Crime news : డ్యాన్స్ చేస్తుంటే మ్యూజిక్ ఆపేశాడని.. అన్నని గొడ్డలితో నరికి చంపిన తమ్ముడు!
Man kill brother : మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ షాకింగ్ ఘటన ఇప్పుడు వార్తలకెక్కింది. తాను డ్యాన్స్ చేస్తుంటే, మ్యూజిక్ ఆపేశాడన్న కోపంతో.. ఓ వ్యక్తి, తన అన్నను చంపేశాడు!
Madhya Pradesh crime news : మధ్యప్రదేశ్‌లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది! చిన్న విషయానికే ఇద్దరు సోదరుల మధ్య గొడవ జరిగింది. కోపంతో ఊగిపోయిన తమ్ముడు.. అన్నను గొడ్డలితో నరికి చంపేశాడు. తమ్ముడు కోపానికి కారణం.. తాను డ్యాన్స్ చేస్తుంటే.. అన్న వచ్చి మ్యూజిక్ ఆపేయడం!
ఇదీ జరిగింది..
మధ్యప్రదేశ్ మౌహర్ గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది ఈ ఘటన. బాధితుడి పేరు రాకేశ్. అతని వయస్సు 35. నిందితుడు రాజ్‌కుమార్ కోల్ వయస్సు 30. వాళ్లిద్దరు అన్నదమ్ములు.
కాగా.. శుక్రవారం రాత్రి.. తన ఇంట్లో ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌ని ఏర్పాటు చేశాడు రాకేశ్. ఆ ఫంక్షన్‌కి రాజ్‌కూమార్ వెళ్లాడు. అందరితో కలిసి మ్యూజిక్‌కి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టాడు. కొంతసేపటికి.. రాకేశ్ వచ్చి.. మ్యూజిక్ సిస్టెమ్ని ఆపేశాడు.
రాజ్కుమార్కి కోపం వచ్చింది. తనకి ఇంకా డ్యాన్స్ చేయాలని ఉందని అన్నకు చెప్పాడు. కానీ రాకేశ్ ఒప్పుకోలేదు. ఇదే విషయంపై గొడవ మొదలైంది. కుటుంబసభ్యులు చూస్తుండగా.. గొడవ మరింత పెరిగింది. చివరికి.. కోపంతో ఊగిపోయిన రాజ్‌కుమార్.. గొడ్డలి తీసుకుని సొంత అన్నని అతి కిరాతకంగా చంపేశాడు! అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు.
ఇదీ చూడండి:- Kota suicide case : ‘నాన్నా.. నా వల్ల కావట్లేదు’- కోటాలో విద్యార్థి ఆత్మహత్య- ఏడాదిలో 6వ కేసు!
Man kills brother in Madhya Pradesh : ఈ విషయంపై పోలీసులకు సమాచారం అందింది. ఘటనాస్థలానికి వెళ్లగా.. బాధితుడు మరణించాడని పోలీసులు తెలుసుకున్నారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడు రాజ్‌కుమార్.. కొన్ని గంటల్లోనే పోలీసులకు దొరికిపోయాడు.
నిందితుడిని అరెస్ట్ చేసినట్టు, నేరం కోసం వాడిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు వెల్లడించారు.
అన్నదమ్ములు తీవ్రంగా గొడవపడుతున్న సమయంలో కుటుంబసభ్యులు ఏం చేస్తున్నారు? వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారా? వంటి వివరాలపై స్పష్టత లేదు.
Man kills brother : కాగా.. మ్యూజిక్ ఆపేశాడన్న కారణంతో.. అన్నను సొంత తమ్ముడు గొడ్డలితో నరికి చంపాడన్న వార్త.. స్థానికంగా కలకలం సృష్టించింది. రాజ్‌కుమార్ చేసిన పని గురించి తెలుసుకుంటున్న వారందరు.. షాక్‌కు గురవుతున్నారు. ఇంత చిన్న విషయానికి చంపేయడం ఏంటని ఆశ్చర్యపోతున్నారు!
సంబంధిత కథనం