Man Kills Wife : భోజనం ఆలస్యమైందని.. భార్యను దారుణంగా చంపిన భర్త! చివరికి..
19 March 2024, 6:39 IST
- Man Kills Wife in UP : పొలం పనులు చేసుకు వచ్చిన తనకు సమయానికి భోజనం పెట్టలేదన్న కోపంతో.. ఓ వ్యక్తి, తన భార్యను కిరాతకంగా చంపేశాడు. ఆ తర్వాత అతను కూడా సూసైడ్ చేసుకున్నాడు. ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది ఈ ఘటన.
భార్యను చంపిన భర్త.. చివరికి!
Man Kills Wife over delay in lunch : ఉత్తర్ ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. భోజనం ఆలస్యమైందన్న కారణంతో.. ఓ వ్యక్తి, తన భార్యని చంపేశాడు. అనంతరం అతను కూడా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
ఇదీ జరిగింది..
ఉత్తర్ ప్రదేశ్ సితాపూర్లోని కోత్వాలన్పుర అనే గ్రామంలో సోమవారం మధ్యాహ్నం జరిగింది ఈ ఘటన. 30ఏళ్ల పరాశ్రమ్.. పొలం పనుల కోసం వెళ్లాడు. మధ్యాహ్నం తిరిగి వచ్చాడు. భోజనం వడ్డించాలని.. తన 28ఏళ్ల భార్య, ప్రేమ దేవిని అడిగాడు. అప్పటికి భోజనం రెడీ అవ్వలేదు. ఆ విషయం అతనికి చెప్పింది!
అంతే! వారి మధ్య గొడవ మొదలైంది. పరాశ్రమ్కి కోపం పెరిగిపోయింది. ఓ పదునైన ఆయుధం తీసుకుని భార్యపై దాడి చేశాడు. అనంతరం ఆమెను చంపేశాడు. క్షణికావేశంలో ముందు, వెనుక చూసుకోకుండా.. భార్యను హత్య చేశాడు. ఆ తర్వాత భయపడటం మొదలుపెట్టాడు. ఇప్పుడు తాను జైలుకు వెళ్లాల్సి వస్తుందేమో అని భయపడ్డాడు పరాశ్రమ్. చివరికి.. ఇంట్లోని ఓ గదిలోకి వెళ్లి తలుపు వేసుకున్నాడు. ఆ తర్వాత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
Man Kills Wife in UP : ఈ వ్యవహారం స్థానికులకు తెలిసింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై స్పందించిన పోలీసులు.. ఘటనాస్థలానికి వెళ్లారు. అప్పటికే భార్యాభర్తలు మరణించారని తెలుసుకున్నారు. అనంతరం.. వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
డ్యాన్స్ చేస్తుంటే మ్యూజిక్ ఆపేశాడని..
దేశంలో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. క్షణికావేశంలో ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా.. నేరాలకు పాల్పడుతున్నారు. తాను డ్యాన్స్ చేస్తుంటే, మ్యూజిక్ ఆపేశాడన్న కోపంతో.. ఓ వ్యక్తి, తన అన్నను చంపేశాడు! ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
UP man kills wife : మధ్యప్రదేశ్ మౌహర్ గ్రామంలో గత శుక్రవారం రాత్రి జరిగింది ఈ ఘటన. బాధితుడి పేరు రాకేశ్. అతని వయస్సు 35. నిందితుడు రాజ్‌కుమార్ కోల్ వయస్సు 30. వాళ్లిద్దరు అన్నదమ్ములు.
కాగా.. శుక్రవారం రాత్రి.. తన ఇంట్లో ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌ని ఏర్పాటు చేశాడు రాకేశ్. ఆ ఫంక్షన్‌కి రాజ్‌కూమార్ వెళ్లాడు. అందరితో కలిసి మ్యూజిక్‌కి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. కొంతసేపటికి.. రాకేశ్ వచ్చి.. మ్యూజిక్ సిస్టెమ్ని ఆపేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.