IBPS PO 2024 : 4455 పోస్టులకు ఐబీపీఎస్ నోటిఫికేషన్.. ఈ బ్యాంకుల్లో ఖాళీలు-ibps po 2024 registration begins for 4455 posts in various bank apply at ibps in direct link ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ibps Po 2024 : 4455 పోస్టులకు ఐబీపీఎస్ నోటిఫికేషన్.. ఈ బ్యాంకుల్లో ఖాళీలు

IBPS PO 2024 : 4455 పోస్టులకు ఐబీపీఎస్ నోటిఫికేషన్.. ఈ బ్యాంకుల్లో ఖాళీలు

Anand Sai HT Telugu
Aug 01, 2024 09:39 AM IST

IBPS Jobs 2024 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఐబీపీఎస్ జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో భాగంగా మెుత్తం 4455 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.

ఐబీపీఎస్ జాబ్స్
ఐబీపీఎస్ జాబ్స్

ఇన్ స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్ ) ఆగస్టు 1న ప్రొబేషనరీ ఆఫీసర్స్ /మేనేజ్ మెంట్ ట్రైనీల (సీఆర్ పీవో/ఎంటీ) కామన్ రిక్రూట్ మెంట్ ప్రాసెస్‌కు నోటిఫికేషన్ విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్ ibps.inలో రిజిస్ట్రేషన్ కమ్ అప్లికేషన్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది.

yearly horoscope entry point

ఆగస్టు 1 నుంచి 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రిలిమ్స్ పరీక్ష అక్టోబర్‌లో ఉంటుంది. మెయిన్స్ పరీక్ష నవంబర్‌లో నిర్వహిస్తారు. మెయిన్స్ ఫలితాలు : డిసెంబర్, 2024/జనవరి 2025లో రావొచ్చు. ఇంటర్వ్యూలు ఫిబ్రవరి నెలలో నిర్వహించే అవకాశం ఉంది.

ఈ ఏడాది ఐబీపీఎస్ పీవో 2024.. 11 భాగస్వామ్య బ్యాంకుల్లో 4455 ఖాళీలకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

ఐబీపీఎస్ పీఓ 2024 అర్హత ప్రమాణాలు

దరఖాస్తుదారులు ఆగస్టు 1, 2024 నాటికి కనీసం 20 ఏళ్లు ఉండాలి, 30 ఏళ్లు మించకూడదు. అంటే అభ్యర్థులు ఆగస్టు 2, 1994 కంటే ముందు, ఆగస్టు 1, 2004 తర్వాత జన్మించి ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇచ్చారు.

గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా భారత ప్రభుత్వం గుర్తించిన తత్సమాన విద్యార్హత ఉండాలి. అభ్యర్థి గ్రాడ్యుయేషన్లో సాధించిన మార్కులతో పాటు గ్రాడ్యుయేట్ అని సూచించే చెల్లుబాటు అయ్యే మార్కుల షీట్ / సర్టిఫికేట్‌ను రిజిస్ట్రేషన్ తేదీలో కలిగి ఉండాలి.

జాయిన్ అయ్యే సమయంలో అభ్యర్థులు హెల్తీ క్రెడిట్ హిస్టరీ మెయింటైన్ చేయాలి. భాగస్వామ్య బ్యాంకుల పాలసీ ప్రకారం కనీస క్రెడిట్ స్కోర్ ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు రూ.175 (జీఎస్టీతో కలిపి), మిగతా వాటికి రూ.850 (జీఎస్టీతో కలిపి) చెల్లించాలి.

Whats_app_banner

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.