తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Gardening Tips | ఇంటి టెర్రస్‌పై మొక్కలు పెంచడం మంచిదేనా? నిపుణుల జాగ్రత్తలు..!

Gardening Tips | ఇంటి టెర్రస్‌పై మొక్కలు పెంచడం మంచిదేనా? నిపుణుల జాగ్రత్తలు..!

14 September 2022, 22:44 IST

కొంతమంది తమ ఇంటి టెర్రస్‌పై విపరీతంగా మొక్కలను పెంచుతారు, అయితే చాలామంది టెర్రస్‌పై మొక్కలు నాటడానికి అస్సలు ఇష్టపడరు. ఎందుకంటే నీరు, తేమ నిల్వ ఉండటం ద్వారా పైకప్పు దెబ్బతింటుందేమోనని వారి భయం. అందుకే అందిస్తున్నాం ఈ గార్డెనింగ్ టిప్స్.

  • కొంతమంది తమ ఇంటి టెర్రస్‌పై విపరీతంగా మొక్కలను పెంచుతారు, అయితే చాలామంది టెర్రస్‌పై మొక్కలు నాటడానికి అస్సలు ఇష్టపడరు. ఎందుకంటే నీరు, తేమ నిల్వ ఉండటం ద్వారా పైకప్పు దెబ్బతింటుందేమోనని వారి భయం. అందుకే అందిస్తున్నాం ఈ గార్డెనింగ్ టిప్స్.
టెర్రస్‌పై మొక్కలు నాటితే ఇంటి పైకప్పులో తేమ ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పైకప్పు నీటితో నిండిపోతుంది. ఇది పైకప్పును దెబ్బతీయవచ్చు. అయితే ఇలా జరగకుండా ఈ చిట్కాలు పరిష్కారం లభిస్తుంది.
(1 / 6)

ఎట్టి పరిస్థితుల్లోనూ పైకప్పుపై నీరు నిలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మొక్కల ఆకులు, పువ్వులు రాలి ఉంటే, వాటిని క్రమం తప్పకుండా శుభ్రం చేయాలి. అలాగే, టబ్‌ల మధ్య కొంచెం ఖాళీ స్థలం ఉంచండి. అది నిలిచిన నీటిని తేలికగా గాలికి ఆరిపోయేలా చేస్తుంది.
(2 / 6)

మొక్కలను పెంచే కుండీలను నేరుగా ఇంటి పైకప్పు పైన ఉంచకుండా ఒక షెల్ఫ్ తయారు చేసి వాటిపై పెంచడం మేలు. ఆన్‌లైన్‌లో కూడా ప్లాంట్ స్టాండ్లు లభిస్తాయి.
(3 / 6)

మట్టి తొట్టెలు చాలా బరువుగా ఉంటాయి. వీటికి బదులుగా మీరు ప్లాస్టిక్ టబ్‌లలో కూడా నాటవచ్చు. అయితే ప్లాస్టిక్ టబ్ లో మొక్క నాటితే ఆ మొక్కకు నీరు పోయడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
(4 / 6)

సీలింగ్ చుట్టూ రైలింగ్‌ను వేలాడదీయడం ద్వారా కూడా హ్యాంగింగ్ టబ్‌ను ఏర్పాటుచేయవచ్చు. ఇది నేరుగా పైకప్పుపై ఒత్తిడిని కలిగించదు. వేలాడే తొట్టెలలో తేలికైన మట్టిరకాలు కోకోపీట్, కోకోహస్క్, సిండర్, ఇసుకను ఉపయోగించవచ్చు. చెట్లు కూడా బాగానే పెరుగుతాయి.
(5 / 6)

    ఆర్టికల్ షేర్ చేయండి