తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Tata Tiago Ev : టాటా నుంచి మరో ఎలక్ట్రిక్​ కారు.. లాంచ్​కి సిద్ధంగా టియాగో ఈవీ!

Tata Tiago EV : టాటా నుంచి మరో ఎలక్ట్రిక్​ కారు.. లాంచ్​కి సిద్ధంగా టియాగో ఈవీ!

Sharath Chitturi HT Telugu

10 September 2022, 11:27 IST

google News
    • Tata Tiago EV : టాటా టియాగో ఈవీ లాంచ్​కి సిద్ధంగా ఉంది. ఈ నెలలోనే ఇది మార్కెట్​లోకి రానుంది.
లాంచ్​కి సిద్ధంగా టాటా టియాగో ఈవీ
లాంచ్​కి సిద్ధంగా టాటా టియాగో ఈవీ

లాంచ్​కి సిద్ధంగా టాటా టియాగో ఈవీ

Tata Tiago EV : టాటా మోటార్స్​ నుంచి మరో ఎలక్ట్రిక్​ కారు మార్కెట్​లోకి రానుంది. టాటా టియాగో ఈవీని ఈ నెలలోనే లాంచ్​ చేయనున్నట్టు ప్రకటించింది.

టాటా టియాగో ఈవీ..

దేశంలోని ఎలక్ట్రిక్​ వాహనాల రంగంలో అధిక మార్కెట్​ వాటా కలిగిన సంస్థగా టాటా మోటార్స్​ కొనసాగుతోంది. ఆ సంస్థ నుంచి ఇప్పటికే రెండు ఎలక్ట్రిక్​ కార్లు(టాటా నెక్సాన్​ ఈవీ, టాటా టిగోయ్​ ఈవీ) మార్కెట్​లో ఉన్నాయి. ఇక ఇప్పుడు వీటితో పాటు టాటా టియాగో ఈవీ కూడా చేరనుంది. అయితే.. టాటా టియాగో ఈవీకి సంబంధించిన ఇతర వివరాలను వెల్లడించలేదు టాటా మోటార్స్​. అయితే.. టాటా మోటార్స్​ నుంచి వస్తున్న చౌకైన ఎలక్ట్రిక్​ వాహనంగా టాటా టియాగో ఈవీ నిలుస్తుందని మార్కెట్​లో అంచనాలు ఉన్నాయి.

Tata Motors EV : వరల్డ్​ ఈవీ డేని పురస్కరించుకుని.. టాటా టియాగో ఈవీపై అప్డేట్​ ఇచ్చారు టాటా మోటార్స్​ ప్యాసింజర్​ వెహికిల్స్​ మేనేజింగ్​ డైరక్టర్​ శైలేశ్​ చంద్ర.

"ఇంతకాలం పాటు సాగిన మా ప్రయాణాన్ని వెనక్కి తిరిగి చూసుకునేందుకు ఇదొక మంచి రోజు(వరల్డ్​ ఈవీ డే). ఇండియాలో ఈవీ మార్కెట్​ను ముందుండి నడిపిస్తున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఈవీ సెగ్మెంట్​లో మాకు 88శాతం వాటా ఉంది. నెక్సాన్​ ఈవీ, టిగోర్​ ఈవీతో ముందడుగు వశాము. ప్రస్తుతం రోడ్డు మీద 40వేలకుపైగా టాటా ఈవీలు ఉన్నాయి," అని శైలేశ్​ చంద్ర పేర్కొన్నారు.

టిగోర్​ ఈవీ, నెక్సాన్​ ఈవీలో ఉపయోగించే జిప్​ట్రాన్​ టెక్నాలజీని టాటా టియాగో ఈవీలో కూడా ఉపయోగిస్తారని తెలుస్తోంది. ఎక్స్​ప్రెస్​ టీ టెక్నాలజీ కన్నా ఇది మెరుగైనదని సమాచారం.

ఇక డిజైన్​ విషయానికొస్తే.. టాటా టియాగోకు టియాగో ఈవీకి పెద్దగా వ్యత్యాసం ఉండకపోవచ్చు. అయితే.. ఒక్కసారి ఛార్జ్​ చేస్తే.. ఎన్ని కిలోమీటర్ల ప్రయాణ సాధ్యపడుతుంది? అన్నది అసలైన విషయం. టాటా టియాగో ఈవీకి సంబంధించిన ధర వంటి వివరాలను కూడా కంపెనీ వెల్లడించాల్సి ఉంది.

టాటాకు పోటీగా..

మహీంద్రా ఎక్స్​యూవీ400తో ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​లోకి అడుగుపెట్టింది ఎం అండ్​ ఎం. టాటా మోటార్స్​కు పోటీనిచ్చే విధంగా ప్రణాళికలు రచించింది. వాటికి చెక్​ పెట్టేందుకు.. ఈవీల ధరలు తగ్గించి, ప్రజలకు ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది టాటా మోటార్స్​.

తదుపరి వ్యాసం