తెలుగు న్యూస్ / ఫోటో /
Summer Eye Care | సమ్మర్లో కంటి సమస్యలా? ఇలా జాగ్రత్తలు తీసుకోండి..
- పనుల నిమిత్తం బయటకు వెళ్లే వారికి వేసవి కాలం పెద్ద పీడకల లాంటిది. ఈ సమయంలో కళ్లను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని కళ్లను కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
- పనుల నిమిత్తం బయటకు వెళ్లే వారికి వేసవి కాలం పెద్ద పీడకల లాంటిది. ఈ సమయంలో కళ్లను జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని కళ్లను కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
(1 / 9)
వర్షమైనా, చలైనా, ఎండైనా శరీరం వివిధ సమస్యలను ఎదుర్కొంటుంది. శరీరంలోని అత్యంత సున్నితమైన భాగమైన కళ్లు కూడా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తాది. ముఖ్యంగా వేసవిలో కంటి సంరక్షణ తీసుకోవడం చాలా ముఖ్యం.
(2 / 9)
చాలా మంది వేడి వాతావరణంలో తమ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. కానీ కంటి సంరక్షణను సరిగా తీసుకోరు. ఇది ఏమాత్రం మంచిది కాదు.
(3 / 9)
బయటకు వెళ్లినప్పుడల్లా సన్ గ్లాసెస్ ఉపయోగించండి. ఇది సూర్యరశ్మి, అధిక వేడి నుంచి కళ్లను కాపాడుతుంది. అధిక వేడి, సూర్యకిరణాలు - రెండూ కళ్లుకు ప్రాణాంతకం కాబట్టి.. ఎండలో సన్ గ్లాసెస్ లేకుండా బయటకు వెళ్లవద్దు.
(4 / 9)
శరీరంలో నీటి కొరత ఏర్పడినప్పుడు.. మొదటి ప్రభావం కళ్లపై పడుతుంది. వేడికి చెమటలు పట్టడం వల్ల శరీరం ఎండిపోతుంది. కాబట్టి ఈ సమయంలో ఎక్కువ నీరు తాగాల్సిందే. దీనివల్ల కంటి నష్టం తక్కువగా ఉంటుంది.
(5 / 9)
వేసవిలో ఐ డ్రాప్స్ ఉపయోగించవచ్చు. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. పైగా కంటి తేమను కాపాడుకోవడానికి సహాయపడతాయి. అయితే ఐ డ్రాప్స్ ఏవి వాడాలో.. నేత్ర వైద్యులు మాత్రమే చెప్పగలరు. కాబట్టి వీటిని ఉపయోగించే ముందు వైద్యుడిని సంప్రదించండి.
(6 / 9)
అత్యవసరమైతే తప్ప.. మధ్యాహ్నం బయటకు వెళ్లకండి. మధ్యాహ్న సూర్యుడు వేడి కళ్ళకు చాలా హాని కలిగిస్తాయి. కాబట్టి ఈ సమయంలో బయటకు వెళ్లవద్దు.
(7 / 9)
ఎండలో బయటకు వెళ్లేటప్పుడు సన్ గ్లాసెస్ మాత్రమే కాకుండా.. టోపీ లాంటివి కూడా వాడండి. ఇది మీ తల, కళ్లను కాపాడుతుంది.
(8 / 9)
చాలా మంది వ్యక్తులు వేడి చర్మ సంరక్షణలో సన్‌స్క్రీన్‌ని ఉపయోగిస్తారు. కానీ దీనిని కళ్లకు ఉపయోగించవద్దు అంటున్నారు నిపుణులు. ఈ క్రీమ్ కళ్లకు అప్లై చేయడం వల్ల సమస్యలు వస్తాయి కాబట్టి.. ఈ క్రీమ్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.
ఇతర గ్యాలరీలు