తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Upsc Calendar 2025 : యూపీఎస్సీ క్యాలెండర్​లో కీలక మార్పులు- అభ్యర్థులు కచ్చితంగా చెక్​ చేయాలి..

UPSC Calendar 2025 : యూపీఎస్సీ క్యాలెండర్​లో కీలక మార్పులు- అభ్యర్థులు కచ్చితంగా చెక్​ చేయాలి..

Sharath Chitturi HT Telugu

08 November 2024, 7:20 IST

google News
    • UPSC Calendar 2025 revised : యూపీఎస్సీ వార్షిక క్యాలెండర్ 2025ను మరోసారి సవరించారు. సవరించిన క్యాలెండర్​కి సంబంధించిన వివరాలను ఇక్కడ చెక్ చేసుకోవచ్చు.
యూపీఎస్సీ క్యాలెండర్​లో కీలక మార్పులు
యూపీఎస్సీ క్యాలెండర్​లో కీలక మార్పులు

యూపీఎస్సీ క్యాలెండర్​లో కీలక మార్పులు

ఇప్పటికే విడుదలైన 2025 వార్షిక క్యాలెండర్​ని మళ్లీ సవరించింది యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ.) అభ్యర్థులు ఈ కొత్త వివరాలను కచ్చితంగా తెలుసుకోవాలి. ఇందుకోసం upsc.gov.in యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ నుంచి క్యాలెండర్​ని డౌన్​లోడ్​ చేసుకోవాల్సి ఉంటుంది.

యూపీఎస్సీ వార్షిక క్యాలెండర్ 2025ను సవరించడం ఇది రెండోసారి! మొదట ఆగస్టులో సవరించారు.

తాజాగా సవరించిన యూపీఎస్సీ క్యాలెండర్ 2025 ప్రకారం ఎన్డీఏ అండ్ ఎన్ఏ ఎగ్జామినేషన్ (ఐ), 2025, సీడీఎస్ ఎగ్జామినేషన్ (ఐ) 2025 నోటిఫికేషన్ 2024 డిసెంబర్ 11న విడుదల కానుంది. ఈ రెండు పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ 31, 2024. ఈ రెండు పరీక్షలు 2025 ఏప్రిల్ 13న జరగనున్నాయి. ఎన్​డీఏ అండ్ ఎన్ ఏ ఎగ్జామినేషన్ (2), 2025, సీడీఎస్ ఎగ్జామినేషన్ (2) 2025 నోటిఫికేషన్ మే 28న విడుదల కానుండగా, రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 17, 2025న ముగియనుంది. 2025 సెప్టెంబర్ 14న రాత పరీక్ష నిర్వహిస్తారు.

సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) ఎగ్జామినేషన్, 2025, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ప్రిలిమినరీ) ఎగ్జామినేషన్, 2025 ద్వారా సీఎస్ (పి) ఎగ్జామినేషన్ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 22, 2025న ప్రారంభమై ఫిబ్రవరి 11, 2025న ముగుస్తుంది. 2025 మే 25న పరీక్ష నిర్వహిస్తారు. సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్ష 2025 ఆగస్టు 22న జరగనుంది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ మెయిన్ పరీక్ష 2025 నవంబర్ 16న జరుగుతుంది.

ఐఈఎస్/ఐఎస్ఎస్ ఎగ్జామినేషన్ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఫిబ్రవరి 12, 2025న ప్రారంభమవుతుంది. దరఖాస్తుకు చివరి తేదీ 2025 మార్చి 4 వరకు ఉంటుంది. ఈ పరీక్షను 2025 జూన్ 20న నిర్వహించనున్నారు.

కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2025 నోటిఫికేషన్ ఫిబ్రవరి 19న విడుదలవుతుందని, దరఖాస్తుకు చివరి తేదీ 2025 మార్చి 11 అని తెలుస్తోంది. 2025 జూలై 20న రాత పరీక్ష నిర్వహిస్తారు.

ఈ యూపీఎస్సీ వార్షిక క్యాలెండర్​లో కంబైన్డ్ జియో సైంటిస్ట్ (ప్రిలిమినరీ) ఎగ్జామినేషన్, 2025, మెయిన్ఈఎం తేదీలు కూడా ఉన్నాయి. ప్రిలిమ్స్ పరీక్షను 2025 ఫిబ్రవరి 9న, మెయిన్ పరీక్షను 2025 జూన్ 21న నిర్వహిస్తారు. మరిన్ని వివరాలకు అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్​ని చూడవచ్చు.

యూపీఎస్సీ వార్షిక క్యాలెండర్​ 2025ని చూసేందుకు ఇక్కడ క్లిక్​ చేయండి.

పీఎం ఇంటర్న్​షిప్​ స్కీమ్..

పీఎం ఇంటర్న్​షిప్​ స్కీమ్ 2024 రిజిస్ట్రేషన్​ ప్రక్రియను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఎంసీఏ ఇప్పటికే ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2024 నవంబర్ 10న ముగియనుంది. అప్లై చేయాలనుకునే అభ్యర్థులు pminternship.mca.gov.in పీఎం ఇంటర్న్​షిప్​ స్కీమ్ అధికారిక వెబ్సైట్లో డైరెక్ట్ లింక్​ని చూడవచ్చు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం