Tata Motors electric cars : టాటా మోటార్స్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు- ధర చాలా తక్కువ!
Tata Motors electric cars : తక్కువ ధరలకే ఎలక్ట్రిక్ కార్లను తీసుకొచ్చి, ప్రజలకు మరింత చేరువయ్యే విధంగా టాటా మోటార్స్ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా.. త్వరలోనే కొత్త ఎలక్ట్రిక్ వాహనం మార్కెట్లోకి రానుంది.
Tata motors electric cars : దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల రంగంలో జోరు పెరుగుతోంది. ఈ రంగంలో ఇప్పటికే దూసుకెళుతున్న టాటా మోటార్స్‌కు.. కొత్త వెహికిల్ లాంచ్‌లతో పోటీనిచ్చేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా సన్నద్ధమవుతోంది. కాగా.. మహీంద్రా అండ్ మహీంద్రాకు చెక్ పెట్టే దిశగా టాటా మోటార్స్ ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది తొలినాళ్లల్లో.. అత్యంత సరమైన ధరకు మరో ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకొచ్చే విధంగా ఏర్పాట్లు చేసుకుంటోంది టాటా మోటార్స్.
తక్కువ ధరకే ఎలక్ట్రిక్ వాహనం..
సెప్టెంబర్ రెండో వారంలో.. ఎక్స్‌యూవీ400 విడుదలకానుంది. ఈ నేపథ్యంలో.. ఎలక్ట్రిక్ కార్ల ధరలను తగ్గించి ప్రజలకు మరింత చేరువయ్యే విషయంపై దృష్టిపెట్టింది టాటా మోటార్స్. నెక్సాన్ ఈవీ కన్నా తక్కు ధరకు కొత్త ఎలక్ట్రిక్ వాహనాన్ని తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికిల్స్ విభాగం మేనేజింగ్ డైరక్టర్ శైలేశ్ చంద్ర వెల్లడించారు.
Tata motors news : 2022-23 ఆర్థిక ఏడాది తొలి త్రైమాసికం నాటికి.. ఎలక్ట్రిక్ కార్ల రంగంలో టాటా మోటార్స్‌కు 88శాతం మార్కెట్ వాటా ఉంది. జనరేషన్-1, జనరేషన్-2 ఎలక్ట్రిక్ వాహనాలతో మార్కెట్ వాటాను మరింత పెంచుకోవాలని చూస్తోంది. ఈ క్రమంలోనే రానున్న నెలల్లో వరుస లాంచ్‌ను ప్లాన్ చేసింది!
పైగా.. మిడ్ సైజ్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ టాటా కర్వ్‌ను 2024 లాంచ్ చేస్తున్నట్టు గతంలోనే ప్రకటించింది టాటా మోటార్స్. ఇలా.. ప్రతి ఏడాది రెండు కొత్త ఎలక్ట్రిక్ కార్లను మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది టాటా మోటార్స్. అంటే.. ఈ కంపెనీ నుంచి వచ్చే ఐదేళ్లల్లో 10 కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి వస్తాయి!
నెక్సాన్ ఈవీ కన్నా తక్కువ ధరకు తీసుకొస్తున్న ఎలక్ట్రిక్ కారుపై ఈ ఏడాది చివర్లో టాటా మోటార్స్ ఓ ప్రకటన చేసే అవకాశం ఉంది. వచ్చే ఏడాది తొలినాళ్లల్లోనే దీని లాంచ్ ఉంటుంది. అయితే.. టాటా పంచ్ మోడల్ ఆధారంగా ఈ ఎలక్ట్రిక్ కారును రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది.
Tata motors : టాటా మోటార్స్ నెక్సాన్ ఈవీ మ్యాక్స్ ఎక్స్‌షోరూం ధర.. ప్రస్తుతం రూ. 17.7లక్షలుగా ఉంది. మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి రానున్న ఎక్స్‌యూవీ400 కూడా ఇదే ప్రైజ్ రేంజ్లో ఉండొచ్చు.
టాటా మోటార్స్ నెక్సాన్ వాహనాల వెయిటింగ్ పీరియడ్ ప్రస్తుతం 6 నెలలుగా ఉంది.
XUV400 electric car : టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ కార్లకు పోటీగా.. మరికొన్ని రోజుల్లో లాంచ్‌కానున్న మహీంద్రా అండ్ మహీంద్రా ఎక్స్‌యూవీ400 ఎలక్ట్రిక్ కారు ఫీచర్స్, ధరతో పాటు మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం