Man kills wife : ప్రియుడితో కలిసి ఉన్న భార్యను చూసిన భర్త.. గొడ్డలితో..!
Man kills wife in Madhya Pradesh : ప్రియుడితో కలిసి ఉన్న భార్యను చూసిన ఓ వ్యక్తికి కోపం వచ్చింది. గొడ్డలితో వారిద్దరని చంపేశాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్లో చోటుచేసుకుంది.
Man kills wife in Madhya Pradesh : మధ్యప్రదేశ్లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రియుడితో కలిసి ఉన్న భార్యను చూసిన ఓ వ్యక్తి.. వారిద్దరిని అతి కిరాతకంగా చంపేశాడు!
ఇదీ జరిగింది..
మధ్యప్రదేశ్ గ్వాలియర్ జిల్లాకు సుమారు 50కి.మీల దూరంలో ఉన్న సెమ్రి గ్రామంలో ఈ ఘటన జరిగింది. మురాయి బఘేల్ అనే వ్యక్తి తన కుటుంబంతో కలిసి జీవిస్తున్నాడు. కాగా.. అతని భార్యకు వివాహేతర సంబంధం ఉన్నట్టు తెలుస్తోంది.
కాగా గురువారం నాడు ఆ మహిళ, తన ప్రియుడిని కలిసింది. వారిద్దరు కలిసి ఉండటాన్ని చూశాడు మురాయి బఘేల్. కోపంతో ఊగిపోయాడు. వారిద్దరిని పట్టుకున్నాడు. ఆ తర్వాత గొడ్డలి తీసుకుని వారిని అతికిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు.
Man kills wife and lover : రక్తపు మడుగులో పడి ఉన్న మహిళ, ఆమె ప్రియుడును చూసిన స్థానికులు.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి వెళ్లిన పోలీసులు.. ఆ ఇద్దరు మరణించినట్టు ధ్రువీకరించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు.. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసుకున్నట్టు సబ్ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ పోలీస్.. వివేక్ కుమార్ శర్మ తెలిపారు. దర్యాప్తు జరుగుతోందని, నిందితుడిని త్వరలోనే పట్టుకుంటామని స్పష్టం చేశారు.
ఇదీ చూడండి:- Constable Murder: ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య..విశాఖలో దారుణం
భార్య, పిల్లలను చంపి..
దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆత్మహత్య ఘటనలు కూడా ఎక్కువ అవుతున్నాయి. భార్య, పిల్లలను చంపిన భర్త.. చివరికి ఆత్మహత్య చేసుకున్న ఘటన బెంగళూరులో తాజాగా కలకలం సృష్టించింది.
Bengaluru crime news : బెంగళూరులో నివాసముంటున్న వీరార్జున విజయ్ (31), హైమావతి(29)లకు ఇద్దరు పిల్లలు. వారి పేర్లు మేఘనయన (2), శృతి సునయన (8నెలలు). వీరార్జున ఓ ఇంజినీర్. కాగా.. గురువారం నాడు భార్య, బిడ్డలను చంపిన వీరార్జున.. అనంతరం తాను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.
గురువారం సాయంత్రం.. హైమావతిని కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు ఆ సోదరుడు. ఎన్నిసార్లు తలుపు కొట్టినా ఎవరు స్పందించకపోవడంతో అతనికి అనుమానం వచ్చింది. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. వారు ఘటనాస్థలానికి వెళ్లారు. తలుపులు తెరవగా.. నలుగురి మృతదేహాలు కనిపించాయి.
Man kills wife in Bengaluru : ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా హత్య, ఆత్మహత్య వెనుక కారణాలు ఇంకా తెలియరాలేదు.
సంబంధిత కథనం