UPSC Mains Admit Card : యూపీఎస్సీ మెయిన్స్ అడ్మిట్ కార్డు విడుదల- ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
14 September 2024, 6:40 IST
- UPSC Mains Admit Card 2024 : యూపీఎస్సీ అభ్యర్థులకు కీలక అప్డేట్. యూపీఎస్సీ మెయిన్స్ అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
యూపీఎస్సీ మెయిన్స్ అడ్మిట్ కార్డు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ మెయిన్స్ అడ్మిట్ కార్డు 2024ను విడుదల చేసింది. సివిల్ సర్వీసెస్ మెయిన్ ఎగ్జామినేషన్ 2024కు హాజరయ్యే అభ్యర్థులు upsc.gov.in యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్, upsconline.nic.in ద్వారా తమ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అడ్మిట్ కార్డు అధికారిక వెబ్సైట్లో సెప్టెంబర్ 13 నుంచి సెప్టెంబర్ 29, 2024 వరకు అందుబాటులో ఉంటుందని గుర్తు పెట్టుకోవాలి.
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షను సెప్టెంబర్ 20, 21, 22, 28, 29 తేదీల్లో నిర్వహించనున్నారు. ఈ ఎగ్జామ్‌ని రెండు షిఫ్టుల్లో నిర్వహిస్తారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఉంటుంది.
సివిల్ సర్వీసెస్ మెయిన్స్ ఎగ్జామినేషన్‌లో రాత పరీక్ష, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్ట్ ఉంటాయి. రాత పరీక్షలో తొమ్మిది సంప్రదాయ వ్యాస పత్రాలు ఉంటాయి. వీటిలో రెండు అర్హత స్వభావం కలిగి ఉంటాయి. వివిధ సర్వీసులు, పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయడానికి ఈ పరీక్ష నిర్వహిస్తారు.
యూపీఎస్సీ మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2024 డౌన్లోడ్ చేసుకోవడానికి డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇదీ చూడండి:- IBPS RRB PO Prelims Result: ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..
అడ్మిట్ కార్డులను ఇలా డౌన్లోడ్ చేసుకోండి..
యూపీఎస్సీ మెయిన్స్ 2024 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు ఈ క్రింది దశలను అనుసరించవచ్చు.
- upsc.gov.in అధికారిక యూపీఎస్సీ వెబ్‌సైట్‌ని సందర్శించండి.
- హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న యూపీఎస్సీ మెయిన్స్ అడ్మిట్ కార్డ్ 2024 లింక్‌పై క్లిక్ చేయండి.
- అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను నమోదు చేయాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- సబ్మీట్ బటన్‌పై క్లిక్ చేస్తే మీ అడ్మిట్ కార్డు డిస్ప్లే అవుతుంది.
- అడ్మిట్ కార్డు చెక్ చేసుకుని పేజీని డౌన్లోడ్ చేసుకోవాలి.
- తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని తీసుకోండి.
ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా సంస్థలో 1056 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 14న ప్రారంభమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2024 మార్చి 5న ముగిసింది. ప్రిలిమ్స్ పరీక్షను 2024 జూన్ 16న నిర్వహించగా, 2024 జూలై 1న ఫలితాలను ప్రకటించారు. ప్రిలిమ్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు హాజరు కావడానికి అర్హులు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ చూడవచ్చు.
యూపీఎస్సీ మెయిన్స్ పరీక్షకి సంబంధించిన పూర్తి షెడ్యూల్ తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.