APSRTC Apprenticeship : 295 అప్రెంటిస్ ఖాళీలు - ఏపీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్, రాత పరీక్ష లేకుండానే..!
APSRTC Apprenticeship Notification 2024: అప్రెంటీస్‌షిప్ ఖాళీల భర్తీకి ఏపీఎస్ఆర్టీసీ నోటిఫికేషన్ జారీ చేసింది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లోని వివిధ ట్రేడుల్లో వీటిని భర్తీ చేయనున్నారు. దరఖాస్తులకు నవంబర్ 19వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ (ఏపీఎస్ఆర్టీసీ)లో అప్రెంటిస్‌షిప్‌నకు దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో వివిధ ట్రేడ్‌లకు సంబంధించి అప్రెంటీస్‌షిప్ కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. నవంబర్ 19లోగా దరఖాస్తులు దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం 295 ఖాళీలను భర్తీ చేస్తున్నారు.
ఏ జిల్లాల్లో ఏ ట్రేడ్‌లో ఖాళీ…?
ఆయా జిల్లాల్లో వివిధ ట్రేడ్‌ల్లో ఖాళీలను బట్టీ అప్రెంటీస్‌షిప్‌కు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
1. కర్నూలు జిల్లాకు సంబంధించి డీజిల్ మెకానిక్-35, మోటార్ మెకానిక్-4, ఎలక్ట్రీషియన్-4, వెల్డర్-1, పెయింటర్ -1, ఫిట్టర్-1, డాఫ్ట్స్ మెన్ సివిల్-1 మొత్తం 47 ఖాళీలకు అప్రెంటీస్‌షిప్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
2. నంద్యాల జిల్లాకు సంబంధించి డీజిల్ మెకానిక్-34, మోటార్ మెకానిక్-4, ఎలక్ట్రీషియన్-4, పెయింటర్-1, డ్రాఫ్ట్స్ మెన్ సివిల్-1 మొత్తం 45 ఖాళీలకు అప్రెంటీస్‌షిప్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
3. అనంతపురం జిల్లాకు సంబంధించి డీజిల్ మెకానిక్-38, మోటార్ మెకానిక్-5, ఎలక్ట్రీషియన్-5, వెల్డర్-2, పెయింటర్ -1, ఫిట్టర్-1, డ్రాఫ్ట్స్ మెన్ సివిల్-1 మొత్తం 53 ఖాళీలకు అప్రెంటీస్‌షిప్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
4. శ్రీసత్యసాయి జిల్లాకు సంబంధించి డీజిల్ మెకానిక్-28, మోటార్ మెకానిక్-3, ఎలక్ట్రీషియన్-3, వెల్డర్-1, పెయింటర్ -1, ఫిట్టర్-1, డాఫ్ట్స్ మెన్ సివిల్-1 మొత్తం 37 ఖాళీలకు అప్రెంటీస్‌షిప్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
5. కడప జిల్లాకు సంబంధించి డీజిల్ మెకానిక్-40, మోటార్ మెకానిక్-9, ఎలక్ట్రీషియన్-5, వెల్డర్-1, పెయింటర్-1, మెషనిస్టు-5, ఫిట్టర్-3, డాఫ్ట్స్ మెన్ సివిల్-1 మొత్తం 65 ఖాళీలకు అప్రెంటీస్‌షిప్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
6. అన్నమయ్య జిల్లాకు సంబంధించి డీజిల్ మెకానిక్ -36, మోటార్ మెకానిక్-5, ఎలక్ట్రీషియన్-4, వెల్డర్-1, పెయింటర్-1, డ్రాప్ట్స్ మెన్ సివిల్-1 మొత్తం 48 ఖాళీలకు అప్రెంటీస్‌షిప్‌కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలంటే ఆయా జిల్లాల్లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. ఆయా ట్రేడుల్లో ఐటీఐని గుర్తింపు పొందిన సంస్థ నుంచి పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తు ఎలా అప్లై చేసుకోవాలి?
ఏపీఎస్ఆర్టీసీలో అప్రెంటీస్‌షిప్ కోసం దరఖాస్తులను ఆన్‌లైన్‌లో చేసుకోవాలి. అప్రెంటీస్ కోసం దరఖాస్తు చేసే అభ్యర్థి తప్పనిసరిగా ఈ-మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్ కలిగి ఉండాలి. అధికారిక వెబ్‌సైట్ https://www.apprenticeshipindia.gov.in/ లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇదే వెబ్‌సైట్‌లో సర్టిఫికేస్టలను అప్‌డేట్ చేసుకోవాలి.
ధ్రువీకరణ పత్రాల పరిశీలన…
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్లు జిరాక్స్ కాపీలు, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలతో వెరిఫికేషన్‌కు కోసం జోనల్ సిబ్బంది శిక్షణ కళాశాల, ఏపీఎస్ఆర్‌టీసీ, బళ్లారి చౌరస్తా, కర్నూలులో హాజరుకావాలి. అలాగే రూ.118 (రూ.100+రూ.18 జీఎస్‌టీ) ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. సర్టిఫికేట్లు వెరిఫికేషన్ తేదీలో నోటిఫికేషన్‌లో వెల్లడించలేదు. త్వరలో వెల్లడిస్తారు. ఏపీఎస్ఆర్టీసీ వెబ్‌సైట్‌లో విడుదల చేస్తారు. అర్హులైన అభ్యర్థులకు ఎలాంటి రాత పరీక్ష లేకుండానే ధ్రువపత్రాల పరిశీలన తర్వాత తుది జాబితాను ప్రకటిస్తారు.
తీసుకురావాల్సిన సర్టిఫికెట్లు….
1. ఆన్‌లైన్‌లో రిజిస్టర్ చేసుకున్న నంబర్‌తో పాటు ప్రొఫైల్.
2. పదో తరగతి మార్కులు జాబితా
3. ఐటీఐ మార్కులు జాబితా
4. ఎన్‌సీవీటీ సర్టిఫికేట్
5. కుల ధ్రువీకరణ పత్రం
6. దివ్యాంగులైతే ఆ సర్టిఫికేట్
7. మాజీ సైనికోద్యోగుల పిల్లలైతే ధృవీకరణ పత్రం
8. ఎన్‌సీసీ, స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే అవి
9. ఆధార్ కార్డు
10. పాన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్
11. రెండు పాస్‌పోర్టు సైజు ఫోటోలు.
ఏదైనా సందేహముంటే, 08518-257025 ఫోన్ నెంబర్‌కు ఉదయం 10ః30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించాలని అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.