PM Internship Scheme : 500 టాప్​ కంపెనీల్లో ఇంటర్న్​షిప్​ అవకాశం- వెంటనే రిజిస్ట్రేషన్​ చేసుకోండి..-pm internship scheme 2024 registration ends on november 10 link and other details here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pm Internship Scheme : 500 టాప్​ కంపెనీల్లో ఇంటర్న్​షిప్​ అవకాశం- వెంటనే రిజిస్ట్రేషన్​ చేసుకోండి..

PM Internship Scheme : 500 టాప్​ కంపెనీల్లో ఇంటర్న్​షిప్​ అవకాశం- వెంటనే రిజిస్ట్రేషన్​ చేసుకోండి..

Sharath Chitturi HT Telugu
Nov 07, 2024 01:10 PM IST

PM Internship Scheme 2024 : పీఎం ఇంటర్న్​షిప్​ స్కీమ్ 2024 రిజిస్ట్రేషన్ నవంబర్ 10, 2024తో ముగుస్తుంది. దరఖాస్తు చేసుకోవడానికి డైరెక్ట్ లింక్​తో పాటు పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

పీఎం ఇంటర్న్​​షిప్​ స్కీమ్​కి అప్లే చేశారా?
పీఎం ఇంటర్న్​​షిప్​ స్కీమ్​కి అప్లే చేశారా?

పీఎం ఇంటర్న్​షిప్​ స్కీమ్ 2024 రిజిస్ట్రేషన్​ ప్రక్రియను కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఎంసీఏ ఇప్పటికే ప్రారంభించిన విషయం తెలిసిందే. కాగా ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 2024 నవంబర్ 10న ముగియనుంది. అప్లై చేయాలనుకునే అభ్యర్థులు pminternship.mca.gov.in పీఎం ఇంటర్న్​షిప్​ స్కీమ్ అధికారిక వెబ్సైట్లో డైరెక్ట్ లింక్​ని చూడవచ్చు.

ఇంటర్న్​షిప్​ స్కీమ్​కి దరఖాస్తు చేసుకోవడానికి హైస్కూల్ హయ్యర్ సెకండరీ స్కూల్ ఉత్తీర్ణత, ఐటీఐ నుంచి సర్టిఫికెట్, పాలిటెక్నిక్ ఇన్​స్టిట్యూ నుంచి డిప్లొమా కలిగి ఉండాలి లేదా బీఏ, B.Sc, B.Com, బీసీఏ, బీబీఏ, బీఫార్మసీ తదితర డిగ్రీలతో గ్రాడ్యుయేట్లు అయి ఉండాలి.దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ నాటికి అభ్యర్థుల వయస్సు 21 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలని గుర్తుపెట్టుకోవాలి.

అభ్యర్థి భారతీయ జాతీయవాది అయి ఉండాలి. ఫుల్ టైమ్ ఉద్యోగంలో ఉండకూడదు. ఫుల్ టైమ్ ఎడ్యుకేషన్​లో నిమగ్నం కాకూడదు. ఆన్​లైన్/ డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్స్​లో చేరిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

పీఎం ఇంటర్న్​షిప్​ స్కీమ్ 2024 దరఖాస్తు చేసుకోవడానికి డైరక్ట్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

దరఖాస్తు విధానం..

పీఎం ఇంటర్న్​షిప్​ స్కీమ్ 2024 కోసం దరఖాస్తు చేయడానికి అభ్యర్థులు ఈ కింది స్టెప్స్​ని అనుసరించవచ్చు.

  • pminternship.mca.gov.in పీఎం ఇంటర్న్​షిప్​ స్కీమ్ అధికారిక వెబ్సైఠ్​ని సందర్శించండి.
  • రిజిస్టర్ లింక్​పై క్లిక్ చేస్తే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
  • రిజిస్ట్రేషన్ వివరాలు నింపి సబ్మిట్​ బటన్​పై క్లిక్ చేయాలి.
  • అభ్యర్థులు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోర్టల్ ద్వారా రెజ్యూమ్​ జనరేట్ అవుతుంది.
  • లొకేషన్, సెక్టార్, ఫంక్షనల్ రోల్, క్వాలిఫికేషన్స్ ఆధారంగా 5 ఇంటర్న్​షిప్​ అవకాశాలకు దరఖాస్తు చేసుకోవాలి.
  • సబ్మిట్​ బటన్​పై క్లిక్ చేసి కన్ఫర్మేషన్ పేజీని డౌన్​లోడ్​ చేసుకోవాలి.
  • తదుపరి అవసరాల కోసం దాని హార్డ్ కాపీని ఉంచండి.

పీఎం ఇంటర్న్​షిప్​ స్కీమ్ 2024 కోసం దరఖాస్తు చేయడానికి రిజిస్ట్రేషన్ లేదా అప్లికేషన్ ఫీజు లేదు! అంటే ఇది పూర్తిగా ఉచితం.

ఐదేళ్లలో టాప్ 500 కంపెనీల్లో కోటి మందికి ఇంటర్న్​షిప్​ అవకాశాలను ఇచ్చేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ మేరకు ఈ ఏడాది జులైలో ప్రవేశపెట్టిన బడ్జెట్​లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​ ఈ ప్రకటన చేశారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో టాప్ కంపెనీల్లో 1.25 లక్షల ఇంటర్న్​షిప్​ అవకాశాలు కల్పించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు పీఎం ఇంటర్న్​షిప్​ అధికారిక వెబ్సైట్​ని సందర్శించాల్సి ఉంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం