XUV400 : లాంచ్​కి సిద్ధంగా ఎక్స్​యూవీ400 ఎలక్ట్రిక్- ఎప్పుడంటే..-mahindras xuv400 electric to be launched on september 6 check price features ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Mahindra's Xuv400 Electric To Be Launched On September 6. Check Price, Features

XUV400 : లాంచ్​కి సిద్ధంగా ఎక్స్​యూవీ400 ఎలక్ట్రిక్- ఎప్పుడంటే..

Sharath Chitturi HT Telugu
Aug 21, 2022 03:28 PM IST

XUV400 launch date : ఎలక్ట్రిక్​ సెగ్మెంట్​పై కన్నేసిన మహీంద్రా అండ్​ మహీంద్రా.. ఎక్స్​యూవీ400 లాంచ్​కి సిద్ధమవుతోంది. ఈ ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ వివరాలు..

లాంచ్​కి సిద్ధంగా ఎక్స్​యూవీ400- ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ ఫీచర్స్ ఇవే..!
లాంచ్​కి సిద్ధంగా ఎక్స్​యూవీ400- ఎలక్ట్రిక్​ ఎస్​యూవీ ఫీచర్స్ ఇవే..! (Bloomberg)

XUV400 launch date : మహీంద్రా అండ్​ మహీంద్రా జోరు మీద ఉంది! భారత ఆటో రంగంలో ప్రత్యేక స్థానాన్ని దక్కించుకునే దిశగా అడుగులేస్తున్న ఈ సంస్థ.. ఇప్పుడు మరో వాహనంతో మార్కెట్​లోకి వస్తోంది. ఎక్స్​యూవీ400ని సెప్టెంబర్​ 6న లాంచ్​ చేయనుంది. ఈ ఎక్స్​యూవీ400 వివరాలను ఓసారి చూద్దాము.

ట్రెండింగ్ వార్తలు

ఇప్పటికే మార్కెట్​లో అందుబాటులో ఉన్న ఎక్స్​యూవీ300 వాహనానికి ఎలక్ట్రిక్​ వర్షెన్​ ఈ ఎక్స్​యూవీ400. ఈ ఎలక్ట్రిక్​ ఎక్స్​యూవీ400ని ఒక్కసారి ఛార్జ్​ చేస్తే 350-400 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది.

ప్రస్తుతం మార్కెట్​లో ఉన్న టాటా నెక్సాన్​ ఈవీకి.. ఈ ఎక్స్​యూవీ400 గట్టి పోటీని ఇస్తుందని అంచనాలు వెలువడుతున్నాయి. పైగా నెక్సాన్​ ఈవీకి.. 312కిలోమీటర్ల రేంజ్​ మాత్రమే ఉంది.

ఎక్స్​యూవీ400 ధర:-

ఎక్స్​యూవీ400లో ఏడీఏఎస్​(అడ్వాన్స్​ డ్రైవర్​ అసిస్టెన్స్​ సిస్టమ్​)తో పాటు డీఆర్​ఎల్​(డేటైమ్​ రన్నింగ్​ ల్యాంప్​), న్యూ హెడ్​లైట్​, న్యూ టైల్​ ల్యాంప్​ ఫీచర్స్​ ఉంటాయి.

XUV400 price : ఎక్స్​యూవీ400 ధర రూ. 15లక్షలుగా ఉండొచ్చని మార్కెట్​ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ధరపై మహీంద్రా అండ్​ మహీంద్రా ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

మహీంద్రా అండ్​ మహీంద్రా జోరు..

ఎస్​యూవీ సెగ్మెంట్​తో పాటు ఎలక్ట్రిక్​ వాహనాల రంగంలోనూ దూసుకెళ్లేందుకు బలమైన ప్రణాళికలే రచించింది మహీంద్రా అండ్​ మహీంద్రా. ఇటీవలే.. ఒకేసారి ఐదు ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలను ఆవిష్కరించింది.

ఎస్​యూవీ సెగ్మెంట్​లో బలంగానే ఉన్నప్పటికీ.. ఎలక్ట్రిక్​ వాహనాల పోటీలో మహీంద్రా అండ్​ మహీంద్రా కాస్త వెనకపడింది. మార్కెట్​లో.. ఆ సంస్థకు చెందిన ఎలక్ట్రిక్​ కారు(ఈ వెరిటో) ఒక్కటే ఉంది. ఇక తాజాగా ఈ ఐదు ఎలక్ట్రిక్​ ఎస్​యూవీలతో ఇందులోనూ తన మార్కెట్​ను పెంచుకోవాలని చూస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోను స్వాతంత్ర్యో దినోత్సవం నాడు విడుదల చేసింది.

కొత్త ఎస్​యూవీలను ఎక్స్​యూవీ- బీఈ అనే రెండు బ్రాండ్ల కింద అమ్మేందుకు ప్రణాళికలు​ రచిస్తోంది మహీంద్రా అండ్​ మహీంద్రా.

ప్రస్తుతం ఎలక్ట్రిక్​ వాహనాల సెగ్మెంట్​లో టాటా మోటార్స్​ది పైచేయి. కాగా.. టాటా మోటార్స్​ని ఢీకొట్టే విధంగా ప్రణాళికలు వేసింది మహీంద్రా అండ్​ మహీంద్రా. ఇందులో భాగంగా.. కొత్త ఎస్​యూవీలు.. 2024 చివరి నాటికి మార్కెట్​లోకి తీసుకురావాలని చూస్తోంది.

మహీంద్రా స్కార్పియో క్లాసిక్​:-

Mahindra Scorpio Classic price : మహీంద్రా స్కార్పియో క్లాసిక్​ ధరను ఎట్టకేలకు ప్రకటించింది మహీంద్రా అండ్​ మహీంద్రా. ఈ ఎస్​యూవీకి చెందిన ‘ఎస్’​ వేరియంట్​ ఎక్స్​ షోరూం ధర రూ. 11.99 లక్షలు. మహీంద్రా స్కార్పియో క్లాసిక్​ ‘ఎస్​11’ మోడల్​ ధర రూ. 15.49లక్షలు.

పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

WhatsApp channel

సంబంధిత కథనం