తెలుగు న్యూస్  /  Photo Gallery  /  Health And Beauty Benefits Of Clove Oil Specially In Winter

Benefits of Clove Oil : చలికాలంలో అందం, ఆరోగ్యం కోసం లవంగం నూనె బెస్ట్

17 November 2022, 14:35 IST

Benefits of Clove Oil : చలికాలంలో కూడా మీ ముఖం మచ్చలు లేకుండా.. మెరిసిపోవాలంటే.. మీరు లవంగం నూనె ఉపయోగించవచ్చు అంటున్నారు నిపుణులు. ఇది మీకు తేమను ఇవ్వడమే కాకుండా.. మెరుగైన చర్మాన్ని అందిస్తుంది.  పైగా దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా పొందవచ్చని తెలిపారు. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్.

  • Benefits of Clove Oil : చలికాలంలో కూడా మీ ముఖం మచ్చలు లేకుండా.. మెరిసిపోవాలంటే.. మీరు లవంగం నూనె ఉపయోగించవచ్చు అంటున్నారు నిపుణులు. ఇది మీకు తేమను ఇవ్వడమే కాకుండా.. మెరుగైన చర్మాన్ని అందిస్తుంది.  పైగా దీనివల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా చాలా పొందవచ్చని తెలిపారు. దీనిని తయారు చేసుకోవడం కూడా చాలా సింపుల్.
మీరు పంటి నొప్పి నుంచి ఉపశమనం పొందడం నుంచి.. ఆహారానికి రుచిని జోడించడం వరకు చాలా సార్లు లవంగాలను ఉపయోగించే ఉంటారు. అయితే దానితో తయారు చేసే నూనెలో ఉండే ఔషధ గుణాలు కూడా మీకు మరిన్ని ప్రయోజనాలు అందిస్తాయని మీకు తెలుసా? అవును లవంగం నూనె ముఖ మచ్చలను తొలగిస్తుంది. చేతులు, కాళ్ల నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది. దానివల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలను ఏమిటో.. లవంగం నూనెను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
(1 / 9)

ఇంట్లో లవంగం నూనె తయారు చేయడానికి మీకు కావాల్సిన పదార్థాలు 100 గ్రా లవంగాలు. 1 కప్పు క్యారియర్ ఆయిల్ (ఆలివ్ / ద్రాక్ష గింజల నూనె / కొబ్బరి నూనె), 1 గాజు కూజా.
(2 / 9)

లవంగం నూనెను తయారుచేయడానికి ముందుగా తాజా లవంగాలు తీసుకోవాలి. వాటిని మెత్తగా చూర్ణం చేయాలి. ఆ పొడిని ఒక గాజు కూజాలో (ప్లాస్టిక్ బాటిల్ కాదు) ఉంచండి. దానిలో క్యారియర్ ఆయిల్ వేయండి. ఇప్పుడు కూజాను మూసి.. ఒక వారం పాటు సూర్యకాంతి పడని ప్రదేశంలో ఉంచండి. అనంతరం దీనిని మస్లిన్ క్లాత్ సహాయంతో ఫిల్టర్ చేయాలి. అంతే లవంగం నూనె రెడీ.
(3 / 9)

రాత్రి పడుకునే ముందు.. కాటన్ ప్యాడ్‌పై 1-2 చుక్కల లవంగం నూనెను వేయాలి. దానిని ముఖంపై అప్లై చేసుకోవచ్చు. లేదా ఫేస్ సీరమ్స్, క్రీమ్‌లలో కొన్ని చుక్కల లవంగం నూనెను కలిపి ఉపయోగించవచ్చు.
(4 / 9)

లవంగం నూనె అలెర్జీలు, ఇన్ఫెక్షన్లను తొలగించి.. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయం చేస్తుంది. ఇది చర్మంలో బ్యాక్టీరియా పెరుగుదలను కూడా నివారిస్తుంది.
(5 / 9)

లవంగం నూనె వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చర్మం ముడతలను తగ్గించి.. డల్‌నెస్‌ని నివారిస్తుంది.
(6 / 9)

లవంగం నూనెలో ఉండే యూజినాల్ యాంటీ-స్ట్రెస్ లక్షణాలను కలిగి ఉంది. ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. అంతే కాకుండా లవంగం నూనెతో శరీరానికి మసాజ్ చేయడం వల్ల ప్రశాంతంగా ఉంటుంది. మానసిక అలసట నుంచి ఉపశమనం దొరుకుతుంది.
(7 / 9)

లవంగం నూనె జీర్ణ వ్యవస్థను నయం చేయడానికి సహాయం చేస్తుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం నుంచి ఉపశమనం ఇస్తుంది.
(8 / 9)

    ఆర్టికల్ షేర్ చేయండి