Weight Loss Without Gym : జిమ్‌కు వెళ్లకుండా ఇలా బరువు తగ్గించుకోవచ్చు-weight loss without going to gym all you need to know ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Weight Loss Without Gym : జిమ్‌కు వెళ్లకుండా ఇలా బరువు తగ్గించుకోవచ్చు

Weight Loss Without Gym : జిమ్‌కు వెళ్లకుండా ఇలా బరువు తగ్గించుకోవచ్చు

Anand Sai HT Telugu

Weight Loss Without Gym : 100లో 90 మంది బరువు తగ్గాలంటే జిమ్ వెళ్లాల్సిందేనని చెప్పేస్తారు. కానీ ఇంట్లోనే ఉంటూ బరువు తగ్గించుకోవచ్చు. చాలా ఈజీ పద్ధతి. మీ రొటీన్‌లో క్యాలరీ బర్నింగ్ కార్యకలాపాలను చేర్చితే చాలు.

బరువు తగ్గేందుకు చిట్కాలు

జిమ్‌కి వెళ్లకుండా బరువు తగ్గగలరా? ఈ ప్రశ్న చాలా మందికి ఉంటుంది. గూగుల్ తల్లికి కూడా ఈ ప్రశ్న చాలా మంది వేసి ఉంటారు. నిపుణులను కూడా దీని గురించి అడుగుతారు. ఈ ప్రశ్నకు సమాదానం ఈరోజు మనం తెలుసుకుందాం. మీరు బరువు తగ్గాలంటే కచ్చితంగా జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. చేయాల్సిందల్లా ఒకటే.. మీ రొటీన్‌లో క్యాలరీ బర్నింగ్ కార్యకలాపాలను చేర్చుకోవాలి. ఇలా చేస్తే.. సులభంగా బరువు తగ్గవచ్చు.

కేలరీలను బర్న్ చేయడానికి మీరు ఎక్కడికీ వెళ్లవలసిన అవసరం లేదు. ఇంట్లోనే చేయగలిగిన క్యాలరీ బర్నింగ్ పనులు పుష్కలంగా ఉంటాయి. అవి కచ్చితంగా బరువు తగ్గడంలో మీకు ఉపయోగపడతాయి. జిమ్‌కి వెళ్లకుండానే బరువు తగ్గాలంటే ఏం చేయాలో చూద్దాం..

ఫిట్‌నెస్ కోసం కొత్త వ్యూహాన్ని అనుసరించాలనుకుంటే, జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. రోజువారీ ఇంటి పనులతో దీన్ని ప్రారంభించవచ్చు. చాలా మంది చిన్న చిన్న ఇంటి పనులను చేయడానికి కూడా సహాయకులను పెట్టుకుంటారు. కానీ ఇది సరైన పద్ధతి కాదు. మీరే వాటిని చేయాలి, శారీరకంగా దృఢంగా ఉండటానికి సహాయపడుతుంది.

ఇంటిని రెగ్యులర్ క్లీనింగ్ చేయడం వల్ల శరీరంలోని ప్రధాన కండరాలు శరీరాన్ని సాగదీయడంలో సహాయపడతాయి. ఇది మంచి కార్డియో వ్యాయామం. దీనితో పాటు, ఇది కేలరీలను బర్న్ చేయడానికి కూడా సహాయపడుతుంది. బరువు తగ్గేందుకు ఉపయోగపడుతుంది.

వాషింగ్ మెషీన్, లాండ్రీలో బట్టలు పెట్టే బదులుగా.. చేతితో బట్టలు ఉతకడం వల్ల రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఇది మిమ్మల్ని శారీరకంగా దృఢంగా ఉంచుతుంది. మీ బట్టలు ఎక్కువ కాలం ఉంటాయి. బట్టలు ఉతకడం తెలియకపోతే చిన్న బట్టలతో ప్రారంభించండి. ఇది మీ మణికట్టు, చేతులకు సరైన వ్యాయామంగా పని చేస్తుంది. కేలరీలను బర్న్ చేయడంలో కూడా సహాయపడుతుంది.

గార్డెనింగ్ మీరు శారీరకంగా దృఢంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. మొక్కలకు నీరు పెట్టడం, గార్డెన్ క్లీన్ చేయడం, మట్టిని తవ్వడం వంటివి మీ భుజం, చేయి, కండరాలకు వ్యాయామన్ని అందిస్తాయి. మీరు శారీరకంగా దృఢంగా ఉండటానికి సహాయపడతాయి. అంతే కాకుండా ప్రకృతితో గడపడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

వారానికి ఒకసారి ఇంట్లో కారును శుభ్రం చేస్తే సరిపోతుంది. కారును కడగడం వల్ల మీ భుజం కండరాలు ఉత్తేజితమవుతాయి. ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లలో ఎక్కువ గంటలు గడపడం వలన చేతులకు సమస్యలు వస్తాయి. కారును కడగడం ద్వారా అవయవాలను చురుకుగా ఉంచుకోవచ్చు.

వాక్యూమ్ క్లీనింగ్ మీకు మంచి వ్యాయామం. అవునండి ఇది నిజం. వాక్యూమ్ క్లీనర్‌ను ఉపయోగించడం వల్ల గంటకు 190 కేలరీలు బర్న్ అవుతాయి. ఇది మీ పాదాలు, చేతులలోని కండరాలను కూడా సక్రియం చేస్తుంది. మీరు ఫిట్‌గా ఉండటానికి సహాయపడుతుంది. వాక్యూమ్ క్లీనర్‌ను మీ చేతులతో పట్టుకుని ఇంటిని శుభ్రం చేయండి. పైన చెప్పిన పనులు మీ బరువును సహజంగా తగ్గించడంలో సాయపడతాయి.