IMD Rain Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. ఏపీకి భారీ వర్ష సూచన!
03 December 2022, 16:41 IST
- Rain Alert to Andhrapradesh: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 5వ తేదీన అల్పపీడనం ఏర్పడనుంది. ఫలితంగా తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురవనున్ననాయి.
ఏపీకి వర్ష సూచన
Weather Updates of Andhrapradesh: ఏపీలో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ అండమాన్ సముద్రానికి ఆనుకుని ఆగ్నేయ బంగాళాఖాతంలో ఈ నెల 5వ తేదీన అల్పపీడనం ఏర్పడనుంది. ఇది 7వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. క్రమంగా కదులుతూ ఎనిమిదో తేదీ ఉదయానికి తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఏపీలోని కోస్తాంధ్ర తీరానికి చేరే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ పేర్కొంది.
అల్పపీడనం ఎఫెక్ట్ తమిళనాడు, పుదుచ్చేరిని తాకుతుందని.. ఆ తర్వాత ఏపీకి చేరుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఈ ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల విస్తారంగా, ఉత్తర కోస్తాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురవనున్నాయి.
ఇక ఆంధ్రప్రదేశ్ వెదర్ మ్యాన్ (Andhra Pradesh Weatherman ) రిపోర్టు ప్రకారం.. బంగాళాఖాతంలోని తేమ గాలుల ఫలితంగా తిరుపతి పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉంటుందని పేర్కొంది. డిసెంబర్ 5న అగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని అంచనా వేసింది.
Weather Updates of Telangana:ఇక తెలంగాణకు చూస్తే ఎలాంటి వర్ష సూచన లేదు. వాతారణం పొడిగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎలాంటి హెచ్చరికలను జారీ చేయలేదు. మరోవైపు తెలంగాణలో చలిగాలులు పెరుగుతున్నాయి. చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతుండటంతో జనాలు బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. హైదరాబాద్ నగరంతో పాటు, రాజధాని పరిసర ప్రాంతాలు, జిల్లా్ల్లోనూ చలి తీవ్రత అధికంగా ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్‌లో జిల్లాలో పరిస్థితి తీవ్రంగా ఉంది. పొగ మంచు కమ్ముకోవడం వల్ల రహదారులపై రాకపోకలు సాగించే వారు ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే ఐదురోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది.