TS Govt Adolescent Health Kits: విద్యార్థినుల‌కు ఉచితంగా 33 లక్షల హెల్త్ కిట్లు-adolescent health kits to girl students in telangana govemment schools and colleges ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Adolescent Health Kits To Girl Students In Telangana Govemment Schools And Colleges

TS Govt Adolescent Health Kits: విద్యార్థినుల‌కు ఉచితంగా 33 లక్షల హెల్త్ కిట్లు

HT Telugu Desk HT Telugu
Nov 17, 2022 12:37 PM IST

Health Kits to Students: ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థినులకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. ఉచితంగా అడలోసెంట్‌ హెల్త్‌ కిట్స్‌ (శానిటరీ హెల్త్‌ అండ్‌ హైజీనిక్‌ కిట్లు) పంపిణీకి చర్యలు చేపట్టింది. మొత్తం 33 ల‌క్ష‌ల కిట్లు పంపిణీ చేసేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసింది.

ప్రభుత్వ విద్యార్థినుల‌కు అడలోసెంట్‌ హెల్త్ కిట్లు
ప్రభుత్వ విద్యార్థినుల‌కు అడలోసెంట్‌ హెల్త్ కిట్లు

Adolescent Health Kits to girl students: రాష్ట్రంలో వైద్యారోగ్య రంగాన్ని బలోపేతం చేసే దిశగా కసరత్తు చేస్తున్న తెలంగాణ సర్కార్... మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థినుల ఆరోగ్య సంర‌క్ష‌ణ కోసం ముఖ్య‌మైన చ‌ర్య‌లు చేపట్టింది. ఈ సంవ‌త్స‌రం బ‌డ్జెట్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ పేర్కొన్న విధంగా ప్ర‌భుత్వ పాఠ‌శాలు, క‌ళాశాలల్లో ఉచితంగా అడ‌లోసెంట్ హెల్త్‌ కిట్ల (శానిట‌రీ హైల్త్ అండ్ హైజెనిక్ కిట్లు) పంపిణీకి ఏర్పాట్లు మొదలుపెట్టింది. ఇందుకుగాను మొత్తం రూ. 69.52 కోట్ల‌తో అడ‌లోసెంట్ హెల్త్‌ కిట్ల కొనుగోలు, పంపిణీ కోసం ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు హెల్త్ సెక్రెటరీ రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు.

కిట్ లో ఉండేవి ఇవే...

రాష్ట్రంలోని అన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో, జూనియ‌ర్ క‌ళాశాలల్లోని 8 నుంచి 12వ త‌ర‌గ‌తి చ‌దువుతున్న దాదాపు 11 ల‌క్ష‌ల మంది విద్యార్థినుల‌కు ల‌బ్ధి చేకూర‌నున్న‌ది. ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో మిగిలిన ఆరు నెల‌ల కోసం 11 ల‌క్ష‌ల కిట్లు కొనుగోలు చేయ‌నున్న‌ది ప్రభుత్వం. ఈ కిట్‌లో ఆరు శానిట‌రీ న్యాప్‌కిన్ ప్యాక్స్‌, వాట‌ర్ బాటిల్‌, ఒక బ్యాగ్ ఉంటుంది. 2023-24 ఆర్థిక సంవ‌త్స‌రానికిగాను మొత్తం 22 ల‌క్ష‌ల కిట్లు కొనుగోలు చేయ‌నున్న‌ది.

జాతీయ కుటుంబ ఆరోగ్య స‌ర్వే-5 ప్ర‌కారం... 15-24 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సున్న యువ‌తుల్లో సుమారు 32శాతం మంది న్యాప్‌కిన్ లాగా క్లాత్ వినియోగిస్తున్నారు. దీంతో గ‌ర్భాశ‌య, మూత్ర‌కోశ సంబంధ ఇన్‌ఫెక్ష‌న్లు వ‌స్తున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొన్న తెలంగాణ ప్ర‌భుత్వం హెల్త్ అండ్ హైజెనిక్ కిట్లు పంపిణీ చేయాల‌ని నిర్ణ‌యించింది. 14 నుంచి 19 సంవ‌త్స‌రాల వ‌య‌స్సున్న కౌమ‌ర బాలిక‌లు రుతుక్ర‌మం స‌మ‌యంలో శుభ్ర‌త పాటించేందుకు ఇవి ఉప‌యోగ‌ప‌డ‌నున్నాయి. దీంతో వారు ఆరోగ్య‌వంతంగా ఉండేందుకు... త‌ద్వారా చ‌దువుపై మ‌రింత శ్ర‌ద్ధ చూపించేందుకు అవ‌కాశం ఉంటుందని భావిస్తోంది. విద్యార్థినుల హాజ‌రు శాతం కూడా పెరిగేందుకు తోడ్ప‌డుతుందని సర్కార్ అంచనా వేస్తోంది.

IPL_Entry_Point