తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Monkeypox | మంకీపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ!

Monkeypox | మంకీపాక్స్‌ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ!

24 July 2022, 9:52 IST

మంకీపాక్స్ వ్యాప్తి ఆందోళన కలిగిస్తుంది. ఆఫ్రికా, అమెరికా, యూరోప్ దేశాలలో ఒక్కొక్కటిగా బయటపడిన కేసులు ఇప్పుడు ఇంకా పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 70కి పైగా దేశాలకు మంకీపాక్స్ విస్తరించింది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తం అయింది. మంకీపాక్స్ వ్యాప్తి అనేది "అసాధారణ" పరిస్థితి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. 'గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ' ప్రకటిస్తున్నట్లు WHO చీఫ్ టెడ్రోస్ ఘెబ్రేయేసస్ వెల్లడించారు. సాధారణంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించటం చాలా అరుదు. ఇది ప్రజల ఆరోగ్యానికి సంబంధించి WHO విడుదల చేసే అత్యున్నత స్థాయి హెచ్చరిక. 2014లో పశ్చిమ ఆఫ్రికాలో ఎబోలా వ్యాప్తి, 2016లో లాటిన్ అమెరికాలో 2016లో జికా వైరస్ వైరస్ వ్యాప్తి, అలాగే ఆ తర్వాత కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి సమయంలో WHO ఇలాంటి ప్రకటనలు చేసింది. తాజాగా 'మంకీపాక్స్' ను గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా పేర్కొంటూ ప్రకటన చేసింది. మరిన్ని వివరాల కోసం ఈ వీడియో చూడండి.