Bihar lovers : ప్రియుడిని కలిసేందుకు.. గ్రామం మొత్తానికే కరెంట్‌ను కట్ చేసిన యువతి!
Bihar lovers : బిహార్‌లో జరిగిన ఓ సంఘటన ఇప్పుడు వార్తలకెక్కింది. ఓ యువతి, తన ప్రియుడిని కలిసేందుకు.. ఏకంగా గ్రామం మొత్తానికే విద్యుత్ సరఫరాను కట్ చేసేది. హైలైట్ ఏంటంటే.. ఈ విషయం బయటపడిన కొన్ని రోజులకే, ప్రేమ జంటకు పెళ్లి జరిగిపోయింది!
Bihar lovers : ప్రేమలో ఉంటే ఆ ఫీల్ చాలా బాగుంటుంది! కానీ ఇంట్లో వాళ్లకి, చుట్టుపక్కన వారికి తెలియకుండా కలవడం చాలా కష్టమైన విషయమే. ఇందుకోసం ప్రేమ జంట చాలా ప్లాన్స్ వేస్తుంది. బిహార్‌లోని ఓ యువతికి కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆమె మాత్రం చాలా పెద్ద స్కెచ్ఛే వేసింది. ప్రియుడిని కలిసేందుకు ఆమె చేసిన ఓ పని గురించి తెలుసుకున్న వారందరు ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. ప్రేమికుడిని కలిసేందుకు.. సొంత గ్రామంలో విద్యుత్‌ను కట్ చేసేసేది ఆ యువతి!
ఇదీ జరిగింది..
బిహార్ పశ్చిమ్ చంపారన్‌లోని ఓ గ్రామంలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. యువతి పేరు ప్రీతి, యువకుడి పేరు రాజ్‌కుమార్. ఈ ప్రేమ జంట.. పక్కపక్కన గ్రామాల్లో నివాసముంటుంది. కాగా.. యువతి ఉంటున్న గ్రామంలో తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోయేది. ఆ సమయాల్లో దొంగతనాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి.
Bihar latest news : పవర్ కట్స్‌తో విసుగెత్తిపోయిన గ్రామస్థులు.. విద్యుత్‌శాఖకు అనేకమార్లు ఫిర్యాదు చేశారు. కానీ ఫలితం దక్కలేదు. ఓ రోజు వారికి అనుమానం వచ్చింది. "అసలు మన గ్రామంలోనే ఇన్నిసార్లు కరెంట్ ఎందుకు పోతోంది?" అన్న ప్రశ్న ఉత్పన్నమైంది. అప్పుడే ఆ ప్రేమ జంట వ్యవహారం బయటపడింది.
ఓ రోజు రాత్రి.. ఇలాగే కరెంట్ పోయింది. గ్రామస్థులు గ్రామంలో తిరగడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో యువతి, ఆమె ప్రేమికుడు కలిసి ఉండటాన్ని చూశారు. వారిద్దరిని పట్టుకుని ప్రశ్నించారు. ప్రియుడిని కలిసేందుకు తానే విద్యుత్‌ను కట్ చేస్తున్నట్టు ఆ యువతి చెప్పిన మాటలు విని షాక్ అయ్యారు.
ఇదీ చూడండి:- Relationship Tips। మీరు ప్రేమలో ఉన్నారా? మీది నిజమైన ప్రేమ అయితే ఇలాంటివి సహించకండి!
కొంతసేపటికి.. రాజ్‌కుమార్‌పై గ్రామస్థులు దాడి చేశారు. అతడిని కర్రలతో కొట్టారు. ఆ యువతి మాత్రం అతడిని రక్షించేందుకు ప్రయత్నించింది. చివరికి, వారి నుంచి అతడిని విడిపించుకుని తీసుకెళ్లింది. ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కట్ చేస్తే.. కొన్ని రోజుల తర్వాత ఆ యువకుడు, తన గ్యాంగ్‌తో ఆ గ్రామంపై దాడి చేశాడు. తనని కొట్టిన వారిని తిరిగి కొట్టి రివేంజ్ తీర్చుకున్నాడు. ఈ ఘటనతో వారం రోజుల పాటు రెండు గ్రామాల్లో ఉద్రిక్త వాతావరణ కొనసాగింది.
పెళ్లి చేసేశారు..!
Girl cuts power supply to meet lover : చివరికి.. రెండు గ్రామాల ప్రజలు, పెద్దలు ఒక చోట సమావేశమయ్యారు. ఒకరిని ఒకరు మర్చిపోవాలని ప్రేమ జంటకు చెప్పారు. కానీ వారు అందుకు అంగీకరించలేదు. ఈ నేపథ్యంలో పెద్దలు ఓ నిర్ణయానికి వచ్చారు. ప్రేమ జంటకు పెళ్లి చేయాలని ఫిక్స్ అయ్యారు. కట్ చేస్తే.. స్థానిక గుడిలో రాజ్‌కుమార్- ప్రీతి పెళ్లి జరిగింది.
సంబంధిత కథనం