తెలుగు న్యూస్  /  ఛాయాచిత్రాల ప్రదర్శన  /  Eye Care | కంటి చూపు మందగిస్తుందా? అయితే ఇలా కాపాడుకోండి..

Eye Care | కంటి చూపు మందగిస్తుందా? అయితే ఇలా కాపాడుకోండి..

20 May 2022, 7:20 IST

పని కోసం లేదా తమ సమయాన్ని గడపడానికి.. చాలామంది రోజంతా తమ ఫోన్‌లు లేదా కంప్యూటర్‌లతో జీవితాన్ని గడుపుతున్నారు. దీని వల్ల కళ్లు దెబ్బతింటాయి. ఫలితంగా పెద్ద వయస్సులో దృష్టి తగ్గుతుంది. మరి ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి?

  • పని కోసం లేదా తమ సమయాన్ని గడపడానికి.. చాలామంది రోజంతా తమ ఫోన్‌లు లేదా కంప్యూటర్‌లతో జీవితాన్ని గడుపుతున్నారు. దీని వల్ల కళ్లు దెబ్బతింటాయి. ఫలితంగా పెద్ద వయస్సులో దృష్టి తగ్గుతుంది. మరి ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే ఏం చేయాలి?
గత 10 ఏళ్లలో జీవితం చాలా మారిపోయింది. మన జీవితం ఇప్పుడు సాంకేతికతపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటుంది. కంప్యూటర్ వాడకం విపరీతంగా పెరిగింది. స్మార్ట్‌ఫోన్‌ల వినియోగం దాని కంటే చాలా రెట్లు పెరిగిపోయింది.
(1 / 10)

రోజంతా ఫోన్ లేదా కంప్యూటర్​ని చూడటం వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఇవి కళ్లపై ఎక్కువ చెడు ప్రభావాన్ని చూపిస్తాయి. కళ్లు పొడిబారడం వంటి సమస్యలు వస్తాయి. అయితే అంతకు మించి మరో భయం కూడా ఉంది. అదేంటంటే..
(2 / 10)

ఇలాగే కొనసాగితే వృద్ధాప్యంలో కంటి చూపు పూర్తిగా పోతుందని చాలా మంది వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ పరిస్థితిని అదుపు చేయడం సాధ్యపడుతుందని పలు సూచనలు చేస్తున్నారు. వాటిలో మొదటిది ఫోన్ వాడకం తగ్గించుకోవడం. దానికి తోడు రెగ్యులర్​గా కొన్ని ఆహారాలు తినడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అవి ఏమిటో చూద్దాం.
(3 / 10)

మీ ఆహారంలో ఆకుపచ్చ కూరగాయలను చేర్చండి. ఆకు కూరల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కళ్లకు చాలా ముఖ్యమైనది.
(4 / 10)

క్యారెట్ జ్యూస్ తాగడం ఆరోగ్యానికే కాదు.. కళ్లకు కూడా చాలా మేలు జరుగుతుంది. ప్రతిరోజూ ఒక గ్లాసు క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కళ్లద్దాలపై ఆధారపడటం క్రమంగా తగ్గుతుంది.
(5 / 10)

బాదం పాలను వారానికి కనీసం మూడు సార్లు తాగండి. ఇది విటమిన్-ఇని కలిగి ఉంటుంది. ఇది కంటి వ్యాధితో పోరాడటానికి సహాయపడుతుంది.
(6 / 10)

చేపలలో అధిక నాణ్యత కలిగిన ప్రోటీన్ ఉంటుంది. ఇది కళ్లకు చాలా మంచిది. చేపలు తినడం వల్ల కళ్లతో పాటు వెంట్రుకలకు కూడా మేలు జరుగుతుంది.
(7 / 10)

గుడ్లలో అమైనో ఆమ్లాలు, ప్రోటీన్, సల్ఫర్, లెక్టిన్, లుటిన్, సిస్టీన్, విటమిన్ బి ఉంటాయి. విటమిన్ బి కంటి కణాలకు ముఖ్యమైనది.
(8 / 10)

మీరు శాఖాహారం మాత్రమే తినే వారైతే.. మీరు సోయాబీన్స్ తినవచ్చు. ఇది కళ్లకు చాలా మేలు చేస్తుంది.
(9 / 10)

    ఆర్టికల్ షేర్ చేయండి