TS Weather Update: చురుగ్గా రుతుపవనాలు.. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు-active monsoon rains in many districts across telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Weather Update: చురుగ్గా రుతుపవనాలు.. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు

TS Weather Update: చురుగ్గా రుతుపవనాలు.. తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు

HT Telugu Desk HT Telugu
Jun 27, 2023 08:08 AM IST

TS Weather Update: రుతుపవనాలు చురుగ్గా కదులుతూ ఉండటంతో తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. మరో మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

 తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో వర్షాలు

TS Weather Update: తెలంగాణ రాష్ట్రంలో మంగళవారం పలు జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురువనున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలైన ఆదిలాబాద్‌, కుమురం భీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

హైదరాబాద్‌లో తేలికపాటి వర్షాలు, జల్లులు కురుస్తాయంది. ఉత్తర ఒడిశా, దక్షిణ ఝార్ఖండ్‌, ఉత్తర ఛత్తీస్‌గఢ్‌ పరిసరాల్లో అల్పపీడనం కొనసాగుతోందని తెలిపింది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం వరకు రాష్ట్రంలో అత్యధికంగా కుమురం భీం జిల్లా సిర్పూర్‌(టి)లో 7సెం.మీ వర్షపాతం నమోదయింది. జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ 6, కుమురం భీం జిల్లా బెజ్జూర్‌లో 5, నిర్మల్‌ జిల్లా ముథోల్‌లో 5, కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో 4సెం.మీ వర్షపాతం నమోదైంది.

మరోవైపు నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతుండడంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌ సహా పలు జిల్లాల్లో ఇప్పటికే పలుచోట్ల భారీ వర్షాపాతం నమోదైంది. రానున్న రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం నమోదవుతుందని ప్రకటించింది.

సోమవారం నుంచి మంగళవారం ఉదయం వరకు కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జిల్లాల్లో ఉరుము, మెరుపులతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

మంగళవారం నుంచి బుధవారం వరకు ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో వానలు పడతాయని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వివరించింది. ఈ మేరకు ఆయా జిల్లాల్లో ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. మంగళవారం ఉదయం నుంచి ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, ములుగు, మంచిర్యాల, మెదక్‌ జిల్లాల్లో మోస్తరు వర్షాపాతం నమోదైంది. పలు జిల్లాల్లో తేలికపాటి జల్లులు కురిశాయని టీఎస్‌ డీపీఎస్‌ వివరించింది.

Whats_app_banner