Monkeypox | ఉపవాసంతో మంకీపాక్స్‌ను నయం చేయొచ్చు, ఆయుర్వేదంలో అద్భుత పరిష్కారాలు!
ఆయుర్వేదం ప్రకారం, మంకీపాక్స్‌ను మసూరికా వ్యాధిగా వర్గీకరించవచ్చు. ఈ వ్యాధి లక్షణాల నివారణకు ఆయుర్వేద ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. ఉపవాసం కూడా ఉండటం కూడా చికిత్సలో ఒక భాగం. చికిత్సకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకోండి.
భారతదేశంలో మంకీపాక్స్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఆగష్టు 2, 2022 నాటికి దేశంలో మంకీపాక్స్ కేసులు 8కి చేరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. జూలై 22న యూఏఈ నుంచి భారత్‌కు వచ్చిన కేరళకు చెందిన ఓ 22 ఏళ్ల యువకుడు ఇటీవలే ఈ ఇన్‌ఫెక్షన్‌తో మరణించాడు. ఈ నేపథ్యంలో మంకీపాక్స్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఏర్పడింది.
Monkeypox వైరస్ అనేది Poxviridae కుటుంబానికి చెందిన Orth opox వైరస్ జాతికి చెందిన డబుల్ స్ట్రాండెడ్ DNA వైరస్ వలన సంభవిస్తుంది. మశూచి, మంకీపాక్స్ లక్షణాలు ఒకేలా ఉంటాయి అయితే మశూచికి స్వల్పంగా ఉంటాయి. ఈ వ్యాధి పొదిగే కాలం 6-13 రోజులుగా అంచనా వేశారు. వ్యాధి తీవ్రతను బట్టి సాధారణంగా 2-4 వారాల మధ్య ఉంటుంది.
మంకీపాక్స్ వ్యాధి లక్షణాలు
దద్దుర్లు, వాపు శోషరస గ్రంథులు, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, నీరసం, జ్వరం వంటి లక్షణాలతో మంకీపాక్స్ వ్యాధి ప్రారంభమవుతుంది. ఆ తరువాత మశూచి ఇన్ఫెక్షన్ మాదిరిగానే చర్మంపై మాక్యులో-పాపులర్ దద్దుర్లు ఏర్పడతాయి. దీనిని నియంత్రంచటానికి సరైన జాగ్రత్తలు, వైద్య సహాయం తీసుకోవాలి. మంకీపాక్స్ నివారణకు కొన్ని ఆయుర్వేద చిట్కాలు కూడా ఉన్నాయి. ముందుజాగ్రత్తగా ఈ విధానం కూడా ప్రయత్నించవచ్చు.
మంకీపాక్స్ నివారణకు ఆయుర్వేద చిట్కాలు
ఢిల్లీలోని ఆల్ ఇండియా ఆయుర్వేదిక్ ఇనిస్టిట్యూట్ లో ప్రొఫెసర్ & HoD అయిన డాక్టర్ ఆనంద్ మోరే మాట్లాడుతూ.. మంకీపాక్స్ లక్షణాలు, ఇతర క్లినికల్ సంకేతాలను బట్టి దీనిని మసూరికా వ్యాధిగా వర్గీకరించవచ్చని చెప్పారు. ఆయుర్వేదం ప్రకారం దీనినే 'పిత్త- రక్త దుష్టి జన్య వ్యాధి' అని పిలుస్తారు.
డాక్టర్ ఆనంద్ మోరే చెప్పినట్లుగా ఆయుర్వేదం ప్రకారం మంకీపాక్స్‌ను చికిత్స చేయడానికి లేదా నివారించటానికి ఏమేం చేయాలో ఇక్కడ తెలియజేస్తున్నాం, గమనించండి.
లంఘనా (ఉపవాసం)
రోగులను ఉపవాసం పాటించాల్సి ఉంటుంది. ఆహారం తీసుకోకపోవడం లేదా తక్కువ పరిమాణంలో ఆహారం తీసుకోవడం చేయాలి.
మృదు-విరేచన్ చికిత్స
ఇది పంచకర్మ చికిత్సలలో ఒక భాగం. త్రివృత్, ఆరగ్వద్, త్రిఫల మొదలైన పిట్ట-షమక్ మందులను తీసుకోవాలి.
ఆయుర్వేద ఔషధాలు
- జ్వరం తగ్గించటానికి మహా సుదర్శన్ ఘనావతి, లక్ష్మీవిలాస్ రాస్, సంశమణి వటి, అమృతారిష్టలను తీసుకోవచ్చు.
- రక్త, పిత్త దుష్టి కోసం పంచనింబాది వటి/చూర్ణం, హరిద్రా ఖండం, ఆరగ్వధరిష్ట , బృహత్ మంజిష్టది క్వాత్‌లను ఉపయోగించవచ్చు.
- దద్దుర్లు శుభ్రం చేయడానికి, కడగడానికి నీంపత్ర క్వాత్, త్రిఫల క్వాత్ ఉపయోగించవచ్చు.
- రోగనిరోధక శక్తి కోసం, చ్యవనప్రాష్ అవలేహ, బ్రహ్మ రసాయనం, అశ్వగంధాదిలేహ్య, కూష్మాండ రసాయనం వంటి ఇమ్యునో బూస్టర్ మందులు ఉపయోగించవచ్చు.
ఎలాంటి ఆహారం తీసుకోవాలి?
ఆయుర్వేదం ప్రకారం, మంకీపాక్స్ ను నియంత్రించాలంటే పాత బ్రౌన్ రైస్, శనగపప్పు, షడంగ పానీయం, పెసరిపప్పు, మినపపప్పు, బియ్యంతో చేసిన గంజి, కందిపప్పు, యావ, ములక్కాడలు, ద్రాక్ష, దానిమ్మ వంటి పండ్లను ఆహారంలో చేర్చుకోవాలి. ఎల్లప్పుడూ గోరువెచ్చని నీరు త్రాగాలి.
నివారించవలసిన ఆహారాలు
నూనె పదార్థాలు, జంక్ ఫుడ్స్, కొత్తగా పండించిన బియ్యం, ఆకు కూరలు, ఎక్కువ ఉప్పు, ఎక్కువ కారం, పులుపు ఆహారాలకు దూరంగా ఉండాలి. ధూమపానం, మద్యం సేవించడం, పొగాకు నమలడం పూర్తిగా వదిలేయాలి.
చివరగా..
మంకీపాక్స్ సోకినపుడు రోగి అధిక శ్రమ చేయకూడదు. విశ్రాంతి తీసుకోవాలి. అధికకోపం , ఎండలో ఉండటం నివారించాలి. కోరికలను అణిచివేసుకోవాలి. వ్యక్తి సామర్థ్యాలకు తగినట్లుగా ప్రతిరోజూ ప్రాణాయామం, ధ్యానం వంటివి చేయాలి.
సంబంధిత కథనం