Cold day warning : 'కోల్డ్ డే' అలర్ట్.. ఈ ప్రాంతాలను చలి చంపేస్తుంది జాగ్రత్త!
06 January 2024, 6:10 IST
- Cold day warning : చలికి ఉత్తర భారతం గడగడలాడుతోంది. తాజాగా.. మరో ఆందోళనక వార్త ఇచ్చింది ఐఎండీ. 'కోల్డ్ డే' ప్రకటించింది.
అలర్ట్.. ఈ ప్రాంతాలను ‘చలి’ చంపేస్తుంది
Cold day warning : ఉత్తర భారతదేశాన్ని 'కోల్డ్ వేవ్' వణికిస్తున్న సమయంలో.. ప్రజలకు మరింత ఆందోళనకర వార్తను ఇచ్చింది భారత వాతావరణ శాఖ (ఐఎండీ). ఉత్తర భారతంలోని అనేక రాష్ట్రాలకు 'కోల్డ్ డే' హెచ్చరికలు జారీ చేసింది. ఉష్ణోగ్రతలు.. 10 డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువగా ఉంటాయని పేర్కొంది.
కోల్డ్ వేవ్- కోల్డ్ డే హెచ్చరికలు..
రానున్న రెండు రోజుల పాటు వాయవ్య భారతంలో రాత్రులు, ఉదయం వేళల్లో దట్టమైన పొగమంచు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తన తాజా బులెటెన్‌లో పేర్కొంది.
Cold day warning Delhi : హరియాణాలోని అనేక ప్రాంతాలు, రాజస్థాన్‌లోని కొన్ని చోట్ల, పంజాబ్ లో కొన్ని ప్రదేశాల్లో చలి తీవ్రత ఇప్పటికే ఎక్కువగా ఉంది. ఢిల్లీలో కొన్ని చోట్ల, ఉత్తర మధ్యప్రదేశ్‌లో చలికి ప్రజలు ఇప్పటికే వణికిపోతున్నారు.
ఐఎండీ డేటా ప్రకారం.. ఢిల్లీ పాలం వద్ద గరిష్టంగా 13.8 డిగ్రీల సెల్సియస్, ఛండీగఢ్‌లో గరిష్టంగా 14.3 డిగ్రీల సెల్సియస్, హరియాణా అంబాలాలో గరిష్టంగా 10 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.
Cold day warning for North India : గత 24 గంటల్లో శుక్రవారం ఉదయం 8.30 గంటలకు నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు పంజాబ్, హరియాణా-ఛండీగఢ్-ఢిల్లీ, పశ్చిమ రాజస్థాన్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో 6-10 డిగ్రీల మధ్య నమోదవ్వడం గమనార్హం.
జనవరి 6 నుంచి 9 వరకు తూర్పు ఉత్తరప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఉదయం దట్టమైన పొగమంచు ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. పశ్చిమ మధ్యప్రదేశ్, బిహార్, ఝార్ఖండ్, అసోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో జనవరి 6 నుంచి 8 వరకు పొగమంచు ఉంటుందని పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో జనవరి 6, 7 తేదీల్లో పొగమంచు అలుముకుంటుందని స్పష్టం చేసింది.
అక్కడ వర్షాలు కూడా..!
India Cold day warning : అదే సమయంలో.. జనవరి 8 నుంచి 10 మధ్య వాయవ్య, మధ్య భారతదేశంలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ సూచించింది.
గరిష్ఠ ఉష్ణోగ్రత 4.5 నుంచి 6.4 డిగ్రీల మధ్య పడిపోతే 'కోల్డ్ డే'గా పరిగణిస్తారు. ఈ సీజన్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 6.5 డిగ్రీలు తగ్గితే, దానిని తీవ్రమైన చలి దినం (సివియర్ కోల్డ్ డే) అని పేర్కొంటారు.
ఐఎండీ హెచ్చరికలతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నాయి. ఉత్తర భారతంలో పరిస్థితులు ఇప్పటికే ఆందోళనకరంగా ఉన్నాయి. ప్రజలు ఎప్పటికప్పుడు తగిన ఏర్పాట్లు చేసుకుంటున్నారు.