తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Imd Rain Alert : ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వాతావరణశాఖ అలర్ట్​!

IMD rain alert : ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. వాతావరణశాఖ అలర్ట్​!

23 January 2023, 8:33 IST

  • IMD rain alert : ఉత్తర భారతంతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో రానున్న రోజుల్లో వర్షాలు పడతాయని ఐఎండీ పేర్కొంది. పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడుతుందని హెచ్చరించింది.

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.
దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.

దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది.

IMD rain alert : వాయువ్య భారతంతో పాటు దేశంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. జమ్ము, కశ్మీర్​, లద్దాఖ్​, గిల్గిట్​, బాల్టిస్థాన్​, ముజాఫర్​బాద్​, తూర్పు ఉత్తర్ ​ప్రదేశ్​, తూర్పు మధ్య ప్రదేశ్​తో పాటు తమిళనాడులో మంగళవారం నుంచి ఈ నెల 26 వరకు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ పేర్కొంది. పలు ప్రాంతాల్లో మంచు కూడా కురుసే అవకాశం ఉందని హెచ్చరించింది.

ట్రెండింగ్ వార్తలు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

Brij Bhushan : బ్రిజ్​ భూషణ్​ కుమారుడికి బీజేపీ టికెట్​- రెజ్లర్ల స్పందన ఇది..

వర్షాలు.. మంచు.. పొగమంచు..!

రానున్న కొన్ని రోజుల్లో.. తూర్పు భారతంలోని పలు ప్రాంతాల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు పెరుగుతాయి. హిమాచల్​ ప్రదేశ్​, బిహార్​లలో రానున్న 24 గంటలు, ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో మరో 48 గంటల్లో రాత్రి, తెల్లవారుజామున దట్టమైన పొగమంచు అలుముకుంటుంది.

Heavy rains in Uttar Pradesh : అయితే.. పంజాబ్​, హరియాణా, చండీగఢ్​, ఢిల్లీ, ఉత్తర్​ ప్రదేశ్​, పశ్చిమ రాజస్థాన్​, బిహార్​, తూర్పు రాజస్థాన్​, వాయువ్య మధ్యప్రదేశ్​లో గత 24 గంటల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు 6-10 డిగ్రీల మధ్యలో ఉన్నట్టు ఐఎండీ స్పష్టం చేసింది.

ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు- మంచు..!

పశ్చిమ హిమాలయ ప్రాంతంలో సోమవారం వరకు మోస్తారు వర్షాలు కురుస్తాయి. మంగళవారం నుంచి ఈ నెల 26వరకు కొన్ని ప్రాంతాల్లో విస్తృతంగా వానలు పడతాయి. 24, 25న జమ్ము, కశ్మీర్​, లద్దాఖ్​, గిల్గిట్​, బాల్టిస్థాన్​, ముజాఫరాబాద్​, హిమాచల్​ ప్రదేశ్​లలో భారీ వర్షపాతం/ హిమపాతం నమోదవుతుంది. 25, 26వ తేదీల్లో ఉత్తరాఖండ్​లో వర్షాలు పడతాయి.

IMD weather update : పంజాబ్​, హరియాణా, చంఢీగఢ్​, ఢిల్లీ, ఉత్తర్​ ప్రదేశ్​లలో సోమవారం మోస్తారు వర్షాలు కురుస్తాయి. కానీ ఈ ప్రాంతాల్లో 24 నుంచి 26 వరకు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయి.

ఉత్తర రాజస్థాన్​, మధ్యప్రదేశ్​లోని కొన్ని ప్రాంతాల్లో.. ఈ నెల 24 నుంచి 26 వరకు ఉరుములతో కూడిన వర్షం, మరికొన్ని చోట్ల మోస్తారు వర్షపాతం నమోదవుతుంది.