది.
(3 / 7)
మీ పిల్లల ఉనికిని గుర్తించండి, వారితో కలిసి చిన్నచిన్న అంశాలను వేడుక జరుపుకోండి. లాజికల్, హెలికాప్టర్ పేరెంటింగ్ మైండ్ ఫ్రేమ్‌లను దాటి వెళుతున్నప్పుడు, మీ పిల్లల్లో మార్పు కలుగుతుంది.(Pexels)
యోగా- ధ్యానం వంటి పద్ధతుల ద్వారా వారిలో ప్రవర్తనా మార్పుకు సహకరించండి: టీనేజర్లు స్వీయ-అవగాహన, ప్రశంసల భావాన్ని పెంపొందించుకోవడానికి వారికి విలువలు నేర్పించాలి. టీనేజర్లతో తల్లిదండ్రులు స్నేహపూర్వకమైన సంబంధాన్ని కలిగి ఉండాలి. యోగా అభ్యాసం వారి కంఫర్ట్ జోన్‌ను దాటి వెళ్లడానికి , చెడు అలవాట్లను తిప్పికొట్టడానికి, వారి జీవన నాణ్యత , సంబంధాలను మెరుగుపరచటానికి తోడ్పడుతుంది.
(4 / 7)
యోగా- ధ్యానం వంటి పద్ధతుల ద్వారా వారిలో ప్రవర్తనా మార్పుకు సహకరించండి: టీనేజర్లు స్వీయ-అవగాహన, ప్రశంసల భావాన్ని పెంపొందించుకోవడానికి వారికి విలువలు నేర్పించాలి. టీనేజర్లతో తల్లిదండ్రులు స్నేహపూర్వకమైన సంబంధాన్ని కలిగి ఉండాలి. యోగా అభ్యాసం వారి కంఫర్ట్ జోన్‌ను దాటి వెళ్లడానికి , చెడు అలవాట్లను తిప్పికొట్టడానికి, వారి జీవన నాణ్యత , సంబంధాలను మెరుగుపరచటానికి తోడ్పడుతుంది.(Pixabay)
పిల్లలు వారి దినచర్యను వారే సొంతంగా రూపొందించుకునేలా అవకాశం ఇవ్వండి. వారి సామర్థ్యాన్ని బయటకు తీసే అలవాట్లు వారికి నేర్పించండి. జర్నలింగ్, విజువలైజేషన్ వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించగల అద్భుతమైన సాధనాలు. సంతృప్తికరమైన, ప్రశాంతమైన జీవితం కోసం కృతజ్ఞత, క్షమాపణ, అంగీకారం, షరతులు లేని ప్రేమ విలువలను వారికి నేర్పండి.
(5 / 7)
పిల్లలు వారి దినచర్యను వారే సొంతంగా రూపొందించుకునేలా అవకాశం ఇవ్వండి. వారి సామర్థ్యాన్ని బయటకు తీసే అలవాట్లు వారికి నేర్పించండి. జర్నలింగ్, విజువలైజేషన్ వారి ఆత్మగౌరవాన్ని పెంపొందించగల అద్భుతమైన సాధనాలు. సంతృప్తికరమైన, ప్రశాంతమైన జీవితం కోసం కృతజ్ఞత, క్షమాపణ, అంగీకారం, షరతులు లేని ప్రేమ విలువలను వారికి నేర్పండి.(Pexels)
వారి పోషకాహార అవసరాలను తెలియజేయండి. అయితే ఏం తినాలో, ఏం తినకూడదో మీ పిల్లలపై మీ నిర్ణయాలను బలవంతంగా రుద్దడానికి బదులుగా, ఆరోగ్యకరమైన ఆహారంపై మీ అభిప్రాయాలను వివరించండి. మీ ప్రేమను, ఆందోళనను సమర్థవంతంగా వ్యక్తపరచండి. వారి ఆరోగ్యం , శ్రేయస్సు మీ బాధ్యత అని వారికి తెలియపరచండి.
(6 / 7)
వారి పోషకాహార అవసరాలను తెలియజేయండి. అయితే ఏం తినాలో, ఏం తినకూడదో మీ పిల్లలపై మీ నిర్ణయాలను బలవంతంగా రుద్దడానికి బదులుగా, ఆరోగ్యకరమైన ఆహారంపై మీ అభిప్రాయాలను వివరించండి. మీ ప్రేమను, ఆందోళనను సమర్థవంతంగా వ్యక్తపరచండి. వారి ఆరోగ్యం , శ్రేయస్సు మీ బాధ్యత అని వారికి తెలియపరచండి.(Pexels)

    ఆర్టికల్ షేర్ చేయండి