తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Upsc Ese Main Result 2024: యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాల వెల్లడి

UPSC ESE Main Result 2024: యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాల వెల్లడి

HT Telugu Desk HT Telugu

30 July 2024, 22:58 IST

google News
    • UPSC ESE Main Result 2024: ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2024 మెయిన్ ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం విడుదల చేసింది. యూపీఎస్సీ ఈఎస్ఈ 2024 పరీక్ష రాసిన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ upsc.gov.in ద్వారా తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాల వెల్లడి
యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాల వెల్లడి

యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్ మెయిన్స్ ఫలితాల వెల్లడి

UPSC ESE Main Result 2024: ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ మెయిన్స్ 2024 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసింది. ఇంజనీరింగ్ సర్వీసెస్ మెయిన్ పరీక్ష 2024కు హాజరైన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ upsc.gov.in లో తమ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

జూన్ 23న పరీక్ష

జూన్ 23, 2024న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో షిఫ్ట్ చొప్పున రెండు షిఫ్టుల్లో ఈఎస్ఈ మెయిన్స్ 2024 (UPSC ESE Main 2024) రాత పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష ఫలితాలను జూలై 30న వెల్లడించారు. మెయిన్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు పర్సనాలిటీ టెస్ట్ కు హాజరు కావాల్సి ఉంటుంది. పర్సనాలిటీ టెస్ట్ సమయంలో అభ్యర్థులు వయస్సు, విద్యార్హతలు, కమ్యూనిటీ, బెంచ్మార్క్ వైకల్యం (వర్తించే చోట) మొదలైన వాటికి సంబంధించిన వారి క్లెయిమ్ లకు మద్దతుగా ఒరిజినల్ సర్టిఫికేట్లను సమర్పించాల్సి ఉంటుంది.

ఈఎస్ఈ మెయిన్స్ 2024 రిజల్ట్ ఇలా చూసుకోండి..

ఈఎస్ఈ మెయిన్స్ 2024 పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఫలితాలను ఈ క్రింది స్టెప్స్ ద్వారా తెలుసుకోవచ్చు.

  • యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ upsc.gov.in ను ఓపెన్ చేయండి.
  • హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న యూపీఎస్సీ ఈఎస్ఈ మెయిన్ రిజల్ట్ 2024 లింక్ పై క్లిక్ చేయండి.
  • కొత్త పీడీఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులు తమ రోల్ నంబర్లను చెక్ చేసుకోవచ్చు.
  • రిజల్ట్ పేజీని డౌన్ లోడ్ చేసుకోండి. తదుపరి అవసరానికి దాని హార్డ్ కాపీని భద్రపర్చుకోండి.
  • మెయిన్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులందరూ డిటైల్డ్ అప్లికేషన్ ఫామ్ (డీఏఎఫ్)ను తప్పనిసరిగా నింపాల్సి ఉంటుంది, ఇది కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది.

ఇంటర్వ్యూ షెడ్యూల్ వివరాలు

అధికారిక ప్రకటన ప్రకారం, ఇంటర్వ్యూ షెడ్యూల్ ను అభ్యర్థులకు తగిన సమయంలో తెలియజేస్తారు. అయితే ఇంటర్వ్యూ కచ్చితమైన తేదీని అభ్యర్థులకు ఈ మెయిల్ ద్వారా తెలియజేస్తారు. రోల్ నంబర్ల వారీగా ఇంటర్వ్యూ షెడ్యూల్ ను యూపీఎస్సీ (UPSC) వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచుతారు. ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా 167 పోస్టులను భర్తీ చేయనున్నారు.

తదుపరి వ్యాసం