తెలుగు న్యూస్  /  ఫోటో  /  Mistakes During Period : పీరియడ్స్ సమయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి..

Mistakes during Period : పీరియడ్స్ సమయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి..

19 November 2022, 9:00 IST

Mistakes during Period : పీరియడ్స్ సమయంలో చాలా మంది కడుపు నొప్పితో బాధపడుతుంటారు. అలాగే బాడీ పెయిన్స్ బాగా ఇబ్బంది పెడతాయి. అయితే తెలిసో, తెలియకో కొందరు ఈ సమయంలో కొన్ని మిస్టెక్స్ చేస్తారు. దీని వల్ల సమస్యలు మరింత పెరిగి.. పరిస్థితి దిగజారుతుంది. కాస్త అప్రమత్తంగా ఉంటే ఈ సమస్యల నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు అంటున్నారు నిపుణులు.

  • Mistakes during Period : పీరియడ్స్ సమయంలో చాలా మంది కడుపు నొప్పితో బాధపడుతుంటారు. అలాగే బాడీ పెయిన్స్ బాగా ఇబ్బంది పెడతాయి. అయితే తెలిసో, తెలియకో కొందరు ఈ సమయంలో కొన్ని మిస్టెక్స్ చేస్తారు. దీని వల్ల సమస్యలు మరింత పెరిగి.. పరిస్థితి దిగజారుతుంది. కాస్త అప్రమత్తంగా ఉంటే ఈ సమస్యల నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు అంటున్నారు నిపుణులు.
స్త్రీ జీవితంలో పీరియడ్స్ ఒక ముఖ్యమైన భాగం. రక్తస్రావం, శరీర నొప్పులు, తలనొప్పి, నిద్రలేమి, మానసిక స్థితి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఈ పీరియడ్స్ పట్ల మహిళలు కచ్చితంగా శ్రద్ధ వహించాలి. కానీ కొందరు మహిళలు తెలియకు అనేక తప్పులు చేస్తారు.
(1 / 7)

పీరియడ్స్ సమయంలో మహిళలు తరచుగా ప్యాడ్‌లు లేదా టాంపోన్‌లను ఉపయోగిస్తారు. కొన్నిసార్లు రేయాన్, పత్తితో తయారుచేసిన టాంపోన్లు, ప్యాడ్లను వాడతారు. ఇవి శరీరానికి అంత మంచిది కాదు. వాటిలో కొన్ని రసాయనాలు వాడతారు. ఈ సమస్య నుంచి బయటపడటానికి.. కాటన్ ప్యాడ్లను ఉపయోగించడం ఉత్తమం.
(2 / 7)

చాలా మంది పీరియడ్స్ సమయంలో తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుంటారు. అలాగే బాడీ పెయిన్స్ చాలా ఇబ్బంది పెడతాయి. ఈ పరిస్థితి నుంచి ఉపశమనం పొందేందుకు చాలా మంది పెయిన్ కిల్లర్స్ తీసుకుంటారు. ఒకటి, రెండు సార్లు పర్లేదు కానీ.. ఎక్కువ కాలం పెయిన్ కిల్లర్స్ వేసుకుంటే.. సమస్య చాలా రెట్లు పెరిగిపోతుంది. అంతేకాకుండా గుండె సమస్యలకు దారితీస్తుంది.
(3 / 7)

చాలా మంది నిపుణులు పీరియడ్స్ సమయంలో మిమ్మల్ని మీరు శుభ్రంగా ఉంచుకోవాలని సూచిస్తారు. అలా అని యోనిని సబ్బుతో పదే పదే కడగకండి. ఇది ఇతర సమస్యలకు దారి తీస్తుంది.
(4 / 7)

ప్యాడ్‌లను మారుస్తూ ఉండండి. గంటల తరబడి వాటితో ఉండడం వల్ల ఇన్‌ఫెక్షన్లు త్వరగా ఎటాక్ అవుతాయి. ఫలితంగా దుర్వాసన, తేమ ఎక్కువ అవుతుంది. మెన్స్ట్రువల్ కప్ అయితే 12 గంటల వరకు ప్రభావవంతంగా ఉంటుంది. కానీ ప్యాడ్‌ను మూడు, నాలుగు గంటలకు ఒకసారి మార్చితే మంచిది.
(5 / 7)

పీరియడ్స్ సమయంలో కాఫీ మోతాదు తగ్గించండి. చాలా మంది పీరియడ్స్ సమయంలో తలనొప్పి నుంచి ఉపశమనం కోసం కాఫీ తీసుకుంటారు. అయితే ఇందులో ఉండే కెఫిన్ వల్ల శరీరం డీహైడ్రేషన్​కు గురవుతుంది. ఫలితంగా పీరియడ్స్ సమస్య మరింత పెరుగుతుంది.
(6 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి