IBPS RRB PO Prelims Result: ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..-ibps rrb po prelims result 2024 for officer scale i out direct link here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ibps Rrb Po Prelims Result: ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..

IBPS RRB PO Prelims Result: ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల; రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి..

Sudarshan V HT Telugu
Sep 13, 2024 09:21 PM IST

ఆఫీసర్ స్కేల్ 1 కోసం ఐబీపీఎస్ నిర్వహించిన ఆర్ఆర్బీ పీవో ప్రిలిమ్స్ 2024 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఈ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ రిజల్ట్ ను ఐబీపీఎస్ అధికారిక వెబ్ సైట్ ibps.in లో చూసుకోవచ్చు.

ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల
ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS) ఆఫీసర్ స్కేల్ 1 కోసం ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ ప్రిలిమ్స్ 2024 ఫలితాలను సెప్టెంబర్ 13, 2024 న విడుదల చేసింది. ప్రిలిమినరీ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్ ibps.in ద్వారా ఫలితాలను చూసుకోవచ్చు. ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్ ibps.in లో ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ ప్రిలిమ్స్ 2024 ఫలితాలు సెప్టెంబర్ 13వ తేదీ నుంచి సెప్టెంబర్ 20వ తేదీ వరకు అందుబాటులో ఉంటాయి.

రిజల్ట్స్ ను ఇలా చూసుకోండి..

ఆఫీసర్ స్కేల్ 1 కోసం ఐబీపీఎస్ ఆర్ఆర్బీ (RRB) పీవో ప్రిలిమ్స్ రిజల్ట్ 2024 చెక్ చేయడానికి..

  • ముందుగా ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్ ibps.in ను సందర్శించండి.
  • హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న ఆఫీసర్ స్కేల్ 1 ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ ప్రిలిమ్స్ రిజల్ట్ 2024 లింక్ పై క్లిక్ చేయండి.
  • అభ్యర్థులు లాగిన్ వివరాలను నమోదు చేయాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • లాగిన్ వివరాలను నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేస్తే మీ రిజల్ట్ డిస్ ప్లే అవుతుంది.
  • రిజల్ట్ చెక్ చేసుకుని పేజీని డౌన్ లోడ్ చేసుకోండి.
  • తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచండి.

మెయిన్ పరీక్ష ఎప్పుడు?

ఆఫీసర్ స్కేల్-1 ప్రిలిమ్స్ పరీక్షను 2024 ఆగస్టు 3, 4, 10, 17, 18 తేదీల్లో నిర్వహించారు. ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు మెయిన్ పరీక్షకు హాజరు కావడానికి అర్హులు. మెయిన్ పరీక్షను 2024 సెప్టెంబర్ 29న నిర్వహిస్తారు. పరీక్షకు ముందు అడ్మిట్ కార్డులను జారీ చేస్తారు. మెయిన్ పరీక్షలో 200 ప్రశ్నలు, మొత్తం 200 మార్కులు ఉంటాయి. 2 గంటలపాటు సాగే ఈ పరీక్షలో రీజనింగ్, కంప్యూటర్ నాలెడ్జ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, హిందీ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ పై ప్రశ్నలు ఉంటాయి.

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఖాళీలు

ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న 9923 గ్రూప్ ఏ ఆఫీసర్లు (స్కేల్ -1, 2, 3), గ్రూప్ బీ ఆఫీస్ అసిస్టెంట్స్ (మల్టీపర్పస్ ) పోస్టుల భర్తీకి ఈ రిక్రూట్ మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 7న ప్రారంభమై 2024 జూన్ 27న ముగిసింది. మరిన్ని వివరాలకు అభ్యర్థులు ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్ ను చూడవచ్చు.

Whats_app_banner