Southwest monsoon : ఈసారి.. 5ఏళ్లల్లోనే అతి తక్కువ వర్షపాతం- అదే కారణం!
Southwest monsoon : నైరుతి రుతుపవనాలు.. ఇంకొన్ని రోజుల్లో దేశాన్ని పూర్తిగా విడిచిపెట్టి వెళ్లిపోనున్నాయి. కాగా.. ఈసారి తక్కువ వర్షాలే పడ్డాయని ఐఎండీ తెలిపింది.
Southwest monsoon exit : నైరుతి రుతుపవనాల ఉపసంహరణ ప్రక్రియ ఇంకొన్ని రోజుల్లో పూర్తికానుంది. ఈ ఏడాది జూన్‌లో కేరళలోకి ప్రవేశించిన రుతుపవనాలు.. ప్రస్తుతం తిరుగుప్రయాణంలో ఉన్నాయి. కాగా.. 2018 నుంచి చూస్తే.. ఈ ఏడాది అతి తక్కువ వర్షపాతం నమోదైంది. ఎల్ నీనో ఇందుకు కారణం. ఈ వివరాలను భారత వాతావరణశాఖ వెల్లడించింది.
అక్టోబర్ మొదటి వారం పూర్తయ్యే సరికి.. నైరుతి రుతుపవనాలు దేశాన్ని విడిచిపెడతాయని ఐఎండీ తెలిపింది. ఈసారి వర్షాలు సరిగ్గా పడలేదని పేర్కొంది. ఆగస్ట్‌లో అసలు వర్షాలే లేవని, శతాబ్ద కాలంలో ఇదే తొలిసారి అని స్పష్టం చేసింది. ఈ ఏడాది జూన్ నుంచి సెప్టెంబర్ వరకు లెక్కిస్తే.. ఎల్పీఏ (లాంగ్ పీరియడ్ యావరేజ్)లో 94శాతం వర్షపాతమే నమోదైందని, ఇది 2018 నుంచి కనిష్ఠ స్థాయి అని వివరించింది.
Southwest monsoon 2023 : దేశవ్యాప్తంగా ఈసారి జూన్‌లో.. సాధారణం కన్నా 9శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. జులైలో సాధారణం కన్నా 13శాతం ఎక్కువ వర్షాలు పడ్డాయి. ఆగస్ట్‌లో 36శాతం లోటు నమోదైంది. సెప్టెంబర్‌లో సాధారణం కన్నా 13శాతం ఎక్కువగా వర్షాలు పడ్డాయి.
ఇక ఈ వారం చివరి నాటికి నైరుతి రుతుపవనాలు దేశాన్ని విడిచిపెడుతుండగా.. కొన్ని ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
తూర్పు భారతం:- పశ్చిమ్ బెంగాల్‌లోని హిమాలయ ప్రాంతాలు, సిక్కిం, ఝార్ఖండ్, బిహార్, ఒడిశాల్లో ఈ నెల 5 వరకు వర్షాలు పడతాయి.
Rains in India : ఈశాన్య భారతం:- ఈ నెల 5 వరకు.. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్‌లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షపాతం నమోదవుతుంది.
పశ్చిమ భారతం:- మహారాష్ట్ర, గోవా, దక్షిణ కోంకణ్ ప్రాంతాల్లో సోమవారం నుంచి వర్షాలు పడతాయి. గోవాలో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది.
Telangana Rains : మధ్య భారతం:- ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటికే వర్షాలు పడుతున్నాయి. మంగళవారం వరకు ఇదే పరిస్థితి ఉంటుంది.
దక్షిణ భారతం:- కేరళలో సోమవారం తేలికపాటి వర్షాలు పడొచ్చు. ఇతర రాష్ట్రాలకు పెద్దగా వర్ష సూచన లేదు.
సంబంధిత కథనం