UP rape case : మహిళపై 8 మంది సామూహిక అత్యాచారం! వీడియో తీసి..
05 August 2023, 6:42 IST
UP rape case : ఓ మహిళపై 8మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
మహిళపై 8 మంది సామూహిక అత్యాచారం!
UP rape case : ఉత్తర్ ప్రదేశ్‌లో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళపై 8మంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు!
ఇదీ జరిగింది..
సంబంధిత ఘటన ఉత్తర్ ప్రదేశ్ బండా జిల్లాలో చోటుచేసుకుంది. గ్యాంగ్ రేప్‌నకు సంబంధించిన దృశ్యాలు 10 రోజులగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీడియోపై స్పందించిన పోలీసులు.. దానిని ఫోరెన్సిక్‌కు పంపించారు. మరోవైపు గ్యాంగ్ రేప్‌నకు సంబంధించి జులై 28న కల్లు అనే వ్యక్తిపై కేసు నమోదైంది. గురువారం నాటికి మరో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి పేర్లు రామ్‌ధాని, రామ్సనెహి, దేవ్‌కుమార్, ఇంద్రజిత్, భగ్వదీన్, లవ్‌కుశ్, దేవ్‌శరణ్. వీరందరు వీడియోలో ఉన్నట్టు ఫోరెన్సిక్ రిపోర్టు స్పష్టం చేసింది. ఫలితంగా వీరిపై రేప్ కేసు నమోదు చేశారు పోలీసులు.
కాగా.. బాధితురాలు వచ్చి కేసు పెట్టలేదని తెలుస్తోంది. ఆమె ఎవరో కూడా ఇంకా తెలియదు. బాధితురాలి ఆచూకీని కనుగొనేందుకు, ఆమెకు సాయం చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ఇదీ చూడండి:- Man kills wife : ప్రియుడితో కలిసి ఉన్న భార్యను చూసిన భర్త.. గొడ్డలితో..!
14ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం..
Girl gang raped in Uttar Pradesh : దేశంలో మహిళలు, బాలికలపై నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. స్కూల్‌కు వెళుతున్న ఓ బాలికను అపహరించి, కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన డియోరియా ప్రాంతంలో చోటుచేసుకుంది.
బాధితురాలి తల్లి ప్రకారం.. గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. 10వ తరగతి చదువుకుంటున్న బాలిక.. తన గ్రామం నుంచి స్కూల్‌కు బయలుదేరింది. గ్రామం బయట కొందరు ఆమెను అడ్డుకున్నారు. పక్కనే ఉన్న చెరకు తోటకు తీసుకెళ్లారు. అక్కడే ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఇంటికి తిరిగొచ్చిన బాలిక, కుటుంబసభ్యులకు వివరాలు ఇచ్చింది.
బాధితురాలి కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. వారికి ఫిర్యాదు చేశారు. కాగా.. రేప్ చేస్తున్న సమయంలో వీడియో తీసి, దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని ఆరోపించారు. ఘటనపై వెంటనే స్పందించిన పోలీసులు.. కేసు నమోదు చేసుకున్నారు. బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే.. వీడియో తీసినట్టు వారికి ఆధారాలు లభించలేదు.
నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు.. ఒకరిని అరెస్ట్ చేశారు. ఇతరులను పట్టుకునేందుకు చర్యలు చేపట్టారు. కాగా.. పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం.. నిందితుల్లో ఒకరితో ఆ బాలిక రిలేషన్లో ఉన్నట్టు తెలుస్తోంది.