తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Monkeypox Health Ministry Lists Do's And Don'ts For Viral Disease

Monkeypox సోకకుండా ఏం చేయాలి? ఏం చేయకూడదు? కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలు..

03 August 2022, 18:01 IST

మంకీపాక్స్ (MPX) అనేది ఒక వైరల్ జూనోటిక్ వ్యాధి, ఇది మశూచికి సమానమైన లక్షణాలతో ఉంటుంది. MPXను మొదటిసారిగా 1958లో పరిశోధన కోసం ఉంచిన కోతుల కాలనీలలో గుర్తించారు. అందుకే దీనికి 'Monkeypox' అనే పేరు వచ్చింది.

  • మంకీపాక్స్ (MPX) అనేది ఒక వైరల్ జూనోటిక్ వ్యాధి, ఇది మశూచికి సమానమైన లక్షణాలతో ఉంటుంది. MPXను మొదటిసారిగా 1958లో పరిశోధన కోసం ఉంచిన కోతుల కాలనీలలో గుర్తించారు. అందుకే దీనికి 'Monkeypox' అనే పేరు వచ్చింది.
భారతదేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో మంకీపాక్స్ కు అడ్డుకట్ట వేయాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి. ఇందుకోసం ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఒక టాస్క్‌ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. మంకీపాక్స్ సోకకుండా ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనేది తెలుపుతూ కొన్ని సూచనలు చేసింది.
(1 / 10)
భారతదేశంలో మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దేశంలో మంకీపాక్స్ కు అడ్డుకట్ట వేయాలంటే ప్రజల్లో చైతన్యం రావాలి. ఇందుకోసం ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఒక టాస్క్‌ఫోర్స్‌ను కూడా ఏర్పాటు చేసినట్లు కేంద్రం వెల్లడించింది. ఈ వ్యాధి మరింత వ్యాప్తి చెందకుండా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. మంకీపాక్స్ సోకకుండా ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనేది తెలుపుతూ కొన్ని సూచనలు చేసింది.(Image by Pete Linforth from Pixabay )
చేయాల్సినది: వ్యాధి సోకిన వ్యక్తిని వేరుగా ఉంచాలి. తద్వారా వ్యాధి ఇతరులకు వ్యాపించదు.
(2 / 10)
చేయాల్సినది: వ్యాధి సోకిన వ్యక్తిని వేరుగా ఉంచాలి. తద్వారా వ్యాధి ఇతరులకు వ్యాపించదు.(HT Photo/Suni Ghosh)
చేయాల్సినది: ఎల్లప్పుడూ హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించండి. మీ చేతులను సబ్బుతో కడుక్కొని శుభ్రంగా ఉంచుకోవాలి.
(3 / 10)
చేయాల్సినది: ఎల్లప్పుడూ హ్యాండ్ శానిటైజర్ ఉపయోగించండి. మీ చేతులను సబ్బుతో కడుక్కొని శుభ్రంగా ఉంచుకోవాలి.(Unsplash)
చేయాల్సినది: రోగికి దగ్గరగా ఉన్నప్పుడు మీ ముఖానికి మాస్క్‌ పెట్టుకోండి. అలాగే చేతులకు డిస్పోజబుల్ గ్లోవ్స్‌ను తొడగండి.
(4 / 10)
చేయాల్సినది: రోగికి దగ్గరగా ఉన్నప్పుడు మీ ముఖానికి మాస్క్‌ పెట్టుకోండి. అలాగే చేతులకు డిస్పోజబుల్ గ్లోవ్స్‌ను తొడగండి.(Unsplash)
చేయాల్సినది: మీ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. డిస్ఇన్ఫెక్టెంట్ ద్రావణాలతో కడుక్కోండి.
(5 / 10)
చేయాల్సినది: మీ చుట్టూ ఉన్న పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి. డిస్ఇన్ఫెక్టెంట్ ద్రావణాలతో కడుక్కోండి.(Unsplash)
చేయకూడనివి: వైరస్ సోకిన వ్యక్తులను, అనుమానిత రోగులను అవమానపరచకూడదు. అలాగే ఎలాంటి పుకార్లు నమ్మవద్దు, తప్పుడు సమాచారాన్నివ్యాప్తి చేయవద్దు.
(6 / 10)
చేయకూడనివి: వైరస్ సోకిన వ్యక్తులను, అనుమానిత రోగులను అవమానపరచకూడదు. అలాగే ఎలాంటి పుకార్లు నమ్మవద్దు, తప్పుడు సమాచారాన్నివ్యాప్తి చేయవద్దు.(File image)
చేయకూడనివి: మీకు వ్యాధి లక్షణాలను కనిపిస్తున్నపుడు బహిరంగ ప్రదేశాలలో తిరగడం, ఇతర పబ్లిక్ కార్యక్రమాలలో పాల్గొనటం చేయవద్దు.
(7 / 10)
చేయకూడనివి: మీకు వ్యాధి లక్షణాలను కనిపిస్తున్నపుడు బహిరంగ ప్రదేశాలలో తిరగడం, ఇతర పబ్లిక్ కార్యక్రమాలలో పాల్గొనటం చేయవద్దు.(PTI)
చేయకూడనివి: మంకీపాక్స్‌ సోకిన వ్యక్తులకు సంబంధించిన బ్లాంకెట్లు, పరుపు, బట్టలు, తువ్వాళ్లు మొదలైన వాటిని ఇతరులు వాడకూడదు.
(8 / 10)
చేయకూడనివి: మంకీపాక్స్‌ సోకిన వ్యక్తులకు సంబంధించిన బ్లాంకెట్లు, పరుపు, బట్టలు, తువ్వాళ్లు మొదలైన వాటిని ఇతరులు వాడకూడదు.(PTI)
చేయకూడనివి: రోగి వాడిన బట్టలు వేరేగా ఉతకాలి. అందరి బట్టలు కలపకూడదు.
(9 / 10)
చేయకూడనివి: రోగి వాడిన బట్టలు వేరేగా ఉతకాలి. అందరి బట్టలు కలపకూడదు.(AP)

    ఆర్టికల్ షేర్ చేయండి