తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Viral Video : జిమ్​లో వర్కౌట్స్​ ఇరగదీస్తున్న 80ఏళ్ల వృద్ధురాలు.. వీడియో వైరల్​!

viral video : జిమ్​లో వర్కౌట్స్​ ఇరగదీస్తున్న 80ఏళ్ల వృద్ధురాలు.. వీడియో వైరల్​!

Sharath Chitturi HT Telugu

08 January 2024, 16:30 IST

google News
  • Old woman gym viral video : ఓ 80ఏళ్ల వృద్ధురాలికి చెందిన ఓ వీడియో ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. జిమ్​లో ఆమె వర్కౌట్స్​ చేస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో ఉన్నాయి.

జిమ్​లో వర్కౌట్స్​ ఇరగదీస్తున్న 80ఏళ్ల వృద్ధురాలు.. వీడియో వైరల్​!
జిమ్​లో వర్కౌట్స్​ ఇరగదీస్తున్న 80ఏళ్ల వృద్ధురాలు.. వీడియో వైరల్​! (Instagram/@ Laura Somers)

జిమ్​లో వర్కౌట్స్​ ఇరగదీస్తున్న 80ఏళ్ల వృద్ధురాలు.. వీడియో వైరల్​!

Old woman gym viral video : మనలో చాలా మందికి బరువు తగ్గాలని ఉంటుంది. కానీ అందుకు ప్రయత్నమే చేయము. చాలా మందికి హెల్తీ లైఫ్​స్టైల్​ అలవాటు చేసుకోవాలని ఉంటుంది. కొంచెం సేపు నడిస్తేనే అలసిపోతూ ఉంటారు. ‘ఇప్పుడే ఇలా ఉంటే.. 60ఏళ్లు దాటితే పరిస్థితి ఎలా ఉంటుందో?’ అని కొందరు భయపడిపోతూ ఉంటారు. కానీ ఓ 80ఏళ్ల వృద్ధురాలు.. తన బలాన్ని ప్రదర్శిస్తూ ఇప్పుడు వార్తల్లో నిలిచింది. 80ఏళ్ల వయస్సులోనూ.. జిమ్​లో వర్కౌట్స్​ ఇరగదీస్తూ.. అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ‘ఏజ్​ ఈజ్​ జస్ట్​ ఎ నెంబర్​’ అని నిరూపిస్తోంది ఆ వృద్ధారాలు. ఆమె జిమ్​ వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారాయి.

80ఏళ్ల వయస్సులో జిమ్​..

సోషల్​ మీడియాలో వైరల్​ అయిన ఓ వీడియోలో.. ఓ వృద్ధురాలు కనిపిస్తోంది. వివిధ వర్కౌట్స్​ చేస్తూ కనిపించింది. ఆమె పేరు ఎలైన్​​. అదే జిమ్​కు వెళ్లే ఓ మహిళ, ఎలైన్​​​ వర్కౌట్స్​ని వీడియో తీసి సోషల్​ మీడియాలో పోస్ట్​ చేసింది. ‘తన ఫిట్​నెస్​ చూసి షాక్​ అయ్యాను,’ అంటూ క్యాప్షన్​ రాసుకొచ్చింది.

80 year old woman gym viral video : "ఆ వయస్సులో కూడా ఆ రేంజ్​లో ఎలా జిమ్​ చేస్తున్నారు. మీ సీక్రెట్​ ఏంటి?" అని ఎలైన్​ ఎలైన్​ని అడగ్గా.. ‘రోజు జిమ్​కి రా’ అని సలహా ఇచ్చింది.

"'జిమ్​లో కాస్త టైమ్​ గడపండి ఉండండి. రెగ్యులర్​గా జిమ్​ చేయండి. బలంగా ఉంటారు," అని ఎలైన్​ వీడియోను షేర్​ చేసిన మహిళ రాసుకొచ్చింది.

సోషల్​ మీడియాలో వైరల్​గా మారిన 80ఏళ్ల వృద్ధురాలి జిమ్​ వీడియోను ఇక్కడ చూడండి.

ఈ పోస్ట్​ షేర్​ చేసిన కొన్ని గంటల్లోనే వైరల్​ అయిపోయింది. కొన్ని గంటల్లోనే 5 మిలియన్​ వ్యూస్​ వచ్చాయి. చాలా మంది లైక్స్​ వర్షం కురిపించారు. 80ఏళ్లు వృద్ధురాలి సీక్రెట్​ తెలుసుకునేందుకు విపరీతంగా కామెంట్స్​ చేశారు. అమె కృషిని అనేక మంది అభినందించారు.

Old woman gym workouts : 'నేను అలా ఉండాలనుకుంటున్నాను. ఇది అద్భుతం," అని ఓ నెటిజన్​ రాసుకొచ్చారు. "అవును! ముందుకు సాగండి. ఆగకండి," అని మరో వ్యక్తి పేర్కొన్నారు. 'ఆమె చాలా అద్భుతంగా ఉంది' అని మూడో నెటిజన్ రాశారు. 'మీరు యువతరానికి స్ఫూర్తిగా నిలిచారు. నిరంతర కృషికి అభినందనలు,' అని మరో వ్యక్తి కామెంట్​ చేశారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏమిటి? మీరేం అంటారు?

తదుపరి వ్యాసం