తెలుగు న్యూస్  /  ఫోటో  /  Winter Health Care Tips : చలికాలంలో ఈ కూరగాయలు తీసుకుంటే.. ఆరోగ్యం మీ సొంతం

Winter Health Care Tips : చలికాలంలో ఈ కూరగాయలు తీసుకుంటే.. ఆరోగ్యం మీ సొంతం

15 November 2022, 14:17 IST

Winter Health Care Tips:  శీతాకాలంలో రోగనిరోధక శక్తి పెంచుకోవడం చాలా ముఖ్యం. అయితే ఈ కాలంలో కొన్ని కూరగాయలు తీసుకోవడం వల్ల.. రోగనిరోధక శక్తిని పెంచుకోవడంతో పాటు.. వివిధ ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు. వాటిని క్రమం తప్పకుండా తీసుకుంటే.. చలికాలంలో ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉండొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణలు.

  • Winter Health Care Tips:  శీతాకాలంలో రోగనిరోధక శక్తి పెంచుకోవడం చాలా ముఖ్యం. అయితే ఈ కాలంలో కొన్ని కూరగాయలు తీసుకోవడం వల్ల.. రోగనిరోధక శక్తిని పెంచుకోవడంతో పాటు.. వివిధ ఆరోగ్యప్రయోజనాలను పొందవచ్చు. వాటిని క్రమం తప్పకుండా తీసుకుంటే.. చలికాలంలో ఎలాంటి రోగాల బారిన పడకుండా ఉండొచ్చు అంటున్నారు ఆరోగ్య నిపుణలు.
అన్ని కాలాలలో కూరగాయలు తినాలి. ఎందుకంటే అవి మన శరీరానికి అనేక పోషకాలను అందిస్తాయి. చలికాలంలో వివిధ వ్యాధులకు దూరంగా ఉండాలంటే.. కూరగాయలను తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి.
(1 / 7)

ఈ చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే.. ఎలాంటి కూరగాయలను రెగ్యులర్​గా తీసుకోవాలో.. పిల్లలకు ఏ కూరగాయలు తినిపించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
(2 / 7)

క్యారెట్‌లో విటమిన్ ఎ, పొటాషియం, ఫైబర్, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని ఫ్రై చేసుకోవచ్చు. లేదంటే సాంబార్ వంటి వాటిలో కూడా వేసుకోవచ్చు. నేరుగా కూడా దీనిని తినవచ్చు. తినడానికి ఇష్టపడని వారు క్యారెట్ హల్వా చేసుకుని.. దాని ప్రయోజనాలు పొందవచ్చు..
(3 / 7)

బీట్ రూట్ శరీరానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది అనేక పోషకాలతో నిండి ఉంది. బరువు తగ్గడానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో సోడియం, పొటాషియం, ఫైబర్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి.
(4 / 7)

బచ్చలికూరను చలికాలంలో తీసుకోవడం మీ ఆరోగ్యానికి చాలా మంచిది. పాలకూరను కూడా మీ డైట్లో భాగం చేసుకోవచ్చు. వీటిలో విటమిన్లు బి, సి, ఇ ఉంటాయి. అంతేకాకుండా పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు కూడా ఉన్నాయి.
(5 / 7)

రక్తహీనత సమస్యలు ఉన్నవారు ఈ కూరగాయలను తప్పనిసరిగా తీసుకోవాలి. విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, ఐరన్, కాల్షియం, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.
(6 / 7)

    ఆర్టికల్ షేర్ చేయండి