Summer Care | వేసవిలో శరీరం నుంచి వచ్చే దుర్వాసనను ఇలా అరికట్టండి..
సమ్మర్లో చెమట రావడం ఎంత సహజమో.. శరీరం నుంచి దుర్వాసన రావడం కూడా అంతే సహజం. శరీరం నుంచే కాదండోయ్.. తల నుంచి కూడా దుర్వాసన వస్తుంది. కాబట్టి ఈ సమ్మర్లో శరీర దుర్వాసను ఎలా దూరం చేసుకోవాలో ఇప్పుడు చుద్దాం.
Smell Good in Summer | శరీర దుర్వాసన సహజమైనప్పటికీ.. సమ్మర్లో అది మరీ ఇబ్బంది పెడుతుంది. ఎండ వల్ల వచ్చిన చెమట మీ శరీరంపై ఉన్న బ్యాక్టీరియాతో కలిసి శరీర దుర్వాసనను పెంచుతుంది. కాబట్టి శరీర దుర్వాసన పోగొట్టాలంటే పరిశుభ్రత పాటించడమే మార్గం. బయటకు వెళ్లినప్పుడు శరీరాన్ని ఎలా తాజాగా ఉంచుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సువాసనలు శరీరంపైనే ఉండాలి..
సమ్మర్లో సిట్రస్, పువ్వులు, పండ్ల రుచులు వంటి చల్లని సువాసనలతో ఉండే పెర్ఫ్యూమ్, డియోడరెంట్‌లను ఎంచుకోండి. ఈ సువాసనలు తాజాగా ఉంటాయి. కాబట్టి మీరు రోజంతా ఫ్రెష్‌గా ఫీలవుతారు. సువాసన ఎక్కువసేపు ఉండేందుకు.. పెర్ఫ్యూమ్లను చర్మానికి అప్లై చేయాలి. ఇలా చేస్తే.. సువాసన రోజంతా ఉంటుంది.
సువాసనలను లేయర్ చేయడమనేది సమ్మర్లో మరో మంచి విషయం. ముందు సువాసనతో కూడిన బాడీ వాష్‌తో రోజును ప్రారంభించండి. తర్వాత బాడీ లోషన్‌ను రాసి.. సువాసనలిచ్చే బాడీ మిస్ట్ రాయండి.
తల నుంచి దుర్వాసన రాకుండా..
చెమట అనేది మీ జుట్టును కూడా ప్రభావితం చేస్తుంది. పైగా దుర్వాసనను కూడా విడుదల చేస్తుంది. సమ్మర్లో రెండు రోజులకు ఓ సారి తలస్నానం చేయడం మంచిది. ఎక్కువకాలం తలస్నానం చేయకుండా ఉంటే.. తలలో నుంచి దుర్వాసన వచ్చే అవకాశముంది. తలస్నానం తర్వాత హెయిర్ కండీషనర్, హెయిర్ సీరమ్ వాడితే.. వాటి సువాసన మీతోనే ఉంటుంది.
సాక్స్ కచ్చితంగా వేసుకోండి..
సమ్మర్లో సాక్స్ లేకుండా బూట్లు వేసే అలవాటు ఉంటే మానేయండి. సాక్స్ లేకుండా.. బూట్లు వేసుకుంటే.. పాదాల నుంచి వాసన వస్తుంది. కాబట్టి సాక్స్ వేసుకునే షూ వేసుకోండి. అంతేకాకుండా మీ బూట్లలో బేకింగ్ సోడా లేదా బేబీ పౌడర్‌ను చల్లడం ద్వారా దుర్గంధం రాకుండా ఉంటుంది. పైగా ఇది తాజా వాసన ఇస్తుంది. అదనపు తేమను విడుదల చేయకుండా ఉంచి.. మీ పాదాలనుంచి దుర్వాసన రాకుండా కాపాడుతుంది.
ఇవి కచ్చితంగా తీసుకువెళ్లండి..
సమ్మర్లో బయటకు వెళ్లినప్పుడు డ్రై డియోడరెంట్, బేబీ వైప్‌లను తీసుకెళ్లండి. కొందరికి చెమటలు ఎక్కువగా వస్తాయి. కాబట్టి డియోడరెంట్, బేబీ వైప్‌లను మీతో తీసుకెళ్లడం మరచిపోవద్దు. చెమట, దుర్వాసన వస్తుంది అనిపించినప్పుడు.. బేబీ వైప్‌లతో చెమటను శుభ్రం చేసుకుని.. చక్కని అనుభూతి కోసం డ్రై డియోడరెంట్ స్ప్రే చేయండి.
సంబంధిత కథనం