Tamil Nadu rains : తమిళనాడులో మళ్లీ భారీ వర్షాలు.. అల్లాడిపోతున్న ప్రజలు!
Tamil Nadu rains : Tamil Nadu rains : తమిళనాడులో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. 4 జిల్లాల్లో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. ఎటు చూసినా వరద నీరే కనిపిస్తోంది.
Tamil Nadu rains today : భారీ వర్షాలతో తమిళనాడు రాష్ట్రం మరోమారు అల్లాడిపోతోంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉన్నాయి. తిరునెల్వెలి, టుటికోరిన్, టెంకాసి, కన్యాకుమారి జిల్లాల్లో జనజీవనం స్తంభించింది. అనేక ప్రాంతాల్లో చెట్లు నేలకూలాయి. రోడ్లు దెబ్బతినడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని చోట్లు విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.
వర్షాలు ఇప్పట్లో తగ్గవు..!
భారత వాతావరణ శాఖ ప్రకారం.. ఆదివారం అర్థరాత్రి 1:30 గంటలకు (15 గంటల్లో) టుటికోరిన్ జిల్లాల్లో 60 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తురునెల్వెలిలోని పలాయంకొట్టిలో అది 26 సెంటీమీటర్లుగా ఉంది. కన్యాకుమారిలో 17.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
Tamil Nadu rains live updates : ఆయా ప్రాంతాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు అధికారులు. బ్యాంక్లు, ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు కూడా మూతపడ్డాయి. ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయాలని సంస్థలు పేర్కొన్నాయి.
తురునెల్వెలి, తుత్తుకుడి, కన్యాకుమారిలో మోకాళ్ల మేర నీళ్లు నిలిచిపోయాయి. సాధారణ నడకకు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పాపనాసం, పెరున్జాని, పెచుపరై డ్యామ్ల నుంచి నీటిని వదలడం ఇందుకు కారణం.
తమిళనాడు ప్రజల కష్టాలు ఇప్పట్లో తీరేడట్టు లేదు! రానున్న గంటలు, రోజుల పాటు తమిళనాడులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మత్య్సకారులు వేటకు వెళ్ల వద్దని స్పష్టం చేసిది.
Tamil Nadu rains latest news : తమిళనాడు వర్షాల పరిస్థితిని సీఎం ఎంకే స్టాలిన్ నిత్యం పర్యవేక్షిస్తున్నారు. జిల్లాల అధికారులకు విలువైన సూచనలు చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశాలిచ్చారు.
రైళ్లు రద్దు..!
సహాయక చర్యల్లో భాగంగా.. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రాత్రింపగళ్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. తిరునెల్వెలి, టుటికోరిన్ జిల్లాల్లో 50కిపైగా మంది సభ్యులతో కూడిన బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తున్నాయి. ఇతర జిల్లాల్లో 4వేలకుపైగా మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.
తమిళనాడు వర్షాల నేపథ్యంలో అనేక రైళ్లు రద్దయ్యాయి. టుటికోరన్కు వెళ్లాల్సిన విమానా సేవలు సైతం నిలిచిపోయాయి.
Tamil Nadu rains in Telugu : తమిళనాడులో వర్షాల ప్రభావంపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. మిచౌంగ్ తపాను కారణంగా డిసెంబర్ మొదటి వారంలోనే రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయి. చెన్నైలోని అనేక ప్రాంతాలు నీట మునిగాయి. మళ్లీ ఇప్పుడు భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు అల్లాడిపోతున్నారు.
సంబంధిత కథనం